Author: Editor's Desk, Tattva News

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థాపన పూర్తయ్యే వరకు, విగ్రహం ఉన్న ప్రదేశంలో నేతాజీ హోలోగ్రామ్‌ను ప్రదర్శిస్తామని ప్రధాని చెప్పారు. నేతాజీ జయంతి అయిన జనవరి 23న హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను అని ఆయన ట్వీట్ చేశారు. దేశం మొత్తం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో, ఇండియా గేట్ వద్ద గ్రానైట్‌తో చేసిన ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నందుకు సంతోషిస్తున్నాను’ అని ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. “ఇది అతనికి భారతదేశం యొక్క ఋణత్వానికి చిహ్నం” అని తెలిపారు. భారతదేశ అమరవీరుల స్మారకార్థం అమర్ జవాన్ జ్యోతి మినుకుమినుకుమనే గ్రాండ్ పందిరి క్రింద విగ్రహం ఏర్పాటు చేయబడుతుంది. 50 ఏళ్లుగా ఆరిపోని నిత్య జ్వాల జాతీయ యుద్ధ స్మారకం…

Read More

ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరంలేదని కేంద్రం నేడు స్పష్టం చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, 18ఏళ్లలోపు వారికి సంబంధించి కేంద్రం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 6 నుంచి 11 ఏళ్ల వయసు వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉపయోగించే మాస్కులు వాడాలని సూచించింది. 12 ఏళ్లు దాటిన వారికి మాస్క్ కచ్చితమని చెప్పింది. మరోవైపు 18ఏళ్ల లోపు వారికి అందించే చికిత్సకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు ప్రతిపాదించింది. వారికి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత మేరక ఉన్నప్పటికీ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉపయోగించవద్దని ఆదేశించింది. ఒకవేళ స్టెరాయిడ్లు వాడితే వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాటిని 10 నుంచి 14 రోజులకు తగ్గించాలని స్ఫష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన 3 నుంచి 5 రోజుల పాటు స్టెరాయిడ్లను వినియోగించకూడదని తేల్చిచెప్పింది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో…

Read More

గత అర్ధ శతాబ్దకాలంగా భారత సైనికుల శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా,దేశ రక్షణకోసం తమ ప్రాణాలను అర్పించిన వారికి నివాళి ఘటిస్తూ, దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ వస్తున్న దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద సైనికుల స్మరణ కోసం ఏర్పాటు చేసి అమర్ జవాన్ జ్యోతి ‘‘శాశ్వత జ్వాల’’ ఇక చరిత్రలో కలికిపోతున్నది. ఈ రోజు జరిగే వేడుకలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని జ్యోతితో విలీనం చేయనున్నట్టు అధికారక వర్గాలు తెలిపాయి. జ్యోతిలో కొంత భాగాన్ని ఈరోజు మధ్యాహ్నం యుద్ధ స్మారకం వద్దకు తీసుకువెళ్లనున్నారు. అయితే,. ‘అమర్‌ జవాన్‌ జ్యోతి జ్వాల ఆరిపోవడం లేదు.. దాన్ని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో కలిపేస్తున్నారు” అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుల జ్ఞాపకార్థం బ్రిటిష్ వారు ఇండియా గేట్ నిర్మించారు. 1971లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమర్ జవాన్ జ్యోతిని…

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో కేసినో సంస్కృతి వ్యాప్తి చేస్తుండడం పట్ల బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని థాయిల్యాండ్‌లా మార్చేస్తారా? అంటూ ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదంటూ, మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు పేకాట క్లబ్బులు, కేసినోల పేరుతో దోచుకుంటున్నారని ఎంపీ మండిపడ్డారు. గోవా తరహాలో కేసినోలు అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తర్వాత దశలో ధాయిల్యాండ్ తరహాలో మసాజులు, ఇతర జుగుప్సాకర కార్యకలాపాలు తీసుకొస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రి నాని ఏం సమాధానం చెబుతారు అంటూ జీవీఎల్ పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పారు. “ఊఁ అంటావా.. నాని, ఉహూఁ అంటావా?” అంటూ ప్రశ్నించారు. కర్నూలులో బిజెపి తలపెట్టిన ప్రజా నిరనస సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక, ముస్లిం బుజ్జగింపు విధానాలను ఎండగట్టడమేనని జీవీఎల్ స్పష్టం చేశారు. గత నెలలో విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ…

