దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ఈ నెల 9న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మహోత్సవానికి విదేశీ నేతలు హాజరుకానున్నారు. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ , భూటాన్ ప్రధాని షెరింగ్ తొబ్‌గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, హాజరు కానున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. దానిని తమ అధ్యక్షుడు అంగీకరించారని తెలిపింది. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోడీ ఫోనులో మాట్లాడారని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారని దౌత్యవర్గాలు తెలిపాయి. పొరుగు దేశమైన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు మాత్రం ఇంకా మోదీ నుంచి…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్‌రెడ్డి సెలవు పెట్టి వెళ్లిపోయారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు అందరిని తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు రాజీనామా చేయని సలహాదారులను తొలగించాలని సమాచారం. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఇప్పటికే అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోయారు. బుధవారంద చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆయన్నే కొనసాగించే ఉద్దేశం టీడీపీ ప్రభుత్వానికి లేదనే సమాచారాన్ని అందించారు. దీంతో గురువారం జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతో సెలవు పై వెళుతున్నట్లు సిఎస్ లేఖలో పేర్కొన్నారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్‌కు జవహర్ రెడ్డి సెలవు లేఖను పంపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సిఎస్ మార్పు జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. టీడీపీపై జరిగిన కక్ష సాధింపు వ్యవహారాలు, ఆర్ధిక అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, వైసీపీకి అన్ని విధాలుగా సహకరించడంలో సిఎస్ జవహర్ రెడ్డి…
ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేపట్టడానికి ముందే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. బుధవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన కొందరు సీనియర్ అధికారులతో ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తున్నది. కీలకమైన శాఖలలో నెలకొన్న పరిస్థితులలపై శ్వేతపత్రాలను సిద్ధం చేయమని ఆదేశించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి దృష్టి సారిస్తున్నారు. ఈ శాఖకు సంబంధించి ఐదేళ్ల కాలంలో తీసుకున్న రుణాలు, వచ్చిన ఆదాయం, చేసిన వ్యయం వంటి అంశాలతో పూర్తిస్థాయిలో నివేదికను సిద్ధం చేయమని ఆదేశించారు. అలాగే కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు, వచ్చిన గ్రాంట్లు, రాష్ట్రంలోని పథకాలకు ఆసియన్ డెెవలప్‌మెంట్ బ్యాంకు , నబార్డ్, హడ్కో, జైకా వంటి జాతీయ, అరతర్జాతీయ విత్త సంస్థల నుంచి తీసుకున్న సాయం వంటి అంశాలను కూడా పూర్తిగా ఆ నివేదికలో పొందుపరచనున్నారు. అలాగే 2014 నుంచి 2019 వరకు ఉన్న ఆర్థిక స్థితి, ఆ తరువాత 2019 నుంచి…
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఓట్లు బిజెపికి బదిలీ కావడం వల్లే తాను గెలిచానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బిజెపి నేత రఘునందన్ రావు ఖండించారు. రేవంత్ రెడ్డి తన గురించి కానీ, తన పార్టీ గురించి మాట్లాడే ముందు నోరు, ఒళ్లు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల ఎంపీగా గెలవలేదని స్పష్టం చేశారు. కేవలం బీజేపీ శ్రేణుల కష్టం, అహంకారపూరిత కేసీఆర్ కుటుంబానికి, హరీశ్ రావు దుర్మార్గపు క్రియలకు మెదక్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే మెదక్‌లో తన గెలుపు సాధ్యమైందని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని మరి ఆ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయా? అని ప్రశ్నించారు. మెదక్‌లో సొంత పార్టీని రేవంత్ రెడ్డి గెలిపించుకోలేపోయారని ధ్వజమెత్తారు. హరీశ్ రావు అనే వ్యక్తి తనకు ఒక్క…
టి20 ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమష్టిగా రాణించిన టీమిండియా పసికూలన ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడా విజయం సాధించింది. భారత బౌలర్లు నిప్పుల చెరిగె బంతులతో ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే చాప చుట్టేసింది ఐర్లాండ్. గ్రూప్-ఏలో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరుగిన లీగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు హార్దిక్ పాండ్యా(3/27), జస్‌ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2×4, 2×6; 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2×4 ; 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో 1×4, 1×6 ; 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగలిగారు. మిగతా బ్యాటర్లు రాణించలేక పోయారు. అనంరతం లక్ష ఛేదనకు…
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పక్ష నేతగా ప్రధాని మోదీని ఎన్నుకున్నారు. బుధవారం ఢిల్లీలోని మోదీ నివాసంలో ఎన్డీయే పార్టీల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ) లిఖిత పూర్వకంగా మద్దతు ఇచ్చాయి. దీంతో జూన్ 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే నేతలు కలువనున్నారు. జూన్ 8న మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు ఎన్డీయే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్నది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ నేతలు లల్లన్ సింగ్, సంజయ్ ఝా, బీహార్‌లో ఎన్డీయే కూటమికి చెందిన చిరాగ్ పాశ్వాన్, మాంఝే, జేడీ(ఎస్) నేత కుమారస్వామి, సీఎం షిండే తదితర…
ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు చివర రెడ్డి పెట్టుకుంటానని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని కాపు ఉద్యమ నేత ముద్రగడ ప్రకటించారు. ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభంపై మంగళవారం నుంచి తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. పేరు మార్చుకునేది ఎప్పుడంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్టు ముద్రగడ ప్రకటించారు. అందుకు అవసరమైన గెజిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. పిఠాపురంలో పవన్‍ను ఓడిస్తానని సవాల్ చేశానని, దాంట్లో తాను ఓటమి చెందానని, అన్నమాట ప్రకారం తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నానని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తన కోసం వచ్చే వారికి ఉప్మాలు పెట్టడంపై జనసేన కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులకు బిర్యానీలు పెట్టాలని సూచించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవిలపై వైసీపీ నేత…
లోక్ సభ ఎన్నికలలో మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు నైతికంగా రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి వైదొలగాలని బీజేపీ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ నుండి లోక్ సభకు ఎన్నికైన డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏమైందని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కానీ సీఎం సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బీజేపీని గెలిపించిందని రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు. పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోతే అభివృద్ధి జరగదని హెచ్చరించారని ఆమె మండిపడ్డారు. అక్కడ ముఖ్యమంత్రే అభ్యర్థిలా వ్యవహరించారని అరుణ విమర్శించారు.…
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 292 సీట్లు రాగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. దీంతో కేంద్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మోదీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 8న ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని సమాచారం. ఈనెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం ఉండనున్నట్లు పేర్కొన్నాయి. నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు. కాగా, బుధవారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ చివరి సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మంత్రులతో ఆయన…
సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం పోవడంతో తిరిగి సంకీర్ణ రాజకీయాలు చోటుచేసుకోవాల్సి వస్తున్నది. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు. దీంతో మిత్రపక్షాల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఢిల్లీలో బుధవారం ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నాయి.బీజేపీ సొంతంగా మ్యాజిక్ పిగర్ అయిన 272 సీట్లు సాధించలేకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీకి 16, జేడీయూకు 12 సీట్లు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జెడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నూతన ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కానున్నారు. అందుకనే వారిద్దరికీ స్వయంగా ప్రధాని మోదీ ఫలితాలు వస్తుండగానే మంగళవారం పోన్ చేసి మాట్లాడారు. ఈనెల 8న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ…