Author: Editor's Desk, Tattva News

హైదరాబాద్‌లో అధికారుల వరుస దాడులు సంచలనంగా మారాయి. నెల రోజులుగా నగరంలోని పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. తాజాగా.. నగరంలో ఉన్న ఆస్పత్రులపై వైద్య మండలి సభ్యులు దాడులు నిర్వహించగా పెద్ద ఎత్తున.. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు బయటపడ్డారు. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని.. ఆస్పత్రులు నడిపించటమే కాకుండా.. డాక్టర్ల ముసుగులో రకరకాల దందాలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన సంచలన విషయాలను అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్, సూరారం వంటి ప్రాంతాల్లో మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. తెలంగాణ వైద్య మండలికి చెందిన 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా విడిపోయి.. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ నకిలీ…

Read More

ఆర్మూర్‌లోని మాల్ అండ్ మల్టీప్లెక్స్ రీ ఒపెన్ అయిన సమయంలో బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జీవన్‌రెడ్డితో పాటు అతడి కుటుంబసభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భూమిలో ఉన్న భవనాన్ని కూల్చివేసి మరో భవనాన్ని నిర్మించారని సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జీవన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 32, 35, 36, 38లో 20 ఎకరాల 20 గుంటల భూమిని సామ దామోదర్ రెడ్డి కొనుగోలు చేసి అతని తండ్రి పరమ్ రెడ్డి పేరుపై ఫంక్షన్ హాల్ నిర్మించారు. 2023లో జీవన్ రెడ్డి, అతని అనుచరులు ఫంక్షన్ హాల్‌ను కూల్చేసి వేరే భవనాన్ని నిర్మించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు…

Read More

ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఓ తెలంగాణ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన అరవింద్ యాదవ్ మృతదేహాన్ని సిడ్నీ సముద్ర తీరంలో గుర్తించారు. షాద్‌నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ కుటుంబం హైదరా బాద్‌లో స్థిరపడింది. 12ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన అరవింద్ యాదవ్ అక్కడే స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితం షాద్‌నగర్‌కు చెందిన యువతితో అరవింద్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అరవింద్ యాదవ్ తల్లి, భార్యతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. వారం రోజుల క్రితం అరవింద్ తల్లి స్వదే శానికి తిరిగి వచ్చారు. దాదాపు ఐదు రోజుల నుంచి అరవింద్ అచూకీ లేడని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆస్ట్రేలియా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం అరవింద్ మృతదేహాన్ని సముద్ర తీరంలో గుర్తించారు. అంతకు ముందు అరవింద్ కారును బీచ్ ఒడ్డున గుర్తించారు. అప్పటి నుంచి అరవింద్ అచూకీ కోసం గాలిస్తున్నారు. కుమారుడు…

Read More

ప్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగా వైభవంగా జరిగింది. కేన్స్ 2024లో ఇండియన్ షార్ట్ ఫిల్మ్‌కు ఫస్ట్ బహుమతి లభించింది. భారత్‌కు చెందిన ‘సన్‌ప్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ అనే సినిమా 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానం దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను కన్నడ జానపద కథ ఆధారంగా చిదానంద అనే వ్యక్తి తెరకెక్కించాడు. షార్ట్ ఫిల్మ్ నిడివి 16 నిమిషాలు ఉంటుంది. ఓ వృద్ధురాలు కోడిని ఎవరో దొంగలించడంతో దాని కోసం ఆమె పడే తపన ఈ చిత్రంలో కనిపిస్తుంది. హాలీవుడ్‌తో పోటీపడి మొదటి బహుమతి గెలుచుకోవడంతో సినిమా బృందాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మేరఠ్‌కు చెందిన మహేశ్వరి తెరకెక్కించిన ‘బన్నీహుడ్’ చిత్రానికి తృతీయ బహుమతి వచ్చింది. రెండు భారతీయ సినిమాలు టాప్ -3లో రెండు బహుమతులు రావడంతో భారత దేశ ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పారు. మొదటి బహుమతికి 15000 యూరోలు,…

Read More

కోల్‌కతాలో ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎంపి అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకడైన బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడు జిహాద్ హవ్లాదార్‌ను ముంబయిలో పట్టుకున్నారు. తాను హత్య ఎలా చేసిందీ అతను పోలీసుల విచారణలో వివరించాడు. బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తరుజ్జామన్ ఆదేశాలతో తాను, మరి నలుగురు బంగ్లా జాతీయులు ఈ హత్యలో పాల్గొన్నట్లు అతను చెప్పాడు. కోల్‌కతా న్యూటౌన్ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఎంపిని తొలుత గొంతు నులిమి చంపినట్లు అతను తెలిపాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముందు చర్మం ఒలిచి ఆ తరువాత శరీర భాగాఆలు, ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లు అతను చెప్పాడు. అనంతరం శరీర ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్‌కతా నలు…

