Author: Editor's Desk, Tattva News

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ప్రతిపక్ష లేబర్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్‌లో ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బట్టి లేబర్ పార్టీ 354 స్థానాల్లోనూ, కన్జర్వేటివ్ పార్టీ కేవలం 74 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మొదటి నుండి లేబర్ పార్టీ భారీ మెజారిటీతో సీట్లను గెలుస్తుంది. 1997లో టోనీ బ్లెయిర్ తర్వాత లేబర్ పార్టీ ఘన విజయం సాధించనుంది. స్థిరమైన మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీ విజయం సాధించనుంది. 650 సీట్లలో లేబర్ 410 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్‌లకు అనుగుణంగా ఫలితాలు ఉన్నాయని ఎన్నికల నిపుణులు తెలిపారు. దీంతో ఓటమిని అంగీకరించిన భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజల తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు. ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు తన…

Read More

 గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేలా ఏపీ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ విషయమై హోమ్ మంత్రి వి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో తొలిసారి భేటీ జరిపి 100 రోజుల కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.  మంత్రివర్గ ఉపసంఘం గంజాయి నివారణ, గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించింది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలు గిరిజనులకు ఇచ్చిన భూముల్లో కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు పంటలు పండించకుండా గంజాయిని సాగు చేసేలా ప్రోత్సహించినట్లు గుర్తించారు. గిరిజనులు గంజాయి సాగుకు దూరంగా ఉండాలని ఈ విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గంజాయి సాగు మొదలుకుని వినియోగం వరకు జరిగే వివిధ ప్రక్రియలను అరికట్టాలంటే క్షేత్ర స్థాయిలోని పోలీసుల సహకారం తప్పనిసరని హోం మంత్రి అనిత ఈ భేటీలో ప్రస్తావించారు. ఇసుక, మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణాను…

Read More

17ఏళ్ల తర్వాత టి20 ప్రపంచకప్‌ సాధించిన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలి వచ్చారు. విశ్వ విజేతలుగా స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు తొలుత అపూర్వ స్వాగతం లభించింది. మువ్వన్నెల జెండాలు చేతబూనిన అభిమానులతో ముంబయిలోని నారీమన్‌ బీచ్‌రోడ్డు కిక్కిరిసింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టాప్‌లెస్‌ బస్సులో ట్రోఫీని చూపుతూ ఆటగాళ్లు అభిమానులను ఉత్సాహపరిచారు. అశేషమైన అభిమానులు దారిపొడవునా నీరాజనాలు పలుకుతూ ‘జయహో టీమిండియా’ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ ‘విక్టరీ పరేడ్‌’ వాంఖడే స్టేడియం వరకు(సుమారు రెండు కిలోమీటర్లు) సాగింది. బార్బొడాస్‌లో వర్షాల కారణంగా నిలిచిన ఆటగాళ్ల కోసం బిసిసిఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆటగాళ్లకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ కలిసి టీమిండియా ఆటగాళ్లు ముంబయికి బయల్దేరి వెళ్లారు. టి20 ప్రపంచకప్‌ సాధించిన టిమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో…

Read More

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత తొలిసారిగా మూడు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం (పిఎంఓ)లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు ఏకాంతంగా చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌లో రాష్ట్రానికి ఆర్థిక సాయం, పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు ఆమోదం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసిన మొత్తం రీయంబ‌ర్స్ చేయాల‌ని కోరారు. అలాగే పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న విభ‌జ‌న హామీల ప‌రిష్కారం అంశాల‌ను చంద్ర‌బాబు లేవ‌నెత్తారు. ప్ర‌ధానిమోదీ, సీఎం చంద్ర‌బాబు మధ్య రాజ‌కీయ చ‌ర్చ కూడా జ‌రిగిన‌ట్లు తెలిసింది. రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితులు, కూట‌మి ప్ర‌భుత్వ పాల‌నపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్‌డీఏ ప్ర‌భుత్వాలు ఉండ‌టంతో రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిల‌ను విడుద‌ల‌ చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ఢిల్లీ…

