రిజర్వేషన్ల పరిమితి పెంపు విషయంలో బిహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు తిరస్కరించింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కులగణన ఆధారంగా జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచింది. అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. కానీ, ఏకంగా 65 శాతానికి పెంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బిహార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. కులగణన అనంతరం నవంబరు 2023లో అప్పటి జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదించింది. ఈ తీర్మానం ఆమోదం పొందిన నెల రోజుల తర్వాతే నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. నితీశ్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషనర్లలో ఒకరి తరఫున వాదనలు వినిపించిన రితికా…
Author: Editor's Desk, Tattva News
భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగించింది. దక్షిణాఫ్రికాపై వరుసగా రెండో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది హర్మన్‍ప్రీత్ కౌర్ సేన. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల టీమ్ 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 646 పరుగులు నమోదైన ఈ హైస్కోరింగ్ గేమ్‍లో టీమిండియా పైచేయి సాధించి గెలిచింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (120 బంతుల్లో 136 పరుగులు; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో అద్భుత శతకం చేశారు. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 103 పరుగులు నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో దుమ్మురేపారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వోల్‍వాట్ (135 బంతుల్లో 135 పరుగులు నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో చివరి…
కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును ఏపీ ప్రభుత్వం నియమించింది. సీనియార్టీకి పట్టం కట్టిన ప్రభుత్వం ద్వారకా తిరుమలరావుకు, డీజీపీగా పోస్టింగ్ ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు ట్రాఫిక్ సరిగా నియంత్రించలేదనే విమర్శలు ఎదుర్కొన్న హరీష్‌కుమార్ గుప్తాను తప్పించింది. రాష్ట్ర డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్‌ల సీనియారిటీ జాబితాలో అందరికంటే ముందున్నారు. కర్నూలు ఎఎస్పీగా మొట్ట మొదటి పోస్టింగ్ అందుకున్న ద్వారకా తిరుమలరావు, ఉమ్మడి రాష్ట్రంలో కామారెడ్డి, ధర్మవరంలోనూ ఎఎస్పీగా పని చేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పని…
ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరలు పెంచింది. వరికి 117 రూపాయలను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర పెంపుతో క్వింటాల్ ధాన్యం ధర 2,300 రూపాయలకు చేరింది. వరితో పాటు పత్తి, రాగి, మొక్క జొన్న, జొన్నపంటలకు ఎంఎస్పిని పెంచినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. పంట ఉత్పత్తి ధరకు పెంచిన ఎమ్మెస్పీ కనీసం 1.5శాతంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటు గుజరాత్, తమిళనాడులో మొత్తం 7వేల 453 కోట్లతో ఒక గిగావాట్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని వధావన్‌లో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్‌ను 76వేల కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కంది పప్పు కనీస మద్దతు ధర రూ.7,550కు చేరింది. మినుములు క్వింటాలు ధర రూ.7,400 కాగా.. పెసలు రూ.8,682కు, వేరు శనగ ధర క్వింటా రూ.6783కు చేరింది. పత్తి…
ఏపీలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్‌లను.. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ మురళీధర్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.మొత్తం 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి – జి. సాయి ప్రసాద్కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి – గోపాలకృష్ణ ద్వివేదీసీఎం కార్యదర్శి – ప్రద్యుమ్మపంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి – శశిభూషణ్ కుమార్పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి – అనిల్ కుమార్ సింఘాల్పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి – కోన శశిధర్ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శి -…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ఫర్నిచర్ వివాదం నెలకొంది. ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం జగన్ కు లేఖ రాసింది. దీంతో పాటు జగన్ పేషీలో సెక్రటరీలకు జీఏడీ లేఖ రాసింది. గత ప్రభుత్వంలో వినియోగించిన ఫర్నిచర్ తోపాటు ఇతర సామాగ్రిని ఇన్వెన్టరీ జాబితా ప్రకారం తిరిగి పంపాలని జీఏడీ లేఖ రాసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో సెక్రటరీలు ఇతరులకు ఫర్నిచర్, కంప్యూటర్లు ఇతర సామగ్రిని జీఏడీ పంపింది. ఆ మొత్తం సామాన్లు, ఇతర ఫర్నిచర్ వెనక్కి పంపాలని తాజాగా సెక్రటరీలకు లేఖ రాసింది. సీఎంవో ఇన్ ఛార్జ్ గా ఉన్న అధికారికి జీఏడీ లేఖ రాసింది. పదవికాలం పూర్తి అయ్యి 15 రోజులు అవుతున్నా ఇంకా ఫర్నిచర్ ఇతర సామగ్రిని అప్పగించలేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్ ప్రభుత్వ సామాగ్రిని ఇంకా తన ఇంట్లోనే ఉంచుకోవడంపై…
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి నలంద యూనివర్సిటీ గుర్తింపుగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. నలంద విశ్వవిద్యాలయ పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని పేర్కొన్నారు. ఈ నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తోందని మోదీ వివరించారు. అగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు కానీ జ్ఞానం కాదని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా నలంద యూనివర్సిటీలోని పురాతన శిథిలాలను ప్రధాని ఆసక్తిగా సందర్శించారు. నలంద విశ్వవిద్యాలయ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా.. భారత ఖ్యాతిని మరోసారి ప్రపంచ దేశాలకు తెలియజేశారు. నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ రాజేంద్ర వి.అర్లేకర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. భారతదేశాన్ని ప్రపంచ విద్య, విజ్ఞాన…
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు. రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల 50 వేలకు పైగా ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. 77 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా ప్రజా సేవ చేస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆపార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత చిన్న అన్నగా బుచ్చయ్య చౌదరిని తెలుగుదేశం శ్రేణులు పిలుస్తారు.పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి కంచుకోట. ఇప్పటికే…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని నాలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు జులై 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్లలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రామచంద్రయ్యపై మార్చి 11న అనర్హత అనర్హత వేటు పడింది. వైసీపీ తరపున ఎన్నికైన మాజీ ఐపీఎస్ అధికారి షేక్ మహ్మద్ ఇక్బాల్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రామచంద్రయ్య, ఇక్బాల్ ప్రాతినిథ్యం వహించిన స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. శాసనమండలిలో ఖాళీ అయిన…
ఈనెల 30 నుంచి మళ్లీ మొదలు కానున్న మన్‌కీబాత్ రేడియో ప్రసంగానికి ప్రజలు తమ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. 30న 111 వ ఎపిసోడ్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. “సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమం కొన్ని నెలల పాటు తాత్కాలికంగా వాయిదా పడిందని, మళ్లీ ప్రారంభం కానుందని చెప్పడం సంతోషంగా ఉందని ప్రధాని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. mygov ఓపెన్ ఫోరమ్, namo యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నెంబర్ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను పంచుకోవాలి” అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సూచించారు. ప్రతినెల చివరి ఆదివారంలో వచ్చే మన్‌కీబాత్ ..110వ ఎపిసోడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తొలిసారి ఓటు హక్కు పొందిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. …