ప్రతిపక్షాలు తనను 24 ఏళ్లుగా తిడుతూనే ఉన్నాయని.. ఆ తిట్లు తినీతినీ బండబారిపోయానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తనను 101 తిట్లు తిట్టారని తమ పార్టీ ఎంపీ ఒకరు లెక్కించినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ చరమాంకానికి చేరిన సందర్భంగా మంగళవారం ఆయన ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2007లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోదీని ‘మృత్యుబేహారి’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇది బాగా వివాదాస్పదమై కాంగ్రెస్ పరాజయానికి కారణమైంది. ప్రధాని దీనిపై స్పందిస్తూ తనను మృత్యుబేహారి అని.. ‘మురుగుకాల్వలో పురుగు’నని ఎవరు అన్నారని ప్రశ్నించారు. ‘వరుస ఓటములతో విపక్షాలు నిస్పృహకు లోనయ్యాయి. అందుకే నన్ను తిట్టడం వాటి స్వభావంగా మారింది. బీజేపీ పార్లమెంటు సభ్యుడొకరు లెక్కగట్టి నన్ను 101 తిట్లు తిట్టారని తేల్చారు. ఎన్నికలు ఉన్నా.. లేకున్నా నన్ను తిట్టడం తమ హక్కుగా విపక్షాలు భావిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. బీజేపీ రాజకీయ…
Author: Editor's Desk, Tattva News
మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలూ వద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్‌పోర్టును గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న, ఉపయోగంలో ఉన్న మొబైల్ నంబర్‌తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని, అలాంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, తన అనుచరులు ప్రజాశాంతికి భంగం కలిగించేలా అవాంఛనీయ ఘటనలకు…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపు అభ్యర్థనను తక్షణం విచారించేందుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ మంగళవారం నిరాకరించింది. విచారణ నిమిత్తం పిటిషన్ లిస్టింగ్‌పై తదుపరి ఆదేశాల నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు ఈ పిటిషన్‌ను బెంచ్ నివేదించింది. జూన్ 1న ముగియనున్న తన మధ్యంతర బెయిల్ గడువును వైద్య కారణాలపై ఏడు రోజులు పొడిగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్ కోరారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 21న అరెస్టు చేసిన కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 10న ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కేజ్రీ విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, కొన్ని వైద్య పరీక్షల కోసం సిఎం కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని ఆయన తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది…
ప్రతి లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సమయానికి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానం చేసే ధోరణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారు. ఈసారి ఆయన తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయబోతున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ధ్యాన మండపంలో మే 30వ తేదీన సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీన సాయంత్రం వరకు మోదీ ధాన్యం చేయనున్నారు. దాదాపు రెండు రోజుల పాటు ప్రధానమంత్రి ధ్యాన మండపంలోనే మెడిటేషన్ చేస్తూ గడపనున్నారు. భగవాన్ శివుని కోసం ఎదురుచూస్తూ పార్వతీ దేవి ఒకే పాదంపై కన్యాకుమారిలో ధ్యానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్ స్థూపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, స్వామి వివేకానందుడి జీవితంలో కన్యాకుమారి రాక్ మెమోరియల్‌కు అంతటి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ధ్యానం చేసిన తర్వాతే స్వామి వివేకానందుడికి తన కర్తవ్యం బోధపడిందని చెబుతారు. భారత దేశ నిర్మాణం…
బెంగాల్లో పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చే రాష్ట్రంగా బెంగాల్ నిలవనుందని ఓ జాతీయ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. బెంగాల్లో అత్యధిక స్థానాల్లో తమ పార్టీ గెలవబోతున్నట్లు ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇక తన వరకు వస్తే 24 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలు దూషిస్తున్నాయని, దానివల్ల ఇప్పుడు తాను దూషణల నిరోధకంగా మారినట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో ‘మౌత్ కా సౌదాగర్’, ‘గందీ నాలీ కా కీడ’ అనే వ్యక్తిగత దూషణలు ఎదుర్కొనట్లు ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బంగాల్‌లో ఎలాంటి మోసాలు, దారుణాలు జరిగాయో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమని పేర్కొన్నారు.…
