ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చట్టవిరుద్ధమని, ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్ జారీచేసిన నోటీసుకు వివరణ ఇస్తూ 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్పారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేంద్రం నుంచి వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముందు కేంద్రం నుంచి రూ.5,000 కోట్ల విడుదలకాగా, రూ.50వేల కోట్ల పెట్టుబడులతో ఏపీకి భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విజయవాడ నుంచి ముంబైకు విమాన సేవలు ప్రారంభమవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో శనివారం సాయంత్రం మచిలీపట్టణం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ఈ విమానాన్ని ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు అందజేస్తారు. ప్రతిరోజు సాయంత్రం ముంబై నుంచి బయలుదేరే ఈ ఎయిరిండియా విమానం సాయంత్రం 5.45 గంటలకు గన్నవరం వస్తుంది. ఎయిర్‌పోర్టులో ఈ విమానంపైకి వాటర్ వెదజల్లి ఇక్కడి సిబ్బంది ఘనస్వాగతం పలకనున్నారు. విజయవాడ నుంచి తిరిగి రాత్రి 7.10 గంటలకు బయలుదేరి.. రెండు గంటల్లో ముంబై వెళుతుంది. ఈ ఎయిరిండియా ఏఐ599 సర్వీసులో 180 సీటింగ్…
భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో ఆయుధం వచ్చి చేరింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బాంబింగ్ డ్రోన్ ఇండియన్ ఆర్మీకి అందుబాటులోకి వచ్చింది. భారత సైన్యం మొత్తం 480 నాగాస్త్ర-1 డ్రోన్‌ల తయారీ కోసం నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ నాగాస్త్ర-1 ను సిద్ధం చేసి భారత సైన్యానికి అందజేసింది. స్వదేశీ లాటరింగ్ మందుగుండు డ్రోన్ ‘నాగాస్త్ర-1’ ఇళ్లలోకి ప్రవేశించి కూడా శత్రువులపై దాడి చేయగలదు. శత్రువును చేరి ఈ డ్రోన్ పేలిపోతుంది. అందుకే దీన్ని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారు. అత్యవసర సేకరణ అధికారాల కింద భారత సైన్యం నాగ్‌పూర్‌లోని ‘సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీకి ఈ డ్రోన్‌ల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ డ్రోన్ పనితీరును శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. సైనిక భాషలో ఈ నాగాస్త్ర డ్రోన్‌లను లాటరింగ్ మందుగుండు సామగ్రి అంటారు. నాగాస్త్ర-1ను భూమి…
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దారులు గల్ప్ ఆఫ్ ఆడెన్‌లో నౌకపై గురువారం దాడిచేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. భారీ సరుకు రవాణా నౌకపై రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించారని, ఈ ఘటనలో ఓ నౌక సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. ఉక్రేనియన్‌కు చెందిన ఎం-వి వెర్బెనా నౌకను పోలిష్ ఆపరేట్ చేస్తోందని, నౌకలో మంటలు చెలరేగినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ (సిఇఎన్‌టిసిఒఎం) ఓ ప్రకటనలో తెలిపింది. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎర్రసముద్రంలో, గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో హౌతీల దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీయడంతో పాటు నౌక సిబ్బంది జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయని పేర్కొంది. ఎర్రసముద్రంలో హొడెయిడా పోర్టుకు వాయువ్యంగా 80 నాటికల్ మైల్స్ దూరంలో ఓ నౌకకు సమీపంలో పేలుడు జరిగిందని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని యుకె మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యుకెఎంటిఒ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు 24 గంటల ముందు హౌతీలకు చెందిన…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24 మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే యువతకు కీలకమైన శాఖల బాధ్యతల్ని అప్పగించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తనకు ఇస్తామని చెబుతున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. నారా లోకేష్‌కు ఊహించినట్లే ఐటీశాఖతో పాటు మానవ వనరులను కూడా ఇచ్చార. నారాయణకు 2014 నుంచి 2019 మధ్య నిర్వహించిన మున్సిపల్ శాఖనేే దక్కింది.ఆర్ధిక శాఖ పయ్యావుల కేశవ్ కు, హోమ్ శాఖ వంగలపూడి అనితకు లభించింది. నారా చంద్రబాబు నాయుడు: ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్, జీఏడీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు1) కొణిదెల పవన్ కళ్యాణ్ – డిప్యూటీ సీఎం – పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావణ శాఖలు2) నారా లోకేష్ – ఐటీ, మానవవనరుల శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్…
