Author: Editor's Desk, Tattva News

వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ ఆధారంగా ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు ఉన్న రుణాలన్నీ ఏక కాలంలో మాఫీ చేస్తామని రేవంత్‌ తెలిపారు.  ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రుణమాఫీ కింద రూ. 28వేల కోట్లు మాత్రమే చెల్లించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు వివరించారు.  ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అదేవిధంగా రైతు భరోసా అమలుపై మంత్రివర్గం ఉపసంఘం వేశామని తెలిపారు. జులై…

Read More

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు టిడిపి సీనియర్ నేత. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజా విజయంతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న…ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించిన యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు అయ్యన్నపాత్రుడికి స్పీకర్…

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. కాగా, ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ కు రౌస్‌ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్‌ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్‌ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే, ట్రయల్‌ కోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈడీ తరపు న్యాయవాది ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదించారు. కేజ్రీవాల్‌ బెయిల్‌ దరఖాస్తును…

Read More

కోలాహలంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు శుక్రవారం జరిగాయి. ముఖ్యమంత్రి, టిడిపి అధినేతనారా చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021 నవంబర్లో ఆయన శపథం చేస్తూ సభనుండి బైటకు వెళ్లిపోయారు. అది నేడు నెరవేరింది. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైఎస్సార్సీపీ సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్‌ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు. జగన్‌ వ్యవహారశైలి ఏ విధంగా ఉన్నప్పటికీ అతనికి అగౌరవం కలిగేలా ప్రవర్తించరాదని తెలుగుదేశం శాసనసభ్యులకు చంద్రబాబు స్పష్టం చేయడమే కాకుండా జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకి అనుమతించాలని ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు…

Read More

పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని,  జర్మనీలో ఇవాళ కోటిన్నర మంది నిత్యం యోగా చేస్తున్నారని, ప్రపంచ యోగా గురువుగా భారత్ మారిందని చెప్పారు.  పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. శ్రీనగర్‌లోని డాల్ సరస్సు నద ఒడ్డున యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.  షేర్-ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రం వద్ద ప్రధాని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని, యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని, యోగాతో శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయని, యోగా నేర్పే మహిళలకు పద్మ శ్రీ అవార్డు కూడా దక్కిందని మోదీ  ప్రశంసించారు. “ఈ యోగా దినోత్సవం నాడు ప్రపంచం నలుమూలల యోగా చేస్తున్న వారందరికి నా శుభాకాంక్షలు. యోగా…

Read More

ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట దొరికింది. ఈ కేసులో గురువారం ఆయనకు బెయిల్ మంజూరు అయింది. బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దని, విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, పిలిచినపుడు కోర్టుకు రావాలని పలు షరతులు విధించారు. కేజ్రీ బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి గురువారం తీర్పును రిజర్వు చేసిని ఉదయం జడ్జి నియాయ్‌ బిందు.. సాయంత్రానికి బెయిల్‌ ఇచ్చారు. 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది సంబంధిత కోర్టు ఎదుట శుక్రవారం బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. మద్యం కుంభకోణంలో కేజ్రీని మార్చి 21న ఈడీ ఆరెస్టు చేసింది. లిక్కర్‌ వ్యాపారుల నుంచి పొందిన ముడుపులను గోవాలో పార్టీ ఎన్నికల…

Read More

ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్‌గార్డ్ బలగాలు దాడులు చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. ఈ సంఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్ అధికారులు స్పందిస్తూ తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు, సెకండ్ థామస్ షోల్‌కు ఆహారం , ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా, చైనా దళాలు దాడి చేసినట్టు వెల్లడించారు. బీజింగ్ దళాలు మొదట ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగి, తరువాత బోట్ల లోకి చొరబడ్డాయి. మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిళ్లను కాజేశారు., అక్కడే ఉన్ననేవిగేషన్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సంఘటనలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటన వేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి. ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవ్నెర్ జూనియర్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ సంఘటనపై స్పందించారు.…

Read More

రామాయణ గాధ పేరిట ‘రావోహణ్’ లఘునాటికను ప్రదర్శించినందుకు విద్యార్థులపై ముంబైలోని ఐఐటి విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది. ప్రతి ఒక్కరికి రూ 1.2 లక్ష చొప్పున ఎనమండుగురు విద్యార్థులకు ఫైన్ విధించింది. మార్చి 31న విద్యార్థులు కళాప్రదర్శన సందర్భంగా అత్యుత్సాహంతో రామాయణం ప్రదర్శించింది. అయితే వారు ఇందులోని రాముడు, సీత ఇతర పాత్రలను వక్రీకరించడం, హిందూ పురాణ పాత్రలను కించపరిచే విధంగా పాత్రలను మలిచి, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను మంటగలిపారనే విమర్శలు, ఫిర్యాదులు రావడంతో ఐఐటి యాజమాన్యం తీవ్రస్థాయిలో స్పందించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ స్కిట్‌లో వేషాలేసిన ఎనమండుగురు విద్యార్థులపై జిరిమానా విధిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. స్త్రీవాదాన్ని ప్రోత్సహించడం, ఆధునికత పేరిట విద్యార్థులు ఈ విపరీత చేష్టలకు దిగారని ఫిర్యాదులు అందడంతో యాజమాన్యం సంబంధిత విషయంపై స్పందించింది. క్రమశిక్షణా కమిటీ సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. ఇటీవలే వీరిపై భారీ జరిమానాల నిర్ణయం తీసుకున్నారని వెల్లడైంది. నలుగురు విద్యార్థులకు…

Read More

లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు.  భర్తృహరి మహతాబ్‌ ఒడిశాలోని కటక్‌ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలువడం ఇది ఏడోసారి కావడం విశేషం. గతంలో ఆయన నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.  ఆయన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్‌ తనయుడు. మహతాబ్‌ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 95(1) ప్రకారం ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు.

Read More

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటిసారిగా గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు పలు నిర్మాణాలను పరిశీలించారు. రాజధాని అమరావతి పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణాలను పరిశీలించారు.  2014లో అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో ప్రాంతానికి వెళ్లిన సమయంలో చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. మోకాళ్లపై కూర్చొని శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లారు. నీరు-మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని, అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందిన్న ఆయన ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పుకొచ్చారు.…

Read More