Author: Editor's Desk, Tattva News

కేరళ వాయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ నాయకులు దాడి చేసారు. సుమారు వందకు పైగా నాయకులు జెండాలు, కర్రలతో చొచ్చుకొని వచ్చి కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.  కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్‌ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్‌ జోక్యం చేసుకోవడం లేదని నిరనసకు దిగిన ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ భద్రత పెంచారు. ఈ దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కేరళలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని ఈ దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడి జరగడం దారుణమని అంటూ బఫర్‌ జోన్‌ అంశంపై పోరాడుతున్నట్లుగా వారు చెప్పారని, అయితే దీనితో రాహుల్‌ గాంధీకి సంబంధం ఏమిటో…

Read More

 కోనసీమ జిల్లాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ  మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు బిల్లుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.  సచివాయలంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి  అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపారు.  అలాగే కొత్తగా ఏర్పాటు  చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీసీ జీవోలో చేసిన మార్పులకు సంబంధించి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం…

Read More

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందువల్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి  ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ శుక్రవారం క్యూ లైన్ ఆస్థాన మండపం దాటిందని చెప్పారు. శనివారం కూడా రద్దీ క్రమేపీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత కొన్ని నెలలుగా గురువారం నుంచి ఆదివారం వరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోందని ఈవో వివరించారు. ఇందుకై ఆలయంలో, సన్నిధి నుండి వెండి వాకిలి, వెండివాకిలి నుండి మహద్వారం వరకు అదనంగా అధికారులను నియమించి, షిఫ్ట్ ల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రద్దీ రోజుల్లో రోజుకు 90 వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారని  ధర్మారెడ్డి చెప్పారు. క్యూ లోని భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు ఇబ్బంది లేకుండా అందించేందుకు…

Read More

ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్  ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఒడిశా నుండి ఇప్పటికే ఢిల్లీకి వచ్చిన ఆమె  ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆమె వెంట ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల నేతలు ఉన్నారు. ఆమె నామినేషన్‌ పత్రాలను ప్రధాని మోది  రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ముర్ము అభ్యర్థిత్వం కోసం బిజెపి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసింది..  వీటిపై ప్రధాని మోదీతో పాటు సీనియర్‌ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సంతకాలు చేశారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, భూపేందర్‌ సింగ్‌ పటేల్‌తో సహా బిజెపి నేతృత్వంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ మహిళలు, గిరిజన ఎంపిలు, బిజెపి ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఎన్‌డిఎతో…

Read More

శివసేన ఎమ్యెల్యేల మీదనే కాకుండా, పార్టీపై కూడా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే పట్టు కోల్పోయిన్నట్లు కనిపిస్తున్నది. తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండే బలం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో, థాకరే శిబిరం ఉనికి కోల్పోతున్నది.  ఇక ఆయన ప్రభుత్వ పతనం అనివార్యంగా కనిపిస్తున్నది.  అసోం గౌహతిలో రాడిసన్ బ్లూ హోటల్లో ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల శిబిరంలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 మందికి చేరినట్టు తెలుస్తోంది. షిండేతో సహా  12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ కు థాకరే వర్గం సిఫారసు చేసినా ఫలితం కనిపించడం లేదు.  శాసనసభలో విప్ ధిక్కరిస్తే అనర్హత అంశం తెరపైకి వస్తుంది గాని, పార్టీ సమావేశాలకు వర్తించదని అంటూ ఓ ట్వీట్ లో ఎకనాథ్ షిండే ఎద్దేవా చేశారు. ఇటువంటి చర్యలతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు.    గురువారం సీఎం ఉద్దవ్ థాకరే ఏర్పాటు చేసిన సమావేశానికి కేవలం 13 మంది ఎమ్యెల్యేలే హాజరయ్యారు.  10 మంది ఎంపీలు కూడా షిండే గ్రూపులో చేరినట్లు…

Read More

ఆసియాలో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ సమాజ సేవ కోసం రూ.60 వేల కోట్లు (7.7 బిలియన్ డాలర్లు) విరాళంగా ప్రకటించారు. అదానీ తన 60వ జన్మదినం సందర్భంగా ఈ వితరణ చేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం అదానీ ఫౌండేషన్ ఈ విరాళం ప్రకటించింది. గురువారం బ్లూమ్‌బర్గ్ ఇంటర్వూలో అదానీ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ఫౌండేషన్ చేసిన సహాయం దేశీయ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దది, ‘నా తండ్రి శాంతిలాల్ అదానీ జన్మ శతాబ్ది సంవత్సరాన్ని కూడా గౌరవిస్తాం’ అదానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి ఈ మూడు విభాగాలకు నిధులను కేటాయింపు కోసం మూడు నిపుణుల కమిటీలను వచ్చే నెలల్లో ఏర్పాటు చేసి, ఆ తర్వాత నిధులను కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ కమిటీలో అదానీ కుటుంబం నుంచి సభ్యులు ఉంటారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్…

