Author: Editor's Desk, Tattva News

జమ్మూ డివిజన్‌లోని దోడా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గండోహ్‌ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలను హతమార్చాయి. కాల్పుల్లో సైనికుడు గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నది. ఉగ్రవాదుల కోసం దోడా ప్రాంతంలో గత కొద్దిరోజులు నిరంతరంగా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. అనుమానిత వ్యక్తుల సమాచారంపై సమాచారం అందినా తనిఖీలు చేపట్టగా లాభం లేకపోయింది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో మళ్లీ అనుమానితులు కనిపించగా.. బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. దాంతో బలగాలు సైతం దీటుగా బదులిచ్చింది. దోడా ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై ఆర్మీకి చెందిన వైట్‌నైట్‌ కార్ప్స్‌ సమాచారం అందించింది. సైనిక ఆపరేషన్‌కు ‘లాగోర్‌’ అని పేరు పెట్టింది. పక్కా…

Read More

రాష్ట్ర ప్రభుత్వంతో జూడాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో జూడాలు సమ్మెను విరమించారు. 8 డిమాండ్లలో ఆరింటికి సానుకూలంగా మంత్రి స్పందించారు. మంత్రి సానుకూల స్పందనతో జూడాలు సమ్మెను విరమించారు. ఉస్మానియా, గాంధీ, కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీల‌కు నిధులు కేటాయిస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ మెడిక‌ల్ కాలేజీల్లో జూనియ‌ర్ వైద్యుల వ‌స‌తి గృహాల నిర్మాణానికి, కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీలో ర‌హ‌దారుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు నిధులు కేటాయిస్తూ జీవో విడుద‌లైంది.  ఉస్మానియా, గాంధీ, కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీల‌కు రూ. 204.85 కోట్లు కేటాయించారు. ఉస్మానియా వ‌స‌తి భ‌వ‌నాలు, రోడ్ల‌కు రూ. 121.90 కోట్లు, గాంధీ ఆస్ప‌త్రికి రూ. 79.50 కోట్లు, కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీలో సీసీ రోడ్ల‌కు రూ. 2.75 కోట్లు కేటాయించారు. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యా లు,స్టైపెండ్ బకాయిలు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో జూడాలు…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌కు కోర్టు బుధవారం అనుమతించడంతో రౌస్ అవెన్యూ కోర్టులోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఎదుట హాజరుపరిచిన అధికారులు ఐదు రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో అటునుండి తీసుకెళ్లారు. ఇదే కేసులో ట్రయల్ కోర్టు గత గురువారం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయగా, దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దిగువ న్యాయస్థానం తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈడీ…

Read More

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం, అల్లర్లు, సీఐపై హత్యాయత్నం, మహిళపై బెదిరింపుల కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే ఈ కేసులలో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి గతంలో హైకోర్టును ఆశ్రయించారు.  అయితే పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు బుధవారం ఉదయం కొట్టేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడిన కాసేపటికే పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నారు. పిన్నెల్లిని ఎస్పీ కార్యాలయానికి తరలించిన పోలీసులు అక్కడి నుంచి కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అంతకుముందు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్‌.అశ్వినీకుమార్‌ వాదించగా.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున లాయర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరు…

Read More

లోక్‌సభ స్పీకర్‌గా తిరిగి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే మరోసారి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది. రాజస్థాన్‌లోని కోట బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించలేదు. లోక్ సభ సంఖ్యా బలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది. ఆయన స్పీకర్‌గా ఎన్నికైనట్టుగా ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి…

Read More

జనసేన ఎమ్యెల్యేలు మొదటి 100 రోజులు శాసనసభ వ్యవహారాలు, పరిపాలన అంశాలపై దృష్టి సారించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.  ప్రజల ఆశలు, ఆకాంక్షలను శాసనసభలో ప్రతిఫలింప చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎమ్యెల్యేలలో అత్యధికులు మొదటిసారి ఎన్నికైన వారు కావడంతో వారికి అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సాంప్రదాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమంగా సాగాలని పవన్‌ సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం ఉందన్న పవన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీపడ వద్దని స్పష్టం చేశారు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని,  అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడవద్దని హెచ్చరించారు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలని సూచించారు. పార్టీ కోసం క్షేత్ర…

Read More

లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని దీటుగా ఎదుర్కొనేది రాహుల్‌ ఒక్కడేననే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే..!  అయితే.. రాహుల్‌ మాత్రం తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు. బుధవారం జరగనున్న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక విషయంలోనూ.. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవిని కేటాయించాలనే సంప్రదాయం అంశంలోనూ మోదీని రాహుల్‌ దీటుగా ఎదుర్కోగలరని మంగళవారం రాత్రి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇంట్లో జరిగిన విపక్ష కూటమి సమావేశం పునరుద్ఘాటించింది.  దీంతో.. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు రాహుల్‌ తన ఆమోదాన్ని ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రొటెం స్పీకర్‌ భర్తృహరికి రాహుల్‌ను తమ పార్టీ…

Read More

చంద్ర మండల యాత్రలో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలివైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమిపైకి తీసుకు వచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి , శిథిలాలను మోసుకొని లూనార్ ల్యాండర్ చాంగే 6 వ్యోమనౌక మంగళవారం భూమికి చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్టు డ్రాగన్ వెల్లడించింది. మే 3 వ తేదీన చాంగే 6 నింగికెగిరి , దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్ 2 న జాబిల్లి ఆవలివైపున సౌత్ పోల్ అయిట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో అది సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్, అనే నాలుగు భాగాలున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్‌యంత్రాన్ని ఉపయోగించి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని…

Read More

ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండటంతో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కండువా మార్చిన నేతలపై చర్యలకు సిద్ధమవుతుండటంతో పాటు ఆయా ఎమ్మెల్యేలకు నిరసన తగిలేలా ఆందోళనలకు సిద్దపడుతున్నారు. అవకాశవాద రాజకీయ నాయకులపై, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో గొంతెత్తి పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కేసీఆర్ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ మారిన నేతలను ప్రజల్లో తిరగనీయవద్దంటూ పిలుపునిచ్చారు. ఆ దిశగా కార్యకర్తలను అప్రమత్తం చేయాలని, వారి సహకారంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీని వీడటంతో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఇద్దరితో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్…

Read More

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో గత వారం మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ సిఏచ్ అయ్యన్నపాత్రుడుకు వ్రాసిన లేఖలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.  ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని నిబంధనలలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. అటు పార్లమెంటులో గానీ.. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదని ఆయన గుర్తుచేశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు. 1989లో తెలుగు దేశంపై పార్లమెంట్ లో కేవలం 30 మంది ఎంపీలే ఉన్నప్పటికీ ఆ పార్టీ ఎంపీ పి ఉపేంద్రకు ప్రతిపక్ష హోదా కల్పించారని ఆయన గుర్తు చేశారు.  అదేవిధంగా, 1994లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్…

Read More