Author: Editor's Desk, Tattva News

దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.  ఇళ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు.. వంట సామాగ్రి అన్ని తడిసిముద్దవ్వడంతో ప్రజల పాట్లు వర్ణణాతీతంగా మారాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు లేక నగర వాసులు నానా అవస్థలు పడ్డారు. ఇప్పుడేమో బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు ప్రధాన జంక్షన్ల దగ్గర నీరు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరికొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఇలా నగరంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రంగంలోకి దిగిన సహాయ…

Read More

2022 టీ20 వరల్డ్ కప్​ సెమీ ఫైనల్​లో తమ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్​ టీమ్​పై ప్రతీకారం తీర్చుకుంది టీమ్​ఇండియా. అప్పుడు సెమీ పోరులో ఇంగ్లాండ్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీమ్​ఇండియాకు ఘోర పరాజయాన్ని మిగిల్చింది ప్రత్యర్థి​ జట్టు. కానీ ఇప్పుడు మళ్లీ అదే పొట్టి ప్రపంచకప్​ సెమీస్​లో టీమ్​ఇండియాపై చిత్తుగా ఓడింది. ఈ సారి లక్ష్యం 172. అయితే టీమ్​ఇండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్​ చేశారు. దీంతో ఇంగ్లాండ్‌ పప్పులుడకలేదు. బట్లర్‌ సేనను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చేసి ఫైనల్​కు దూసుకెళ్లారు మనోళ్లు. ఇక టైటిల్ పోరు కోసం శనివారం(జూన్ 29) దక్షిణాఫ్రికాతో తలపడనున్నారు. వర్షం వల్ల ఆలస్యంగా మొదలైందీ మ్యాచ్​. అనంతరం మధ్యలోనూ అంతరాయం కలిగించింది. కానీ ఈ పోరులో టీమ్​ఇండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి 68 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తుగా ఓడించింది.…

Read More

కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ముదురుతున్నది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య, పదవిని దక్కించుకునేందుకు డీకే తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఇద్దరు నేతలూ ‘హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌’ అని చెప్తున్నప్పటికీ తమ వర్గీయులతో పోరుకు కాలుదువ్వుతున్నారు. సిద్ధరామయ్య ఇక సీఎం పదవి నుంచి దిగిపోయి డీకే శివకుమార్‌కు అప్పగించాలని చెన్నగిరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసవరాజు శివగంగ కోరిన మరునాడే విశ్వ వొక్కలిగ మహాసంస్థాన మఠానికి చెందిన గురువు కుమార చంద్రశేఖరనాథ స్వామీజీ ఇదే వాదనను తెరపైకి తెచ్చారు.  గురువారం జరిగిన బెంగళూరు నగర వ్యవస్థాపకుడు కెంపెగౌడ జయంతి కార్యక్రమంలో వేదిక మీద సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఉండగానే బాహాటంగా సిద్ధరామయ్యకు ఈ విజ్ఞప్తి చేశారు.  ‘అందరూ ముఖ్యమంత్రి అయి అధికారాన్ని అనుభవించారు కానీ డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి ఈ పదవిని అనుభవించిన సిద్ధరామయ్య పదవిని వదులుకొని…

Read More

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టిఆర్‌తో పాటు, రామోజీరావుకు కూడా భారత రత్న సాధించాలని, ఇది తెలుగు ప్రజల అందరి బాధ్యతని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో  మాట్లాడుతూ రామోజీరావు పత్రికారంగంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారని చెప్పారు.  భావి తరాలు ఆయన్ను గుర్తించుకునేలా ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్‌ భవన్‌ తరహాలో రాజధాని అమరావతిలో కూడా రామోజీరావు పేరుతో విజ్ఞాన్‌ భవన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమరావతిలోనే ఒక రోడ్డుకు కూడా ఆయన పేరు పెడతామని, విశాఖపట్నంలో రామోజీరావు చిత్రనగరి పేరుతో సినిమా షూటింగుల కోసం స్థలాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఎంతోమంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు రామోజీరావు జీవితాన్ని ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారని వివరించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడల్లా తాను ఉన్నానంటూ ముందుకొచ్చి పోరాడారని కొనియాడారు. రాజధాని నగరానికి అమరావతి…

