Author: Editor's Desk, Tattva News

జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి.  ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతాసిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని, భారీ కాల్పులు జరిగాయని ఇండియన్‌ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 20 నిమిషాలకుపైగా కాల్పులు జరిగాయని పేర్కొంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కొద్దిసేపు ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారని, అయితే సవాళ్లతో కూడిన భూభాగం, దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ ఆర్మీ ఆఫీసర్​ నేతృత్వంలోని ధైర్యవంతులైన…

Read More

రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ ఎంపిలు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్ సింగ్, మహేశ్ జెఠ్మలానీ పదవీకాలం శనివారంతో ముగిసింది. దీనితో ఎగువ సభలో బిజెపి సంఖ్యా బలం 86కు తగ్గింది. ఫలితంగా ఎన్‌డిఎ మెజారిటీ కూడా తగ్గిపోయింది.  రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా, 20 ఖాళీలు ఉన్నాయి. దీనితో సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113 కంటే తక్కువగా ఎన్‌డిఎ సంఖ్యా బలం 101గా ఉన్నది. మెజారిటీకి ఎన్‌డిఎకు ఇంకా 12 మంది అవసరం అవుతారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వద్ద మొత్తం 87 మంది రాజ్యసభ ఎంపిలు ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే, కాంగ్రెస్‌కు 26 మంది, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి 13 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), డిఎంకె పార్టీలకు చెరి 10 మంది రాజ్యసభ ఎంపిలు ఉన్నారు. ఎన్‌డిఎ, ఇండియా కూటములలో లేని వైసీపీకి 11 మంది,…

Read More

ప్రముఖ సినీ నటి ర‌కుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమ‌న్ ప్రీత్ సింగ్‌ ను డ్రగ్స్‌ సేవిస్తుండగా హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ అమన్‌ ప్రీత్ సింగ్‌కు టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయిందని పేర్కొన్నారు. ఈ కేసులో అమన్‌ ప్రీత్‌ సింగ్‌ను వినియోగదారుడిగానే విచారిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశామని, పరారీలో మరో ఇద్దరున్నారని చెప్పారు. పరారీలో ఉన్నవారిలో కీలక సూత్రధారి నైజీరియన్‌ అని తెలిపారు. డ్రగ్స్‌ వ్యాపారంలో ఓనౌహది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఓనౌహ నైజీరియా నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. డ్రగ్స్‌ సరఫరాలో ఓ కొరియోగ్రఫర్ కూడా ఉన్నారు. డ్రగ్స్‌ తీసుకుంటున్న ఐదుగురి నుంచి శాంపిల్స్‌ తీసుకున్నాం. 2 పాస్‌పోర్టులు, 10 సెల్‌ఫోన్లు, 2 బైకులు సీజ్‌ చేశామని సీపీ శ్రీనివాస్‌ చెప్పారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో యాక్టివ్‌గా ఉందని.. డ్రగ్‌ పెడ్లర్లకు సంబంధించిన సమాచారం అందిస్తే..…

Read More

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంపై శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  అయితే, ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ ఎస్‌సీ శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.  సీబీఐ కేసును రద్దు చేయాలని శివకుమార్ గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు.  ఈ విషయంలో మూడునెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 2013-18 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శివకుమార్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లుగా సీబీఐ…

Read More

తమకు తెలియకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వివాదాస్పదమైన అధికారులకు కీలక పోస్టులను అప్పచెప్పుతున్న ముఖ్యమంత్రికి పాలనా యంత్రాంగంపై అదుపు తప్పుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెంటనే జీపీఎస్ జీవోను.. గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీపీఎస్‌ గెజిట్‌ జారీపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) స్థానంలో జీపీఎస్ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనికి…

Read More

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌ అకౌంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 100 మిలియన్లు, అంటే 10 కోట్లను అధిగమించింది. ఈ స్థాయిలో ఫాలోవర్లు ఉన్న దేశాధ్యక్షుడు గానీ, ప్రధానమంత్రి గానీ మరొకరు లేరు. గతంలో కూడా 100 మిలియన్లను అందుకున్న వారు మరెవరూ లేరు కూడా. ప్రత్యేకించి గత మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2021 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లుగా ఉండేది. తాజాగా ఇప్పుడది 100 మిలియన్లను అధిగమించింది. జాతీయ, అంతర్జాతీయంగా దీనితో పోటీ పడే మరో నేత లేకపోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారు 26.40 మిలియన్ల మంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ 27.5, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ 19.9, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- 7.4,…

Read More

’’అభివృద్ధిని చూసి కాంగ్రెస్​లో చేరుతున్నారని మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా, నిజంగా మీరు అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు. పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్​లో చేరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీతులు వల్లించడం సిగ్గు చేటన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న కుట్రలో భాగమేనని మండిపడ్డారు. బీఆర్ఎస్​ను కాపాడుకోవడానికి కేసీఆర్, దొంగ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. కేసీఆర్ హయాంలో తనతోపాటు బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన…

Read More

అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  హత్యాయత్నం జరిగింది. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిపై నుంచి దూసుకెళ్లింది. నిందితుడు థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌ని సెక్షన్ల వ్యవధిలోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మట్టుబెట్టారు.  అయితే యూఎస్‌లో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తలపడుతున్నారు. అయితే ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా కలిసొచ్చేట్లు కనిపిస్తోంది. ట్రంప్‌నకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తుండటంతో పాటు స్వదేశంలో కూడా ప్రజల మద్దతు అనూహ్యంగా పెరిగిందని పోల్‌స్టర్, విలియం హిల్ బెట్టింగ్ సంస్థల నివేదికలు తెలిపాయి.…

Read More

సాక్షాత్తు మాజీ సీఎస్, గత ప్రభుత్వంలోని పెద్దలు విశాఖ కేంద్రంగా జరిపిన భూ దోపిడీని బయటకు తీస్తామని, విశాఖ ఫైల్స్ పేరుతో ఆ వివరాలను విడుదల చేస్తామని మాజీ మంత్రి, భీమిలి ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే విశాఖను భూకబ్జాలకు నిలయంగా మార్చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో దందాలతో కబ్జాలకు పాల్పడిన నాయకుల లెక్క తెలుస్తామని గంటా ప్రకటించారు. ప్రజల విజ్ఞప్తులతో సంబంధం లేకుండా ఏకపక్షంగా డిజైన చేసిన భోగాపురం, భీమిలి బీచ్ రోడ్డు అలైన్ మెంట్ ను అవసరమైన చోట్ల మారుస్తామని తెలిపారు.పంచ గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకే కాకుండా ఖాళీ స్థలాలు, రైతులకు కూడా న్యాయం చేస్తామని వివరించారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే విశాఖను భూకబ్జాలకు నిలయంగా మార్చేశారని విమర్శించారు. నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పోస్టర్ ను…

Read More

దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరుచుకుంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆ రహస్య గది తలుపును తెరిచారు ప్రత్యేక కమిటీ సభ్యులు. ఈ మేరకు ఒడిశా సీఎం కార్యాలయం ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యుడు సిబికె మహంతి, ఆలయ పాలనాధికారా అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్ సి. పాల్, పూరీ రాజ ప్రతినిధితో సహా ఐదుగురు ఆలయ సేవకులు వీరిలో ఉన్నారు. అయితే ఈ ప్రక్రియకు ముందు రత్న భాండాగరం తిరిగి తెరిచేందుకు అనుమతి కోరే ‘అగ్న్యా’ అనే పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ ప్రక్రియకు సంబంధించిన పూజలు పూర్తి చేసి గది…

Read More