Read More

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ప్రజలు బీజేపీకే పట్టం కడుతారని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌‌’లో వెల్లడైంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 296 లోక్‌‌సభ సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి సొంతంగా 271 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే చెప్పింది. మరోవైపు ప్రధానిగా నరేంద్ర మోదీకే మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారు. దాదాపు 53 శాతం మంది ఆయనకు మద్దతు ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మోదీకి 50 శాతం మందికి పైగా మడ్దతు ఇచ్చారు. పంజాబ్‌‌లో మాత్రమే ఆయనకు మద్దతు కాస్త తగ్గింది. ప్రధాని మోదీ పని తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి జనం జై కొడుతారు? ప్రతిపక్షాలను లీడ్ చేసే పార్టీ మారుతుందా? తదితర 10 అంశాలపై ఇండియా టుడే సర్వే చేసింది. తాము చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు పార్లమెంటు…

Read More

కాథలిక్ చర్చిలో పిల్లల లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి జర్మనీలో విడుదల చేసిన సంచలన నివేదికలో మాజీ పోప్ బెనెడిక్ట్ XVI పై తీవ్రమైన ఆరోపణలు నెలకొన్నాయి. లా ఫార్మ్ వెస్ట్‌ఫాల్ స్పిల్కర్ వాస్టల్ రూపొందించిన ఈ నివేదిక 1945 నుండి 2019 మధ్య మ్యూనిచ్, ఫ్రీజింగ్ ఆర్చ్ డియోసెస్‌ లలో వెలుగులోకి వచ్చిన బాలల లైంగిక వేధింపుల కేసులను ఎలా పరిష్కరించారో విశ్లేషించారు. ఈ నివేదికను నియమించిన మ్యూనిచ్ ఆర్చ్ డియోసెస్, బాధ్యతలు చట్టపరమైన అవసరాలకు లోబడి ఉన్నారా… అనుమానిత కేసులు, నేరారోపణ ఎదుర్కొంటున్న వారి పట్ల తగిన విధంగా వ్యవహరించారా” అని పరిశీలిస్తామని ప్రకటించింది. . మాజీ పోప్ బెనెడిక్ట్, ఆయన అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్ 1977 నుండి 1982 వరకు మ్యూనిచ్ ఆర్చ్ బిషప్ గా పనిచేశారు. ఈ సమయంలో, పీటర్ హుల్లెర్మాన్ అనే పేరున్న పెడోఫైల్ ప్రీస్ట్ పశ్చిమ జర్మనీలోని ఎస్సెన్ నుండి మ్యూనిచ్‌కు బదిలీ అయ్యారు. అక్కడ…

Read More

బంగ్లా యుద్ధం – 36 ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను కాపాడేందుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ విద్యావేత్తలు, నిరసనకారులు ఆ దేశంలో నిరసన ప్రదర్శనలు జరిపారు. దుర్గా పూజ సందర్భంగా హిందూ ఆలయాలపై మతోన్మాద శక్తులు సాగించిన దాడులను నిరసిస్తూ మతాలకతీతంగా వేలాది మంది విద్యార్థులు, విద్యావేత్తలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ‘మేమంతా ఒక్కటేనని ఎలుగెత్తి చాటుతాం’, మతం పేరిట ప్రజలను చీల్చద్దు’, ‘మతోన్మాదుల కుట్రలు సాగనివ్వం’ అంటూ వారు బిగ్గరగా నినదించారు. అంతకు ముందు, మైనార్టీల ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడినవారిని ఎంతమాత్రం ఉపేక్షించరాదని, కఠినంగా అణచివేయాలని ప్రధాని షేక్‌ హసీనా వాజెద్‌ హౌం మంత్రిత్వ శాఖను ఆదేశించారు. సరిహద్దుల్లో పెద్దయెత్తున బలగాలను మోహరించారు. మైనార్టీల ప్రార్థనా స్థలాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మైనార్టీలపై దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఢాకా యూనివర్శిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (డియుటిఎ) డిమాండ్‌…

Read More

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతున్నదని రిజర్వ్‌బ్యాంకు ప్రకటించిన తాజా నివేదిక తేల్చి చెప్పింది. సాధారణంగా చేతిలో నగదు ఉన్నంతవరకు ప్రజల్లో విశ్వాసం అధికంగా ఉంటుంది. భవిష్యత్తుపైనా ఆశలు పెంచుకుంటారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రజల ఆర్ధిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం పడుతోందని రిజర్వ్‌బ్యాంకు విశ్లేషించింది. కరోనా ప్రారంభమైన 2019 మార్చిలో వంద శాతానికి పైగా ఉన్న విశ్వాసం ఆ ఏడాది మే నుంచి క్రమంగా తగ్గిపోతూ వస్తున్నట్లు గుర్తించింది. 2020 మార్చి నాటికి 85 శాతం మాత్రమే విశ్వాసం లెవెల్స్‌ నమోదుకాగా, 2020 సెప్టెంబర్‌ నాటికి 50 శాతానికి గ్రాఫ్‌ పడిపోయింది. ఆ తరువాత కొద్దిగా కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, తరువాత 2021 మే, జూలై నెలల్లో 45 శాతం వరకు తగ్గిపోయినట్లు పేర్కొంది. దాదాపుగా ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా కొంతవరకు ఉంటుందన్న హెచ్చరికలు కూడా రిజర్వ్‌ బ్యాంకు చేయడం గమనార్హం.కరోనా తొలి రెండు దశల్లో ఉపాధిపైనా పెను ప్రభావం చూపించినట్లు…

Read More

సుదూర లక్షాల్యను సైతం అవలీలగా ఛేదించగల బ్రహ్మోస్‌ సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిషాలోని చండీపూర్‌ తీరంలోని ఇంటిగ్రేటడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి గురువారం ఉదయం నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు రూపొందించిన వాటిి కన్నా ఇది సాంకేతికపరంగాను, పరిధి విస్తరణపరంగాను ఎంతో మెరుగైనది. సూపర్‌సానిక్‌ వేగంతో క్షిపణి దూసుకెళ్లిందని, మిషన్‌ లక్ష్యాలు నెరవేరాయని డిఆర్‌డిఓ తెలిపింది. రష్యాకు చెందిన ఎన్‌పిఒఎం, డిఆర్‌డిఒకు చెందిన బ్రహ్మోస్‌ ఎయిరోస్సేన్‌ సంయుక్తంగా ఈ క్షిపణిని తయారు చేశాయి. 2001లో తొలిసారిగా బ్రహ్మోస్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. అప్పటి నుంచి దీనికి మెరుగులు దిద్దుకుంటూ వస్తున్నారు.ఇంతకు ముందు 450కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి సామర్ధ్యాన్ని 600కి.మీ కు పెంచారు. భూ ఉపరితలం నుంచి సముద్రంలోని లక్ష్యాలను, గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి చాలా కాలం క్రితమే సాయుధ…

Read More

ఉద్యోగస్తులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందని  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభా పార్టీ నేత విష్ణుకుమార్ రాజు  మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి గల ప్రేమ ఇప్పుడు తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు.  ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు.. ప్రతిదీ  దగా, మోసం చేస్తుందని ధ్వజమెత్తారు.  ఉద్యోగస్తులకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.  ప్రజలను ఇబ్బంది పెట్టే, వాటినే సీఎం జగన్మోహన్‌రెడ్డి అమలుచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ చూడలేదని పేర్కొన్నారు. ఇలాంటి రాక్షస పాలన చరిత్రలో ఎక్కడ జరగలేదని కూడా స్పష్టం చేశారు. ఈ పోస్ట్ కి రాజీనామా చేసి వేరే రాష్ట్రానికి వెళ్లి పాలన చేయాలని హితవు పలికారు.  ఏపీలో అన్ని రేట్లను పెంచేసి ఉద్యోగులకు మాత్రం జీతాలు తగ్గిస్తున్నారని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభానికి కూడా ముఖ్యమంత్రికి రెండు మూడు గంటల సమయం లేదా అని…

Read More