Read More

హైదరాబాద్‌ ఎంపీ, మజ్లీస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్‌ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు. ఇటీవల లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా అసదుద్దీన్‌ ‘జై పాలస్తీనా’ అంటూ నినదించిన విషయం తెలిసిందే. ప్రమాణం స్వీకారం సందర్భంగా పాలస్తీనా పేరును లేవనెత్తి.. భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారంటూ తన లేఖలో  ఆమె ప్రస్తావించారు. అయితే, తన డిమాండ్‌కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలను ఆమె ఉదహరించారు.  ఈ మేరకు లోక్‌సభ ఒవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చని ఆమె చెప్పారు.  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్‌ ఒవైసీ జై భీమ్‌.. జై తెలంగాణ.. జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సభలో…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ బిఆర్‌ఎస్ అధినేత మాజీ సిఎం కెసిఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. విచారణ అనంతరం కెసిఆర్ తరపు న్యాయవాది ఆదిత్య మీడియాతో మాట్లాడారు. ‘విద్యుత్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. జస్టిస్ సరసింహారెడ్డి ఏకపక్షంగా ప్రెస్‌మీట్ పెట్టి వివరాలను వెల్లడించారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధం. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కెసిఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల కొంత గడువు కోరారు’ అని తెలిపారు. అయితే, నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని గుర్తుచేశారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. …

Read More

బుకర్ ప్రైజ్ గ్రహీత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ప్రతిష్టాత్మకమైన పెన్ ప్రింటర్ ప్రైజ్-2024 విజేతగా నిలిచారు. ప్రస్తుతం 14 సంవత్సరాల క్రితం కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలపై ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఆమె పెన్ పింటర్ ప్రైజ్ విజేతగా నిలవడం గమనార్హం. ఇంగ్లీష్ పెన్ చైర్మన్ రూత్ బోర్త్‌విక్ మాట్లాడుతూ అరుంధతీ రాయ్ అంతర్జాతీయ ఆలోచనాపరురాలని, శక్తివంతమైన ఆమె స్వరం మౌనంగా ఉండకూడదని పేర్కొన్నారు.  పర్యావరణం, మానవ హక్కుల అంశాల్లో అరుంధతీ రాయ్ చేసిన కృషిని అవార్డు కమిటీ ప్రశంసించింది. జ్యూరీ సభ్యుడు ఖలీద్ అబ్దుల్లా మాట్లాడుతూ అరుంధతీ రాయ్ స్వేచ్ఛ, న్యాయం యొక్క స్వరం అని, ప్రపంచం సంక్షోభ దశ అనే చీకటిలో ఉన్నప్పుడు ఆమె నక్షత్రంగా నిలిచారని చెప్పారు.  అరుంధతీ రాయ్ స్పందిస్తూ “నేను పెన్ పింటర్ బహుమతిని అంగీకరించడం ఆనందంగా ఉంది. ప్రపంచం తీసుకుంటున్న దాదాపు అపారమయిన మలుపు గురించి వ్రాయడానికి ఈ రోజు హెరాల్డ్ పింటర్ మాతో…

Read More

రాజ్యాంగంపై జ‌రిగిన అతిపెద్ద దాడి ఎమ‌ర్జెన్సీ అని,. భార‌త రాజ్యాంగంపై అదో మ‌చ్చ‌లా మిగిలిపోయింద‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పార్లమెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో 1975లో విధించిన ఎమ‌ర్జెన్సీని ప్రస్తావించారు. జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ కానీ, ఈ ఎన్నికల్లో కశ్మీర్‌ లోయలో మార్పు కనిపించిందని రాష్ట్రపతి చెప్పారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారని ఆమె కొనియాడారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం అని ఆమె ప్రశంసించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని చెబుతూ ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని ఆమె వెల్లడించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత ఆరోగ్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గతంలో తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలతో దేశంలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగామని చెప్పారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో…

Read More

ఆధునిక జీవనశైలికి అలవాటు పడుతున్న భారతీయులు శారీరక శ్రమకు దూరం అవుతున్నారని, ఫలితంగా జబ్బుల ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సగానికి పైగా భారతీయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాలకు తగ్గట్టుగా శారీరక శ్రమ చేయడం లేదని అధ్యయనం గుర్తించింది.  ఇందుకు సంబంధించిన వివరాలు లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం.. పురుషులతో పోల్చితే ఎక్కువ మంది మహిళలు తగినంత శారీరక శ్రమ చేయడం లేదు. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు తగ్గట్టుగా శారీరక శ్రమ లేని వారిలో భారత్‌కు చెందిన మహిళలు 57 శాతం ఉండగా, పురుషులు 42 శాతం మంది ఉన్నారు.  శారీరక శ్రమకు దూరమవుతూ, జబ్బులకు దగ్గరవుతున్న భారతీయుల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతున్నది. 2000లో తగినంత శారీరక శ్రమ లేని భారతీయులు 22.3 శాతం ఉండగా 2022 నాటికి ఇది 49.4 శాతానికి పెరగడం ఆందోళనకరంగా మారింది.  ఒక మనిషి ఆరోగ్యంగా…

Read More

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రి జెపి నడ్డా ఆసుపత్రికి చేరుకొని అద్వానీ ఆరోగ్యం గురించి కుటుంభం సభ్యులు, ఐయిమ్స్ డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరిశీలనలో ఉన్నారని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్ల కాగా.. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక వార్డులో ఉంచి ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన విభాగానికి…

Read More