Read More

మొన్నటి వరకు తగ్గుముఖం పడుతూ వస్తున్న కరోనా దేశంలో మళ్ళి విజృంభిస్తున్నది.  త‌గ్గుముఖం ప‌ట్టిన కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గురువారం 13 వేల మంది కరోనా బారినపడగా, నేడు కొత్తగా 17,336 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,62,294కు చేరాయి.  ఇందులో 4,27,49,056 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,954 మంది మృతిచెందారు. మరో 88,284 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మరణించగా, 13,029 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు ఉన్నాయి. కేరళలో 3890 కేసులు, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి.  కాగా, పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.20 శాతం, రికరీ రేటు…

Read More

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలతో కూడిన ప్రతిష్టాకరమైన జి20 కూటమి శిఖరాగ్ర సదస్సుకు మొదటిసారిగా భారత్ఆ వచ్చే ఏడాది తిధ్యమివ్వనుంది.  భారత్ ను ఈ సదస్సును జమ్మూకాశ్మీర్ లో నిర్వహించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకట్టుకోనుంది.  ఈ సదస్సు సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ జూన్‌ 23న కేంద్ర పాలిత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమ్ముకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే కావడం విశేషం. 1999లో జి-20 సదస్సు ప్రారంభమైనప్పటి నుండి భారత్‌ సభ్య దేశంగా ఉన్నప్పటికీ భారత్ లో ఎప్పుడు ఈ సదస్సు జరగలేదు.  2014 నుండి ఈ శిఖరాగ్ర సమావేశాలకు భారత్‌ తరుపున ప్రధానినరేంద్ర మోదీ పాల్గొంటూ వస్తున్నారు. జి 20 సభ్యదేశాల్లో ఉన్న ఓ దేశం…

Read More

ఇంధనం కొరతతో కకావికలమై పోతున్న శ్రీలంక దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు శ్రీలంక పార్లమెంటు వారం సమావేశాలను రద్దు చేసింది. వినాశకరమైన ఆర్థిక సంక్షోభంలో వున్న దేశం ఇప్పటికే ఇంధన సరఫరాలను వేగంగా తగ్గిస్తోంది. క్టిష్టమైన విదేశీ కరెన్సీ కొరత కారణంగా దిగుమతిదారులు ఆహారం, చమురు, ఔషధాల కొనుగోళ్లకు ఆర్థిక సహాయం చేయలేకపోయారు. అనవసర ఇంధన వినియోగాన్ని నివారించేందుకు గురు, శుక్రవారాల్లో సమావేశాలు నిర్వహించకూడదని శాసనసభ్యులు నిర్ణయించుకున్నారని, ఇదే కారణంతో పాఠశాలలు, కొన్ని రాష్ట్ర కార్యాలయాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.  ఇంధనశాఖ మంత్రి కాంచన విజేశేఖర కొలంబోలో విలేకరులతో మాట్లాడుతూ ”గురువారం రావాల్సిన గ్యాసోలిన్‌ షిప్‌మెంట్‌ రావడం ఆలస్యమైందని, అందుకని వాహనదారులు తమ ప్రయాణాలను తగ్గించుకోవాలని కోరారు. ఈరోజు, రేపు పంపింగ్‌ స్టేషన్లకు పరిమిత మొత్తంలో మాత్రమే పెట్రోల్‌ పంపిణీ చేయబడుతుందని” పేర్కొన్నారు. వాహనదారులు ఇప్పటికే ఇంధనానికి రోజుల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ…

Read More

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రింకి శర్మ భూయాన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అసోంలో కరోనా పిపిఇ కిట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని పేర్కొంటూ సిసోడియా తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలకు దిగడంపై రింకి శర్మ స్పందించారు.  ఇప్పటి సిఎం హిమంత రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా తీవ్రత దశలో పిపిఇ కిట్ల కుంభకోణం చోటుచేసుకుందని, శర్మ భార్య, కుమారుడి కంపెనీల నుంచి కిట్స్ తెప్పించి, ఇతర కంపెనీల కన్నా ఎక్కువ ధరలక కాంట్రాక్టు ఇచ్చారని ఇటీవల సిసోడియా విలేకరుల సమావేశంలో ఆరోపించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకించారు.  ఈ ఆరోపణకు వ్యతిరేకంగా రింకి శర్మ స్పందించి కోర్టుకు వెళ్లారు. పరువు నష్టం దావా వేశారు. దీనితో ఈ నెల 25న సిసోడియా కామ్రూప్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని వీలు కాకపోతే తన…

Read More