కాంగ్రెస్ పార్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 2019 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ ఆమె ఇంకా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశింపలేదు. కొన్నేళ్ల క్రితం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. 2019 ఎన్నికలలో వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీచేస్తారని వార్తలు వచ్చినా ఆమె చేయలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కచ్చితంగా పోటీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు కూడా భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని, తన మనసులో మాట కూడా బయటపెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ…
దేశ రక్షణ, భద్రతే ప్రధానం అని పదే పదే చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందుకు తగిన అధికారులను కీలక హోదాల్లో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ భద్రతా సలహాదారునిగా (ఎన్ఎస్ఏ) మరోసారి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అజిత్ ధోవల్‌కే అవకాశం దక్కింది. జాతీయ భద్రత సలహాదారుగా అజిత్ ధోవల్‌ను కొనసాగిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఎస్‌ఏగా ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. జూన్ 10 వ తేదీ నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీకాలం పూర్తయ్యేవరకు లేదా తర్వాతి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎన్‌ఎస్‌ఏగా అజిత్ ధోవల్ ఉంటారని.. సిబ్బంది వ్యవహారాలశాఖ వెల్లడించింది. ఇక ఈ పదవీకాలంలో అజిత్ ధోవల్‌కు కేబినెట్ మంత్రి హోదాను కల్పిస్తారు. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2014 మే 30 వ తేదీన జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్ తొలిసారి బాధ్యతలు…
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పపై బెంగళూరు ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. త్వరలోనే ఆయనను సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే యడ్యూరప్పకు సీఐడీ సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలో ఉన్న మాజీ సీఎం యెడియూరప్ప ఢిల్లీ నుంచి తిరిగి బెంగళూరుకు వచ్చే అవకాశం ఉంది. 17 ఏళ్ల బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మార్చి 14న బెంగళూరు పోలీసులు యెడియూరప్ప పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యడియూరప్ప పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిందని, అవసరమైతే ఆయనను అరెస్టు చేయవచ్చని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర గురువారం తెలిపారు. ‘‘ఈ కేసులో జూన్ 15 లోగా చార్జిషీట్ దాఖలు చేయాలి. అంతకంటే…
నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో అమరావతి సచివాలయంలో గురువారం అడుగు పెట్టారు. తన ఛాంబర్‌లో సీఎంగా సరిగ్గా సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలపై సంతకాలు చేశారు. ముందుగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. లాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణపై రెండో సంతకం, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచే ఫైలుపై మూడో సంతకం.. , ఉపాధి కల్పనకు సంబంధించి వివిధ స్కిల్స్ ఉన్న వారి వివరాల సేకరణకు సంబంధించిన స్కిల్ సెన్సస్ నిర్వహణపై నాలుగో సంతకం.., అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేశారు. ఇలా ఐదు అంశాలపై సంతకాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ సచివాలయంలో అడుగు పెట్టారు. సచివాలయంలోని ఐదు…
దక్షిణ కువైట్‌లో బుధవారం తెల్లవారు జామున వలస కార్మికులు నివసిస్తున్న ఒక భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది చనిపోగా, వారిలో 42 మంది భారతీయులు ఉన్నారు. ఇంకా డజన్ల కొద్దీ గాయపడ్డారు. కువైట్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎన్‌బిటిసి ఆ భవనాన్ని నిర్మించింది. స్థానిక మీడియా వార్తల ప్రకారం, మంగాఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలోని వంటగదిలో బుధవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 6 గంటలకు మంటలు లేచాయి. ప్రమాద స్థలంలో క్రిమినల్ ఎవిడెన్స్ సిబ్బంది పరిశీలన పూర్తయ్యేంత వరకు మంగాఫ్ భవనం యజమానిని, భవనం కాపలాదారును, కార్మికుల బాధ్యత ఉన్న సంస్థ యజమానిని పట్టుకోవాలని పోలీసులను కువైట్ దేశీయాంగ శాఖ మంత్రి షేఖ్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబాహ్ ఆదేశించినట్లు ‘కువైట్ టైమ్స్’ వెల్లడించింది. ‘ . ‘డజన్ల కొద్దీ వ్యక్తులను రక్షించడమైంది. కానీ దురదృష్టవశాత్తు మంటల నుంచి వచ్చిన పొగ…