Read More

ఇప్పటి వరకు ఐదు దశల్లో జరిగిన పోలింగ్‌ శాతం విశ్లేషణ 2019లోని 409 సీట్లలో డేటాతో సరిపోల్చుకుంటే దాదాపు మూడింట రెండు వంతుల మంది ఓటింగ్‌కి దూరంగా ఉన్నారని వెల్లడవుతుంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 88 స్థానాల్లో (సుమారు ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో) తక్కువశాతం పోలింగ్‌ నమోదైందని సర్వేలు వెల్లడించాయి. తక్కువ ఓటింగ్‌ శాతం నమోదవ్వడం, లేదా ప్రత్యేకించి కొన్ని స్థానాల్లో తక్కువ ఓట్ల సంఖ్య ఉండడం వంటివి పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాల్లో సమానంగా లేదు. ఉదాహరణకు కేరళలోని మొత్తం 20 స్థానాల్లో ఓటింగ్‌ శాతం తగ్గింది. వాటిల్లో 12 స్థానాల్లో 2019 కంటే తక్కువ ఓట్లు ఇవిఎంలలో నమోదయ్యాయి. అలాగే ఉత్తరాఖండ్‌లో కూడా మొత్తం ఐదు స్థానాల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైంది. ఇక ఈ రాష్ట్రంలో కనీసం ఆరు స్థానాల్లో మూడింటిలో తక్కువమంది ఓటు వేశారు. అలాగే రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో దాదాపు సగం స్థానాల్లో…

Read More

వికసిత్‌ భారత్‌ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండియా టీవీ సలాం ఇండియా షోలో ఆయన మాట్లాడారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని చెప్పారు.  ఈ భూమ్మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవన్నారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న మోదీ ఈ వ్యాఖ్యల ద్వారా మరో రెండు దశాబ్దాలు దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 400 సీట్ల నినాదం బీజేపీది కాదని, జనం నుంచి వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో ఇతర పార్టీల నుంచి వచ్చిన మద్దతును గమనిస్తే తాము 400 బలాన్ని…

Read More

పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్‌ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ని ఆదేశించింది. ఆయన వెంట నలుగురు వ్యక్తులకు మించి ఉండకూడదని తేల్చిచెప్పింది. ఆయన దర్యాప్తునకు ఆటంకం కలిగించడం గానీ, సాక్షులను బెదిరించడం గానీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మధ్యంతర ముందస్తు బెయిల్‌ సమయంలో ఎలాంటి నేర ఘటనలకు పాల్పడడానికి వీల్లేదని ఆదేశించింది. విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి ఆదేశాలిచ్చారు. ఈ నెల 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పాల్వాయ్‌…

Read More

లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో సుదీర్ఘ లేఖ పోస్టు చేశారు. “ప్రజ్వల్‌ రేవణ్ణ గురించి మే 18న ఓ ఆలయానికి వెళ్తూ మీడియాతో మాట్లాడాను. ఆయన నాకు, నా కుటుంబం, పార్టీ, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ. ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. కేసులో ఆయన దోషిగా తేలితే కఠిన శిక్ష పడాల్సిందే. నా కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నారు. ప్రజ్వల్‌, ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో. నా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నా విజ్ఞప్తి కాదు, హెచ్చరిక. లేదంటే నాతో పాటు కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురవుతావ్‌’ అని లేఖలో దేవెగౌడ పేర్కొన్నారు.…

Read More

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. వారి అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలతో లేఖను రాష్ట్ర డీజీపీకి పంపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలోరోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్‌గా స్పందించింది. బాధ్యులపలై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఘాటైన లేఖ పంపింది కేంద్రం. బందరు రోడ్దులో మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజ్‌సర్కిల్‌ వరకూ సాగిన ఈ రోడ్డుషో సాయంత్రం 6.15కు మొదలైంది. అంతకు 45 నిముషాల ముందు రోడ్‌ షో ప్రారంభమయ్యే ప్రాంతంలో ఒకటి, ముగించే దగ్గర మరొకటి గాల్లో ఎగురుతున్న డ్రోన్లను ప్రధాని రక్షణ బాధ్యతలు పర్యవేక్షించే నేషనల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎన్‌ఎ్‌సజీ) గమనించి వాటిని కిందికి దించేసింది. ప్రధాని పర్యటించే ప్రాంతంలో కనీసం 2కిలోమీటర్ల దూరంలో ఎలాంటి డ్రోన్లు ఎగరకుండా నిషేధం…

Read More