తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. రూ 85,705 కోట్ల విలువుగా చేసే 960 స్థిర ఆస్తులు ఉన్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కూడా తెలిపారు. ఈ నెల 27 నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీకి సంబంధించి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని వివరించారు. తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయాలు పెంచడంపై పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లురూ. సుబ్బారెడ్డి తెలిపారు. గోవర్థన సత్రాల వెనుక భాగంలో రూ. 95 కోట్లతో పీఏసి-5 నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాంమని, వకూళమాత…
Author: Editor's Desk, Tattva News
ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు, చైల్డ్ ఫోర్నోగ్రఫీపై సీబీఐ ఉక్కుపాదం మోపుతోంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేసే వాళ్ల ఆటకట్టించేందుకు ‘ఆపరేషన్ మేఘ చక్ర’ ఏర్పాటు చేసింది. ఇలాంటి రెండు కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు 20 రాష్ట్రాల్లోని 56 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. న్యూజిలాండ్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ సింగూపూర్ అందించిన సమాచారం ఆధారంగా ఈ శోధనలు జరిగినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఏఎమ్)ను అరికట్టే చర్యల్లో సీబీఐ చేస్తున్న అతిపెద్ద ఆపరేషన్ ఇది. సింగపూర్ ఇంటర్‌పోల్ నుంచి ఇన్‌పుట్స్, క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించి ఇంటర్నెట్‌లో సీఎస్ఏఎమ్ పెడ్లర్లకు వ్యతిరేకంగా గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ కార్బన్ సమయంలో లభించిన సమాచారంగా ఈ సోదాలు జరిగాయి. ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ ను వ్యాప్తి చేసే వ్యక్తులు, ముఠాలు వాటి ద్వారా మైనర్లను లైంగికంగా, శారీరకంగా…
దేశీయంగా బియ్యం ధరల పెరుగుదల కొనసాగవచ్చని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే దేశంలో బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం అంచనా వేసింది. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో బియ్యం ఉత్పత్తి 117.76 మిలియన్ టన్నులుగా ఉంటే, అది ఈ ఏడాది 104.99 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని వివరించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిన తర్వాత రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి పై ప్రకటన రావటం గమనార్హం. దేశంలో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి రోజువారీ సగటు రిటైల్, హోల్‌సేల్ ధరలు ఏడాది క్రితం కంటే 9 నుంచి 20 శాతం పెరిగిన రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏడాది క్రితం వాటి ధరలతో…
మరో 6 నుంచి 10 నెలల్లోగా పార్లమెంటు ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు. అయితే, నూతన టెలికాం బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం తొందరపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ, విస్తృత సంప్రదింపుల తర్వాతే తుది డ్రాఫ్ట్ ను రూపొందిస్తామని తెలిపారు. తుది డ్రాఫ్ట్ ను తొలుత పార్లమెంట్ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతే పార్లమెంట్లో ప్రవేశపెడతామని తెలిపారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇండియన్ వైర్ లెస్ టెలీగ్రఫీ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధ స్వాధీనం) యాక్ట్ 1950 స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 20 లోపు నూతన టెలికాం బిల్లుపై ప్రజాభిప్రాయం సేకరిస్తామని వెల్లడించాయిరు. ఇంటర్నెట్ ద్వారా ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్, మెసేజింగ్ సేవలు…
కాలానుగుణ మార్పులతో రచయిత పాత్ర, కర్తవ్యం, కార్యాచరణ లక్ష్యాలుగా ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించనున్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ ఏడాది డిసెంబర్ 23,24 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు నిర్వహించనున్నట్లు మహా సభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ తెలిపారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్వహించనున్న ఈ మహా సభల్లో తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న సాహితీ మూర్తలు పాల్గొనాలని వారు కోరారు. రెండు రోజుల పాటు జరిగే సభలకు రచయితలు, సాహిత్య అభిమానులు అక్టోబర్ 31వ తేదీలోగా 93912 38390 నంబర్‌కు ఆన్‌లైన్ ద్వారా రూ.500 ప్రతినిధి రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని…
దసరా సెలవుల తరువాత జమ్ముకాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 20కి పైగా పిటిషన్లు అత్యునుత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాలు (2020 మార్చి 2 నుంచి)గా ఈ పిటిషన్లపై విచారణ జరగలేదు. శుక్రవారం ఈ పిటిషన్లకు సంబంధించిన అంశాన్ని సిజెఐ యుయు లలిత్ ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ప్రశాంతో సేన్ అత్యవసరంగా ప్రస్తావించారు. దీనికి జస్టిస్ లలిత్ స్పందిస్తూ దసరా సెలవుల తరువాత జాబితా చేస్తామని తెలిపారు. సుప్రీం కోర్టుకు అక్టోబర్ 3 నుంచి వారం రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 10న సుప్రీం కోర్టు తిరిగి పున్ణప్రారంభమవుతుంది.…
పర్యావరణానికి హాని చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ గుజరాత్‌లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ అండ గల ”అర్బన్ నక్సల్స్, ప్రగతి నిరోధక శక్తులు” అనేక సంవత్సరాల పాటు అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అటువంటి అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ చురుకుగా ఉన్నారని, పర్యావరణ పరిరక్షణ పేరుతో వివిధ సంస్థల మద్దతుతో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ప్రధాని హెచ్చరించారు. గుజరాత్‌కు చెందిన నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ వద్ద రెండు రోజులపాటు జరుగుతున్న జాతీయ పర్యావరణ మంత్రుల సమావేశాన్ని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబహిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా ఈజ్ ఆఫ్ లైఫ్ తీసుకురావాలన్న లక్షంతో చేపట్టిన ప్రాజెక్టులు అనవసర కారణాలతో ఆగిపోకుండా చూడాలని ఆయన వివిధ రాష్ట్రాలక పర్యావరణ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. అటువంటి శక్తుల కుట్రలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో సమతుల…
ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 4.37 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు ఏర్పాటు చేసింది. ఇంతేకాకుండా గుర్తించిన ఆరు రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో 1.10 ఔషధ విలువలు గల మొక్కలను పంపిణీ చేసింది. ప్రస్తుతం అమలు జరుగుతున్న పోషకాహార మాసంలో పెద్ద సంఖ్యలో పెరటి తోటలు/ చేపల పెంపకం కేంద్రాలు గల పోషకాహార తోటల లేదా రెట్రో-ఫిట్టింగ్ పోషణ వాటికలు నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతవరకు దేశంలో 1.5 లక్షల పెరటి తోటలు/ చేపల పెంపకం కేంద్రాలు గల పోషకాహార తోటల లేదా రెట్రో-ఫిట్టింగ్ పోషణ వాటికలు ఏర్పాటు అయ్యాయి. చిరుధాన్యాల సాగు చేయడానికి ,మరియు పెరటి తోటలు ఏర్పాటు చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించేందుకు 1.5 లక్షల అవగాహన కార్యక్రమాలు జరిగాయి. పోషకాహార మాసంలో భాగంగా పోషణ వాటికల నమూనాను ప్రతిబింబించే విధంగా 40 వేల అంగన్వాడీ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసం…
ఇరాన్ దేశంలో హిజాబ్‌పై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఓ మహిళా జర్నలిస్టు సాక్షాత్తూ ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి షాక్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇబ్రహీం రైసీ న్యూయార్క్ నగరానికి వచ్చారు.ఈ సందర్భంగా యూఎస్ ఇరానీయన్ అయిన సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియానా అమన్‌పూర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసీ అంగీకరించారు. అయితే ఇంటర్వ్యూకు ముందు జుట్టును హిజాబ్‌తో కప్పి ఉంచుకోవాలని ఇరాన్ అధ్యక్షుడి సహాయకురాలు క్రిస్టియానాకు ఆదేశించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా.. హెడ్‌స్కార్ఫ్ ధరించని మహిళతో ఇంటర్వ్యూ చేయలేమని రైసి ప్రతినిధి చెప్పినట్లు అమన్‌పోర్ వెల్లడించారు. దీంతో తాను హిజాబ్ ధరించను అని జర్నలిస్ట్ క్రిస్టియానా స్పష్టం చేసింది.హిజాబ్ ధరించకుంటే ఇంటర్వ్యూ జరగదని అధ్యక్షుడి సహాయరాలు స్పష్టం చేశారు. హిజాబ్ ధరించనని జర్నలిస్ట్ చెప్పడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెళ్లిపోయారు.దీంతో జర్నలిస్ట్ క్రిస్టియానా ట్వీట్‌లతో పాటు, ఇరాన్…
తాను అనుసరించే విధానాల కారణంగా ఏర్పడిన అపోహలను తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ తరచు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కలుస్తుండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలతో కూడిన సంకలనం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ పుస్తకాన్ని వెంకయ్య నాయుడు శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆరోగ్య రక్షణ, విదేశాంగ విధానం, టెక్నాలజీ తదితర అనేక రంగాలలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను ప్రశంసించారు. భారతదేశ విజయాలను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోందని ఆయన చెప్పారు. భారతదేశం ఇప్పుడు బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా భారత్ గొంతుక వినపడుతోందని ఆయన అన్నారు. అతి తక్కువ కాలంలో ఇది సాధించడం అసాధారణమని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ కార్యాచరణ, ఆయన ప్రజలకు అందచేస్తున్న మార్గదర్శనంతోనే భారత్‌లో ఈ అభివృద్ధి సాధ్యమైందని వెంకయ్య స్పష్టం చేశారు. ప్రధాని మోదీ …