బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి కుట్ర పన్నిన ప్రఖ్యాత లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరు పన్వేల్ లో సల్మాన్ కారుపై కాల్పులు జరపడానికి కూడా ప్రణాళిక రచించారు. ఈ కేసుకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్ సహా ఈ కేసుతో సంబంధం ఉన్న 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి ఈ నలుగురు నిందితులు పాకిస్తాన్ నుంచి ఏకే 47 సహా పలు ఆయుధాలు తెప్పించుకున్నారు. సల్మాన్ ఖాన్ ను హత్య చేసిన అనంతరం శ్రీలంకకు పారిపోవాలని వారు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నలుగురిని ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారు ధనుంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం…
Author: Editor's Desk, Tattva News
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం ఏడవ, చివరి దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి స్థానంతోసహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 57 స్థానాల్లో 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఏడవ దశలోనే ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ స్థానాలలో చివరి 42 స్థానాలకు పోలింగ్ కూడా జరగనున్నది. ఇప్పటి వరకు 28 రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాలలో పోలింగ్ పూర్తయింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్నది. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 స్థానాలు, ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లోని 9 స్థానాలు, బీహార్‌లోని 8 స్థానాలు, ఒడిశాలోని 6 స్థానాలు, జార్ఖండ్‌లోని 3 స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని 1 స్థానానికి చివరి దశలో పోలింగ్ జరగనున్నది. మొత్తం 904మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని…
ఆదివారం (2న) తాను లొంగిపోతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వెల్లడించారు. జైలులో తనను మరింతగా వేధించినా తాను తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. జైలులో నుంచి బెయిల్‌పై విడుదల అయిన అనంతరం ఆయన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ వీడియో ద్వారా విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ‘నేను జూన్ 2న లొంగిపోవలసి ఉంది. ఈ దఫా ఎంత కాలం జైలులో ఉంటానో నాకు తెలియదు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు జైలుకు వెళుతున్నాను. అందుకు గర్విస్తున్నాను’ అని చెప్పారు. ‘వారు నా ఆరోగ్యాన్ని దెబ్బ తీయాలని చూశారు. నేను జైలులో ఉండగా నా మందులు ఆపేశారు. అరెస్టు అయిన తరువాత ఆరు…
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే సస్పెన్షన్ కు గురై దాదాపుగా ఐదేళ్లపాటు విధినిర్వహణకు దూరంగా ఉన్న డైరెక్టర్ జనరల్ స్థాయి ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుపై రాష్త్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం సస్పెన్షన్ తొలగించి పోస్టింగ్ ఇవ్వడం, సాయంత్రంకు ఆయన పదవీ విరమణ చేయడం నాటకీయంగా జరిగిపోయాయి. అధికార పార్టీ వేధింపులపై అయిదేళ్ వివిధ రూపాల్లో అలుపెరగని న్యాయపోరాటం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఉదయం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సాయంత్రమే ఆయన ఉద్యోగ విరమణ చేశారు. 2019లో అధికారంలోకి వచ్చీ రాగానే వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు అయిదేళ్లుగా న్యాయపోరాటం చేసి కడకు విజయం సాధించారు. ప్రభుత్వ అనుచిత చర్యలకు వ్యతిరేకంగా తొలుత క్యాట్‌ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఎత్తి వేయాలని ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.…
హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను జూన్ 6వ తేదీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. హసన్‌లో మహిళలపై జరిగిన లైంగిక దాడి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాట చేసింది. ప్రజ్వల్ రేవణ్ణను శుక్రవారం మధ్యాహ్నం 42వ అదరనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(ఎసిఎంఎం) ఎదుట సిట్ హాజరుపరచగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 6 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.53 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు వేర్వేరు కేసులలో అరెస్టు నుంచి తప్పించుకుని జర్మనీలో తలదాచుకున్న ప్రజ్వల్ మునిచ్ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. నగరంలోని సిఐడి ప్రధాన కార్యాలయంలగల సిట్ కార్యాలయంలో ఉన్న తాత్కాలిక సెల్‌లో రాత్రంతా గడిపిన ప్రజ్వల్‌ను ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం…
అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రికార్డుల ఫోర్జరీ, అవకతవకల కేసుకు సంబంధించి అభియోగాలలో 34 అంశాలలో దోషిగా తేలారు. అమెరికా శృంగార తార స్మార్టీ డేనియల్స్‌తో అక్రమ సంబంధం వ్యవహారం చివరికి ఈ ఏడాది జరిగే దేశాధ్యక్ష ఎన్నికల దశలో ట్రంప్‌కు చిక్కులు తెచ్చిపెట్టాయి. బ్లూఫిల్మ్ స్టార్‌ను వదుల్చుకునేందుకు డబ్బులు ముట్టచెప్పే క్రమంలో ట్రంప్ ఏకంగా తన రిపబ్లికన్ పార్టీ నిధులను దారిమళ్లించాడని, ఈ క్రమంలో పలు ఫోర్జరీలకు పాల్పడ్డాడనే అభియోగాలలో దోషిగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయనను ఖరారు చేసింది. తనకు డబ్బులు ఇచ్చి నోరు మూయించాలని చూశారని పేర్కొంటూ స్మార్టీ ఇక్కడి కోర్టులో హుష్‌మనీ కేసు దాఖలు చేసింది. జులై 11వ తేదీన తుదితీర్పు వెలువరించి ఇందులో శిక్షను ఖరారు చేస్తుంది. అమెరికాలో ఇప్పుడు డెమోక్రాట్ల తరఫున అధ్యక్షుడు బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వాలు, వీరి మధ్య మునుపటిలాగానే పోటీకి రంగం సిద్ధం అయింది.…
మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నెల రోజుల తర్వాత తిరిగొచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరు విమానాశ్రయంలో దిగి దిగగానే అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాత్రి 12.30 గంటలకు చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే ప్రజ్వల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, భారీ భద్రత మధ్య సీఐడీ ఆఫీసుకు తరలించారు. మే 31న తాను విచారణకు హాజరవుతానని మూడు రోజుల కిందట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు మూడు సార్లు రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసి.. చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో గురువారం కూడా హ్యాండిస్తాడేమోనని పోలీసులు అనుమానించారు. అయితే, ప్రజ్వల్ చెప్పినట్టుగానే మే 30న బెంగళూరు చేరుకున్నారు. మరోవైపు, బెంగళూరులోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక న్యాయస్థానంలో…
ప్రఖ్యాతిగాంచిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం తన 45 గంటల ధ్యానాన్ని ప్రారంభించారు. సమీపంలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్‌లో కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మొదుగా భగవతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఫెర్రీలో రాక్ మెమోరియల్ చేరుకున్న మోదీ ధ్యానం ప్రారంభించారు. జూన్ 1వ తేదీ వరకు ధ్యానం సాగుతుంది. తెల్లని ధోవతి, శాలువా ధరించిన మోడీ భగవతి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారిని గర్భాలయంలో దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు అమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక హరతి ఇచ్చి ప్రధాని మోదీకి ప్రసాదంగా శౠలువాతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ నిర్వహించే ఫెర్రీ సర్వీసులో వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నారు. ధ్యానంలోకి వెళ్లడానికి ముందు మోడీ కొద్ది సేపు ధ్యాన మండపానికి దారితీసే మెట్ల పైన కూర్చుని అద్భుతంగా కనిపించే సముద్ర అందాలను…
దేశంలో దాదాపు 3 నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి తెరపడింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు.. అభ్యర్థులు గత కొన్ని నెలలుగా చేస్తున్న ప్రచారం గురువారంతో ముగిసింది. 7 దశల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రచారం పూర్తి కాగా.. ఇక చివరి విడత ఎన్నికలు జూన్ 1 వ తేదీన జరగనున్నాయి. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక గత 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కాస్త రిలాక్స్ అయ్యారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలతో హోరెత్తించారు. ఇక ఫలితాలు వెల్లడయ్యేందుకు కొంత సమయం ఉండటంతో ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారిలో ధ్యానం చేయనున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కుటమిని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నరేంద్ర మోదీ.. 73 ఏళ్ల వయసులో దేశం మొత్తాన్ని…
జమ్ములో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. బస్సు సుమారు 150 అడుగుల లోతు లోయలో పడిపోయింది. అయితే క్షతాగాత్రులను అక్నూర్‌లోని స్థానిక ఆసుపత్రికి, జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు జమ్ము ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జమ్ము- పూంఛ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటం వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. యాత్రికులతో నిండిన ఆ బస్సు హరియాణాలోని కురుక్షేత్ర నుంచి జమ్ముకశ్మీర్‌లోని శివఖోరీకి బయల్దేరినట్లు…