తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మంగళవారం రోజున నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసులో విచారణ జరిగింది. అయితే.. ఈ కేసులో నిందితులైన రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన విచారణకు హాజరు కాకకపోవటం గమనార్హం. రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న మత్తయ్య, ఉదయ్ సింహా, కేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో నిందితులు విచారణకు హాజరుకాకపోవటంపై.. నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సెప్టెంబర్ 24న జరిగే విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితులు న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ క్రమంలో నిందితులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా విచారణకు హాజరు కావాలని…
Author: Editor's Desk, Tattva News
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం కుటుంబానికి మంగళూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉందని తెలిపింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని ప్రతిపక్ష భాజపా, జేడీఎస్ ఆరోపించాయి. ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్‌కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ…
తిరుమల లడ్డూ కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు పవన్‌కు స్వాగతం పలికారు. తర్వాత ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు. తిరుమల లడ్డూ అపవిత్రమైందన్న వార్తల మధ్య.. మొదట్లోనే తప్పును గుర్తించలేకపోయాను క్షమించు స్వామీ అంటూ పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. కాగా, తిరుమల నెయ్య వివాదంపై నటుడు ప్రకాష్…
ప్రాణాంతక మంకీపాక్స్‌కు సంబంధించి భారత్‌లో మరో కేసు నమోదైనట్లు సమాచారం. హెల్త్ ఎమర్జెన్సీకి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో గతవారం ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యుఎఇ నుంచి ఇటీవల ఇండియాకు వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్ 1గా నిర్ధరణ అయ్యింది. ప్రపంచ ‘హెల్త్ ఎమర్జెన్సీ’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్చెన్సీగా ప్రకటించినప్పటి నుంచి భారత్లో 30కేసులు నమోదయ్యాయి. ఇండియాలో సెప్టెంబర్ 9న మొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఫారిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలు పరీక్షించారు. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో…
రామాయణంలో రాజ్యాన్ని వదిలిపెట్టి రాముడు వనవాసానికి వెళితే ఆయన పాదుకలకు పట్టం కట్టి పాలించిన భరతుడిలా ఢిల్లీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టానని ముఖ్యమంత్రి అతిశీ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అతిశీ సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై తనకున్న భక్తిని చాటుకున్నారు. గతంలో కేజ్రీవాల్ ఉపయోగించిన కుర్చీని పక్కన పెట్టుకుని తాను మరో కుర్చీలో ఆసీనులయ్యారు. ఆ కుర్చీ ఎప్పటికైనా కేజ్రీవాల్ దేనని చెప్పారు. నాలుగు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మరోమారు కేజ్రీవాల్ కు పట్టం కడతారని, ఈ కుర్చీలో మరోమారు ఆయనను కూర్చోబెడతారని తనకు విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో భరతుడితో తనను తాను పోల్చుకున్నారు. రాముడు వనవాసం వెళితే ఆయన తరఫున ప్రతినిధిగా పాలనా బాధ్యతలను భరతుడు చేపట్టిన…
బాలీవుడ్లో క్లాసిక్ హిట్గా నిలిచి మూవీ లవర్స్ను అలరించిన లాపతా లేడీస్ మూవీ ఇప్పుడు భారత్ తరఫున అధికారికంగా ఎంట్రీకి పంపిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ‘ఆట్టం’, ‘యానిమల్’ తదితర 29 సినిమాల లిస్టు నుంచి ఈ సినిమాను ఎంచుకున్నారని తెలిపారు. ఇటీవలే ఇదే విషయంపై ఈ మూవీ డైరెక్టర్ కిరణ్ రావ్ మాట్లాడుతూ మన దేశం తరఫున ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్‌కు ఎంపికవుతుందని ఓ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా చెప్పారు. “2025లో ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అఫీిషియల్ నామినేషన్కు ‘లాపతా లేడీస్’ అర్హత సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆస్కార్ వేదికపై ఈ సినిమా మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు మా టీమ్ మెంబర్స్ కోరిక. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్‌కు పంపుతుందని నేను ఆశిస్తున్నాను” అంటూ కిరణ్‌రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2001 కాలం…
చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో వున్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. న్యాయస్థానాలు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు మద్రాసు హైకోర్టు తీర్పును సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కింది కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతూ.. వీడియోలు డౌన్ లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికీ షేర్ చేయలేదని, ఎవరినీ వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్…
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. ఈ మేరకు శ్రీలంక ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. రణిల్ విక్రమ సింఘేను దిసనాయకే ఓడించారు. అనుర కుమార దిసనాయకే(56), సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి శ్రీలంక రెండో అధ్యక్షుడు అయ్యారు. ఆయన తండ్రి వ్యవసాయ కూలీ. శనివారం జరిగిన ఎన్నికలలో 55 ఏళ్ల దిసనాయకే 42.31 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా గెలిచారని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దిసనాయకే.. ప్రతిపక్షనాయకుడు సజిత్ ప్రేమదాసును రెండవ స్థానానికి, విక్రమ సింఘేను మూడవ స్థానానికి నెట్టేశారు. అనుర కుమార దిసనాయకే సోమవారం శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత విజయానికి అవసరమైన 50 శాతానికిపైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో గెలుపును నిర్ధరించే రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు. ఇందులో మార్కిస్ట్ నేత కుమార దిసనాయకే విజయం సాధించారు. ‘పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ 55…
రిజర్వేషన్లపై కాంగ్రెస్, నేషనల్ కాన్పరెన్స్ (ఎన్‌సి) నేతల వైఖరిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పహాడీలు, గుజ్జర్‌లు, దళితులు సహా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని హోమ్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరాలో ఒక ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, రిజర్వేషన్ల తొలగింపునకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పహాడీలకు ఇక ఎంత మాత్రం రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘పహాడీ, గుజ్జర్ బకర్వాల్, దళిత్, వాల్మీకి, ఒబిసి వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్‌లను తాము పునఃపరిశీలిస్తామని కాంగ్రెస్, ఎన్‌సి చెప్పాయి. రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లి, వారు ఇప్పుడు అభివృద్ధి చెందినందున వారికి ఇక రిజర్వేషన్ అవసరం లేదని అంటారు. రాహుల్ బాబా! రిజర్వేషన్ తొలగింపునకు మిమ్మల్ని మేము అనుమతించం’ అని అమిత్ షా చెప్పారు. రిజర్వేషన్లు కొనసాగుతాయని ఆయన…
హైదరాబాదులో ఎన్‌ఐఏ ఆదివారం తనిఖీలు చేపట్టింది. సైదాబాద్ ప్రాంతంలోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ తనిఖీలు దాదాపు గంటసేపు కొనసాగాయి. ఎన్‌ఐఏ ఆగస్టులో ఉగ్ర వాది రిజ్వాన్ అబ్దుల్ ను అరెస్ట్ చేశారు. రిజ్వాన్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని ఎన్‌ఐఏ గుర్తించింది. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణే నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. రిజ్వాన్‌ను ఢిల్లీలోని గంగా బక్ష్ మార్గ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అతడి నుంచి 30 బోర్ పిస్టల్, 3 కార్ట్రిడ్జ్ లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రిజ్వాన్ పై ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఢిల్లీలో అతడ్ని అరెస్ట్ చేసిన అనంతరం ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. రిజ్వాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నేడు హైదరాబాదులో…