Author: Editor's Desk, Tattva News

కొద్దిరోజుల కిందట బీఆర్ఎస్ పార్టీకి రాజీనాామా చేసిన కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు రాష్త్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తిరిగి రాజ్యసభ సీట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు. కేసీఆర్ ఆయనను రెండు సార్లు రాజ్యసభకు పంపడమే కాకుండా పార్టీ సెక్రటరీ జనరల్ గా తన తర్వాత కీలకమైన పదవి ఇచ్చారు. పైగా, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మిని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా చేశారు. . ఆయన కుమారుడు విప్లవ్ కూడా…

Read More

లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బిజెపిని గెలిపించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 60 ఏళ్ల తరువాత పార్టీ వరసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెబుతూ ప్రజల నిర్ణయాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బిజెపి విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని దుయ్యబట్టారు.  ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని, విపక్షాలు నినాదాలు చేసిన అనంతరం వారు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ రాజ్యసభలో  ప్రసంగించారు. పెద్దల సభను ప్రతిపక్షాలు అవమానిస్తున్నాయని, చర్చలో పాల్గొనే దమ్ములేక విపక్షం పారిపోయిందని ప్రధాని ఎద్దేవా చేశారు.  ప్రతిపక్షాలను ప్రజలు ఓడించిన తీరు మారడంలేదని మండిపడ్డారు. తమపై జరిగిన విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని, గతంలో రిమోట్ ప్రభుత్వాన్ని నడిపారని, మా పరిపాలన పదేళ్లు ముగిశాయని, మరో 20 ఏళ్లు మిగిలి ఉందని మోదీ…

Read More

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భోలే బాబా నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు రావడం, పెను విషాదం జరగడం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. అసలేమిటీ ఈ కార్యక్రమం? ఆ భోలే బాబా ఎవరూ? అనే ఆసక్తి ఇప్పుడు నెలకొంటుంది. ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున అన్వేషిస్తున్న భోలే బాబా అసలు పేరు నారాయణ్​ సాకార్ హరి. ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్‌ గ్రామానికి చెందిన బాబా సాకార్‌ విశ్వ హరి లేదా ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. బాల్యంలోనే తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసినట్లు ఈ భోలే బాబా చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి, ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు…

Read More

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్టు తేలడంతో జైలు శిక్ష పడింది. ఒకప్పుడు చికాగో లోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్ మోసాలకు పాల్పడినట్టు న్యాయస్థానం పేర్కొంది. జౌట్‌కమ్ హెల్త్ పేరిట రిషిషా, శ్రద్ధా అగర్వాల్ లు ఓ హెల్త్ మీడియా సంస్థను 2006లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్‌లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిలో పేషెంట్లను టార్గెట్ చేసుకొని వివిధ కంపెనీల మెడికల్ అడ్వర్‌టైజింగ్ ప్రకటనలు ప్రసారం చేసేది. ఈ సృజనాత్మక ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా కంపెనీకి కాంట్రాక్టులు లభించాయి. 2010లో ఆ దేశ టెక్, హెల్త్ కేర్ ఇన్వెస్ట్‌మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది. దీంతో భారీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. గోల్డ్‌మన్ సాక్స్, ఆల్ఫాబెట్, జేబీ ప్యాట్రిక్స్ వెంచర్ క్యాపిటల్స్ వంటి సంస్థలు భారీగా ఇన్‌వెస్ట్‌మెంట్లు చేశాయి. చికాగో కార్పొరేట్ సర్కిల్స్‌లో షా అప్పట్లో…

Read More

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌‌ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తొలుత 27 మంది చనిపోయినట్టు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కానీ, 116 మంది చనిపోయిన్నట్లు మంగళవారం సాయంత్రం అధికార వర్గాలు నిర్ధారించాయి. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 150 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది.  హత్రాస్ జిల్లా సికింద్రా రౌ ఏరియా రతి భాన్పూర్ గ్రామంలో ఓ ఆధ్యాత్మిక గురువు ఏర్పాటుచేసిన సత్సంగ్‌కు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పోలీసుల వెల్లడించిన సమాచారం ప్రకారం..వేదిక వద్ద ఊపిరాడక అసౌకర్యానికి గురైన భక్తులు.. పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన సమయంలో చాలా వేడి, ఉక్కబోతగా ఉందని పోలీసులు తెలిపారు.  ‘‘ఇది భోలే బాబా అనే మత బోధకుడి సత్సంగ సమావేశం. మంగళవారం మధ్యాహ్నం ఎటావా, హత్రాస్ జిల్లా సరిహద్దులో ఉన్న ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహణకు తాత్కాలిక…

Read More

సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారని, ఆయనతో ఏమీ కాదని దేశానికి తెలుసని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మంగళవారం ప్రధాని పాల్గొంటూ ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు. దేశ ప్రజల తమ అభివృద్ధిని చూసే మరోసారి అధికారం ఇచ్చారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరసగా మూడోసారి తాము అధికారంలోకి రావడం వల్ల కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్‌కు పరోక్షంగా చురకలంటించారు. “సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నారనే నిజం దేశానికి తెలుసు. ఓబీసీ ప్రజలను దొంగలుగా అభివర్ణించిన కేసులో రాహుల్‌కు శిక్ష…

Read More

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో సోమవారం చేసిన ప్రసంగం తీవ్ర దుమారానికి కారణమైంది. కేంద్రప్రభుత్వంపై రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివిధ మతాలకు సంబంధించిన అంశాలను ఆయన సభలో ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ఖండించారు. హిందువులను అవమానించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. తక్షణమే రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను బీజేపీ సభ్యులు కోరారు. దీంతో రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చర్యలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది. లోక్‌సభ స్పీకర్ ఆదేశాలతోనే రాహుల్ ప్రసంగంలో…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి సిఐతో దురుసుగా ప్రవర్తించారు. తనకు ఎస్కార్ట్‌గా రావాలని మంత్రి సతీమణి హుకుం జారీ చేశారు. ప్రభుత్వం జీతమే ఇస్తుందని కానీ వైసిపి వాళ్లు జీతం ఇస్తున్నారా? అని పోలీస్ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాను 30 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నానని మీరు ఎక్కడికి వెళ్లారని పొగరుగా మాట్లాడారు. పోలీస్ అధికారి సారీ మేడమ్ చెప్పిన కూడా ఆమె వినిపించుకోలేదు. ఎవరు తనతో ఎస్కార్ట్‌గా వస్తున్నారు అని పోలీస్ అధికారులను డిమాండ్ చేసి అడిగారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డితో మాట్లాడి వివరణ ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకవస్తే చర్యలు తీసుకుంటామని బాబు హెచ్చరించారు. …

Read More

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, ఇక్బాల్‌ వైఎస్సార్సీపికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వారిలో ఇక్బాల్‌ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దాంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ సీనియర్‌ నేత సి. రామచంద్రయ్యకు, జనసేన నేత పిడుగు హరిప్రసాద్‌లకు కేటాయించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారిపల్లెకి చెందిన సి.రామచంద్రయ్య చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఆయన 1985లో అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి గెలిచారు. 1986లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. అనంతరం 2008లో ప్రజారాజ్యం…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీలకు సంబంధించిన అంశాలపై చర్చించుకుందామని ప్రతిపాదిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ వ్రాయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దానితో ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన జరిగి పదేళ్లు దాటినా విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై చర్చలు జరిగినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని అయన స్పష్టం చేశారు.  ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయనే నమ్మకం ఉందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో మధ్య సుస్థిర ప్రగతి సాధించడానికి పరస్పర సహకారం…

Read More