Read More

జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీవీ రాధాకృష్ణన్‌ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్‌ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్‌ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి ఆయనకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.  ఆ తర్వాత హేమంత్‌ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. సోరెన్‌ సీఎంగా ప్రమాణం ప్రమాణం చేయడం ఇది మూడోసారి. కేవలం సోరెన్‌ మాత్రమే ప్రమాణస్వీకారం చేయగా.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది.ఆ తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జార్ఖండ్‌లో మహాకూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. జార్ఖండ్‌ ప్రయోజనాల కోసం అన్ని పనులను తమ ప్రభుత్వం చేపడుతున్నదని చెప్పారు. సీఎం పదవి నుంచి వైదొలిగిన చంపై సోరెన్‌ ఇకపై కోఆర్డినేషన్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారనున్నారు.…

Read More

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం వంటి పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ప్రధానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధాని మోదీని కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్న ఆయన పరిష్కారంపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అంశాలివే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కి బొగ్గు బ్లాకుల కేటాయింపు అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49శాతం ఈక్విటీ వాటా ఉందన్నారు. కేంద్రం వేలం…

Read More

వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని, ప్రజలకు మంచి చేసి కూడా తమ పార్టీ ఓడిపోయిందని పేర్కొంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మోసపూరిత ప్రచారాలను నమ్మి 10 శాతం ఓట్లు అటు మళ్లడం వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత బైటకు వచ్చిన ఆయన నెల్లూరు జైలులో ఉన్న మాజీ వైసిపి ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అధికారంలో ఉండగా మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున మాత్రమే మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఆ తర్వాత మొదటిసారిగా గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి మీద టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. పాల్వాయ్‌గేట్‌ పోలింగ్ బూత్‌లో జరుగుతున్న అన్యాయం…

Read More

టీ20 ప్రపంచకప్‌ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రోహిత్‌ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం జట్టు సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.  టీమ్‌ఇండియాకు స్వాగతం పలికేందుకు అభిమానులు గురువారం వేకువజామునే పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయటంతో ఆటగాళ్లను దూరం నుంచే చూడాల్సి వచ్చింది. దిల్లీలో వర్షం కురుస్తున్నప్పటికీ.. టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ వందలాది మంది ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ జెండాలతో వారికి స్వాగతం పలికారు. ”ఈ క్షణాల కోసం 13 ఏళ్లుగా వేచిచూశాం. టీమ్‌ఇండియా కప్పు గెలిచి మమ్మల్ని గర్వపడేలా చేసింది” అని ఓ అభిమాని ఆనందం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4:30 గంటలకే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు తెలిపారు. కొంతమందైతే బుధవారం రాత్రి నుంచే…

Read More

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చాంపై సోరెన్ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆ తరువాత జెఎంఎం నేత హేమంత్ సోరెన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను కలుసుకుని ప్రభుత్వం ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వవలసిందని కోరారు. అంతకుముందు అధికార సంకీర్ణం నేతలు, ఎంఎల్‌ఎలు రాంచీలోని చాంపై సోరెన్ నివాసంలో సమావేశమై హేమంత్ సోరెన్‌ను జెఎంఎం శాసనసభా పక్షం నేతగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ‘జెఎంఎం నాయకత్వంలోని కూటమి నిర్ణయం ప్రకారం రాజీనామా చేశాను. మా కూటమి పటిష్ఠంగా ఉంది’ అని చాంపై సోరెన్ రాజ్ భవన్‌లో నుంచి బయటకు వచ్చిన తరువాత చెప్పారు. ‘హేమంత్ సోరెన్‌జీకి ఏమి జరిగిందో అందరికీ తెలుసు& సంకీర్ణ భాగస్వాములు నాకు బాధ్యత అప్పగించారు. ఇప్పుడు హేమంత్ సోరెన్‌జీకి అనుకూలంగా కూటమి నిర్ణయించింది’ అని చాంపై సోరెన్ తెలిపారు. భూ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత ఆయన…

Read More

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో హార్దిక్ అసాధారణ ఆటతో భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతను నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో రెండు స్థానాలు మెరుగు పరుచుకుని కెరీర్‌లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఓ భారత ఆటగాడు ఆల్‌రౌండర్‌ల విభాగంలో టాప్ ర్యాంక్‌ను దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత సాధించిన తొలి టీమిండియా క్రికెటర్‌గా హార్దిక్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా, హార్దిక్ ప్రస్తుతం శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరగతో కలిసి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.మరో వైపు మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), సికందర్ రజా (జింబాబ్వే), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) టాప్5లో…

Read More