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావు పోలీసులకు తెలిపిన వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించిందన్న రాధాకిషన్‌రావు బీఆర్ఎస్ ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ విభాగానికి తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకమైన అధికారి కావాలని కేసీఆర్ కోరుకున్నారని వెల్లడించారు. కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారనీ, ప్రతిపక్ష నాయకులను గమనిస్తూ ఉండేందుకు ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఆధ్వర్యంలో ఐజీ ప్రభాకర్‌రావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని వెల్లడించారు. అప్పటి నుంచి వారితో కలిసి పనిచేయడం మొదలుపెట్టానని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్‌రావు ద్వారా తీసుకున్నట్లు రాధాకిషన్‌రావు తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, బీఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటానికి ప్రణీత్‌రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించినట్లు…
కౌంటింగ్ రోజు అల్లర్లు, ఘర్షణలు జరిగేందుకు అవకాశం ఉన్న సమస్యాత్మక నియోజకవర్గాలు, గ్రామాల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రతిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామన్న మీనా, కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలను అమర్చినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు భౌతికంగా రెండు పర్యాయాలు స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించే అవకాశం కల్పించామని చెప్పారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు దాడులను దృష్టిలో పెట్టుకొని 20 కంపెనీ బలగాలను రాష్ట్రానికి కేటాయించినట్లు మీనా వెల్లడించారు. పోలింగ్ తరువాత రోజు మాత్రమే అల్లర్లు, ఘర్షణలు జరిగాయన్న మీనా, పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ…
తనపై వచ్చిన లైంగిక దౌర్జన్యాల ఆరోపణలకు సంబంధించిన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. ఈ కేసులో మే 31న తాను సిట్ ముందు హాజరవుతానని వెల్లడించారు. అంతేకాదు, ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను సహకరిస్తానని స్పష్టం చేవారు. న్యాయవ్యవస్థ, చట్టాలపై తనకు నమ్మకం ఉందని రేవణ్ణ తెలిపారు. కానీ, తనపై తప్పుడు కేసుల పెట్టారని ఆయన ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరిగిందని యువ ఎంపీ దుయ్యబట్టారు. తల్లిదండ్రులు, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్బంగా ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ప్రజ్వల్ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ‘రాహుల్ గాంధీతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు దీనిపై నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇదంతా రాజకీయ కుట్రలో బాగమే.. మే 31న ఉదయం 10.00 గంటలకు సిట్ ముందు హాజరై కేసుకు సంబంధించిన సమాచారం అందజేస్తాను.. విచారణకు…
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది.. ఇప్పటికే శిథిలాల కింద నుంచి రెండు వేల మృతదేహాలను వెలికితీశారు.. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టింది ఐక్య రాజ్య సమితి బృందం. ఈ మానవ మరణాలను ఈ శతాబ్ధంలోనే అత్యంత విషాద ఘటనగా అభివర్ణించింది యుఎన్ ఓ. ఇదిలా ఉంటే శుక్రవారం తెల్లవారుజామున ఈ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్‌లో చాలా ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. కానీ, భారీ భవనాలు, పంటలు కూడా వీటి కింద చిక్కుకుపోయినట్లు తేలింది. పోర్గెర మైన్‌కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కొండచరియలు విరిగి…
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు (ఒక దేశం-ఒకే ఎన్నిక) నిర్వహిస్తామని ఆ పార్టీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని కచ్చితంగా అమలు చేస్తావని ప్రకటించారు. జూన్ 1న తుది విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. యూసీసీ.. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ రూపకర్తలు పార్లమెంటు, శాసనసభలకు వదిలివెళ్లిన బాధ్యతగా పేర్కొన్నారు. ‘రాజ్యాంగ సభ మనకు నిర్దేశించిన నియమాల్లో ఉమ్మడి పౌరస్మృతి కూడా ఉంది. లౌకికదేశంలో మతప్రాతిపదికన చట్టాలు ఉండకూడదని అప్పట్లో కేఎం మున్షీ, బాబూ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అనేది భారీ సామాజిక, చట్ట, మతపరమైన సంస్కరణ. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం దీనిపై ఓ ప్రయోగం చేపట్టింది. ఈ చట్టంపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై…