Author: Editor's Desk, Tattva News

వైసీపీ హయాంలో రుషికొండ నిర్మాణాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నిర్మాణాల పైన రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. కోర్టుల్లోనూ కేసులు జరిగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ నేత గంటా పార్టీ నేతలతో కలిసి రుషికొండ భవనాలను సందర్శించారు. కళ్లు చెదిరేలా భవనాల లోపల ఇంటీరియర్, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. రూ 500 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా సద్వినియోగం చేస్తుందనేది కీలకంగా మారుతోంది. కొన్నేళ్లుగా సస్పెన్స్ గా మారిన రుషికొండ భవనాల తలుపులు తెరుచుకున్నాయి. మాజీ మంత్రి గంటా తమ పార్టీ నేతలతో కలిసి భవనాలను సందర్శించారు. రుషికొండ చుట్టూ 22 ఎకరాలుండగా అందులో 9.8 ఎకరాల్లో గతంలో హరిత రిసార్టుల పేర హోటళ్లు, రూములు ఉండేవి. 2019 నాటికి ముందు పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కాదు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక రుషికొండను చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టింది.…

Read More

హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం, వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూడా అధికారులు కూల్చేశారు. అయితే ఆ ఇంట్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల, ఆమె అమ్మగారు వైఎస్ విజయలక్ష్మి నివాసం ఉంటుండడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  ఈ కూల్చివేత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో జీహెచ్ఎంసీ ఇంఛార్జ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్టు సమాచారం. పక్క రాష్ట్ర మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్ ఇంటికి సంబంధించిన నిర్మాణాల కూల్చివేతపై ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటంపై ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓ…

Read More

జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లోని శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదం అణచివేసేందుకు.. అందుకు వేగంగా కార్యాచరణ రూపొందించడం కోసం అమిత్ షా మార్గదర్శకాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ నెల 29 వ తేదీ నుంచి హిమాలయాల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్ర ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అమర్‌నాథ్ యాత్రలో భాగంగా లక్షలాది మంది భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా అమిత్‌ షా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో మరింత మంది బలగాలను…

Read More

‘నీట్’ పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సుప్రీంకోర్టు సిఫారసు మేరకు 1,563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు.  రెండు ప్రాంతాల్లో అవకతవలకు వెలుగుచూశాయని, ఈ విషయం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తాను భరోసా ఇస్తునట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  తమ పనితీరును చాలా మెరుగుపరచుకోవాల్సి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఎన్‌టీఏ ఉన్నతాధికారులు దోషులుగా తేలినప్పటికీ వారిని సైతం విడిచిపెట్టేది లేదని చెప్పారు. దోషులెవరైనా వారికి కఠిన శిక్ష తప్పదనని స్పష్టం చేశారు. నీట్ పరీక్షను గత మే 5న దేశవ్యాప్తంగా ఉన్న 4,750 కేంద్రాల్లో నిర్వహించగా, 24 లక్షల మంది హాజరయ్యారు. జూన్ 14న ఫలితాలు వెలువడతాయని అంచనా వేసినప్పటికీ సార్వత్రిక…

Read More

రాష్ట్రంలో టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో మ‌ళ్లీ అమరావతి చుట్టూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న‌తో అక్క‌డ హ‌డావుడి పెరిగింది. గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసిన భ‌వ‌నాల నిర్మాణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాల‌ను తీసివేసి… పెరిగిన పిచ్చి మొక్క‌ల‌ను తొల‌గించే పనిలో అధికార యంత్రాంగం ఉంది. మ‌రోవైపు రియ‌ల్ ఏస్టేట్ వ్యాపారుల తాకిడి కూడా పెరిగింది. ఇదిలా ఉంటే రాజ‌ధాని న‌గ‌రం అమరావతి ప్రస్తుత స్థితిగ‌తులు, భ‌విష్య‌త్తులో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు చేసేందుకు ఒక అధ్య‌య‌న క‌మిటీని వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన విధి విధానాలు రెండు రోజుల్లోనే విడుద‌ల కానున్నాయి. అమ‌రావ‌తి రాజధాని నిర్మాణాల ప‌నులు ఏ స్థాయిలో నిలిచిపోయాయి? ప‌స్తుతం నిలిచిపోయిన ప‌నుల‌ను ఎలా పూర్తి చేయాలి? త‌ద‌త‌ర అంశాల‌పై అధ్య‌య‌న క‌మిటీ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కమిటీలో సీఆర్డీఏ, ఆర్థిక శాఖ, ప్లానింగ్ విభాగం…

Read More

పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తనకు ఆ శాఖను కేటాయించగానే గుంటూరు జిల్లా తెనాలిలో రేషన్ నిల్వ గోదాములను ఆయన తనిఖీ చేశారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   రేషన్​లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని నాదెండ్ల చెప్పారు.ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో రూ 200 కోట్ల కంటే ఎక్కువగా దోపిడీ జరిగినట్లు ఆయన అంచనా వేశారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అంతకు…

Read More

బాలీవుడ్ నటి రవీనా టండన్ తాజాగా ఓ వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకుగానూ ఆమె ఈ చర్యకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఆమె ఆ వ్యక్తిని నోటీసులను పంపారు. ఇటీవలే నటి రవీనా టండన్కు సంబంధిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ముగ్గురు మహిళలను ఢీ కొట్టిందని, అందులో వారు గాయపడినట్టు కొందరు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి నెట్టింట పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ఆమె ఆ సమయంలో మద్యం తాగారని, ఆ మహిళలతో రవీనా వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన రవీనా ఆ వ్యక్తిపై పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో రవీనా తరఫు న్యాయవాది సనా ఖాన్‌ ఈ విషయంపై…

Read More

ఇటలీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ  తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఇటలీలో జి 7 దేశాల అవుట్‌ రీచ్‌ సదస్సుకు హాజరైన మోదీ  వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌ స్కీ తదితరులతో అనేక అంశాలపై చర్చలు జరిపారు.  దేశంలో ఎన్డీయే కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోడి చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడిని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోదీ  స్పందిస్తూ … జి 7 సదస్సు కేంద్రబిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని వివరించారు.  భవిష్యత్‌ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతిన బూనారని వివరించారు. ఘనమైన ఆతిథ్యం…

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కోర్టు వీడియోను సోషల్‌ మీడియా నుంచి తొలగించాలని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆమెతో సహా సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు పంపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్ట్‌ చేసింది.  మార్చి 28న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను రెండోసారి హాజరుపరిచినప్పుడు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాను వ్యక్తిగతంగా ఆయన పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ కూడా ఈ వీడియో క్లిప్‌ను రీట్వీట్‌ చేశారు. కాగా, కోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది వైభవ్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. న్యాయమూర్తులు నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మతో కూడిన డివిజన్…

Read More

దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్ట్‌లు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. అబుఝ్‌మఢ్ సమీపంలో గత రెండు రోజులుగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.  కుతుల్, ఫరస్‌బేడ, కొరతమెట్ట అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నక్సల్స్ కాల్పుల్లో ఓ జవాన్ అమరుడయ్యాడని, మరో ఇద్దరికి గాయాలయ్యాయని వెల్లడించారు. ఘటనా స్థలిలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, మావోయిస్ఠులు పెద్ద సంఖ్యలో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. రెండు రోజుల నుంచి ఎన్‌కౌంటర్ జరగడం.. తీవ్రతను బట్టి చూస్తే భారీగానే మావోలకు ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం తర్వాత ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం వస్తుందని అంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అబుఝ్‌మఢ్ ప్రాంతంలో నక్సల్స్ గురించి సమాచారం అందుకున్న భద్రతా…

Read More