ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలతో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. శుక్రవారం ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం సు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. తన అరెస్ట్ అక్రమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో పలు అంశాలు, సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, ప్రజలు కేజ్రీవాల్‌ను ఎన్నుకున్నారని, ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనేది ఆయన ఇష్టమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌కు రూ.100 కోట్ల ముట్టాయనేది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రిని మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో గత నెల రౌజ్ అవెన్యూ…
Author: Editor's Desk, Tattva News
ఏపీలో గ్రామీణ రహదారులకు మహర్దశ కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతోపాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలని చెప్పారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. సమీక్షలో ఎ.ఐ.ఐ.బి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి పవన్…
ప్రశ్నాపత్రం లీకేజీతోసహా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీట్ యుజి-2024 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను జులై 18వ తేదీకి సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) బుధవారం సమర్పించిన అఫిడవిట్ల ప్రతులు తమకు అందలేదని కొందరు న్యాయవాదులు కోర్టుకు తెలియచేయడంతో విచారణను వచ్చే గురువారానికి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వాయిదా వేసింది. గురువారం కొద్దిసేపు జరిగిన విచారణ సందర్భంగా తదుపరి విచారణను జులై 15వ తేదీకి వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండనని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా నీట అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ తమకు స్టేటస్ రిపోర్టును అందచేసిందని ధర్మాసనం తెలిపింది. కాగా..కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు…
కేంద్ర సాయుధ దళాల్లోని 10 శాతం కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్‌లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) హెడ్‌క్వార్టర్స్‌లో ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తెలిపారు. 2022 జూన్ 14న ఎన్డీయే సర్కార్ అగ్నిపథ్ పథకం తీసుకొచ్చింది. సాధారణ సైనికులతో పోలిస్తే వీరికి లభించే జీతభత్యాలు తక్కువ ఉంటాయి. పైగా సర్వీసు నాలుగేళ్లకే పరిమితం. రిక్రూట్ అయిన అగ్నివీర్‌లలో 25 శాతం మందికి మరో 15 ఏళ్ల పాటు సర్వీసును పొడిగిస్తారు. మిగిలిన 75 శాతం మందిని తొలగిస్తారు. వారు బయట కొత్తగా ఉద్యోగాల వేటలో పడాల్సిందే. పైగా అగ్నివీర్‌లకు పింఛన్, గ్రాట్యుటీ ఉండవు. ఏకమొత్తంగా కొంత సొమ్ము చెల్లిస్తారు. విపక్షాల నిరసనలతో ప్రభుత్వంత గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. అగ్నిపథ్ పథకంపై…
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనే లేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టంచేశారు. ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అందుకోసమే స్టీల్ ప్లాంట్‌ను నేరుగా సందర్శించి, అధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. కార్మికుల సమస్యలపైనా చర్చించామని కుమారస్వామి తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తారని ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈ విషయం చెప్పడానికి ముందు ప్రధాని అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సంబంధించిన విషయాలన్నీ ప్రధానికి నివేదించి ఆయన్ను ఒప్పించాలి. ఇప్పటికే ఈ విషయాలన్నింటిపై అధికారులతో చర్చించి ఓ నోట్ తయారుచేస్తున్నాం. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను తిరిగి గాడిన పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నాం” అని కేంద్రమంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ…
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు ప్రభుత్వ విప్‌లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఆర్థికాంశాల గురించి మంత్రి జూపల్లికృష్ణారావు గురువారం సమీక్షించారు. ఉదయం 11 గంటలకు సమీక్ష ప్రారంభం కాగా, సాయంత్రం వరకు కొనసాగింది. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ ఎన్ని రోజులు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ సమావేశాల్లో పూర్తి…
ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ సర్వమానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని చెబుతూ 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి భారతీయులను ఉద్దేశించి ఈ మేరకు ప్రసంగించారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ‘భారత్ చేసే ఆలోచనలు, పనులను ప్రపంచం మొత్తం నిశితంగా గమనిస్తున్నాయి. వేల సంవత్సరాలుగా భారత్ తమ నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోంది. తద్వారా యుద్ధానికి బదులుగా శాంతి, సామరస్యాన్ని ప్రచారం చేస్తోంది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను విశ్వబంధుగా చూస్తోంది. అది మనందరికీ గర్వకారణం’ అని ప్రధాని తెలిపారు. `దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. తర్వాత వెయ్యేళ్ల పాటు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం గతంలో జరిగిన అవకతవకలపై సీరియస్‌గా స్పందిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకోగా.. తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిలు పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. విజయ్ కుమార్ రెడ్డి మీద జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదులు ఇచ్చాయి. ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయగా.. కేంద్రంలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లిన విజయ్ కుమార్ రెడ్డి వెనక్కు వచ్చారు. దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవాణి టిక్కెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీటీడీని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి విరాళాలు…
సోషల్ మీడియాలో రోస్టింగ్ కామెడీ ముసుగులో తండ్రి కూతురుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్‌ను ఎట్టకేల కు బెంగళూరులో అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరా బాద్‌కు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. లైవ్ చాట్ లో తన మిత్రులతో కలిసి వల్గారిటీ, డబుల్ మీనింగ్ మాటల తో ప్రణీత్ టీమ్ రెచ్చిపోయిన సంగతి విదితమే. సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేసిన వీరి వ్యవహారంపై హీరో సాయిధరమ్ తేజ్ తెలంగాణ ముఖ్యమం త్రితో పాటు మరి కొంత మంది ప్రముఖుల దృష్టికి సోషల్ మీడియా వేదికగా తీసుకువెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో ఉన్న స్వేచ్ఛతో ప్రణీత్ గ్యాంగ్ చేస్తున్న జుగుప్సకరమైన డార్క్ కామెడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణీత్ తో పాటు మరో ముగ్గురి పై…
కర్ణాటకలో ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన కుటుంబంపైనే తీవ్ర ఆరోపణలు రావడం పెను సంచలనంగా మారింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ -ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబానికి పాత్ర ఉందని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోని మైసూరులోని విజయనగర్ పోలీస్ స్టేషన్‌లో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతమ్మ, కుమారుడు కర్ణాటక ఎమ్మెల్సీ యతీంద్ర కూడా ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మొత్తం 9 మందిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కుంభకోణం సీఎం సిద్ధరామయ్య కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటివరకు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ముడా స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ భారీగా లబ్ధి పొందారని తాజా ఫిర్యాదులో ఆరోపించారు. ముడా భూ కేటాయింపుల కుంభకోణంలో…