హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ధృవీకరించింది. అధ్యక్షుడితో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా ఈ ఘటనలో చనిపోయారు. ఓ ఆనకట్ట ప్రారంభానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ అదుపు తప్పి, తూర్పు అజర్‌బైజాన్ సరిహద్దుల్లోని జోల్ఫా ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ మొత్తం కాలిపోవడంతో.. అందులో ఉన్న వ్యక్తులందరూ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అక్కడ ఇతర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం అజర్‌బైజాన్ సమీపంలో ఇరుదేశాలు సంయుక్తంగా నిర్మించిన ఓ ఆనకట్ట ప్రారంభోత్సవానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని అధ్యక్షుడు హెలికాప్టర్‌లో తబ్రిజ్ నగరానికి తిరుగు పయనమయ్యారు. అయితే.. భారీ పొగమంచు మధ్య పర్వతప్రాంతాలను దాటుతున్న సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పి, జోల్ఫా ప్రాంతంలో నేలను బలంగా తాకింది. దీంతో.. హెలికాప్టర్‌లో మంటలు…
Author: Editor's Desk, Tattva News
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు కీలక నాయకులు ఈ విడతలో పోటీ పడుతున్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్‌లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతుంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న అమేథీ, రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్న లక్నో స్థానాలు ఉన్నాయి. కేంద్ర…
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తీరును ఎండగట్టారు. రాయబరేలిని ‘వదలివేసిన’ సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఆ లోక్‌సభ సీటుకు నామినేట్ చేయడాన్ని ప్రధాని ఆక్షేపించారు. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘ప్రచారం కోసం రాయబరేలికి (సోనియా గాంధీ) వెళ్లి, తన కుమారునివారికి అప్పగిస్తున్నానని ధ్వజమెత్తారు. దీర్ఘ కాలం రాయబరేలిలో పని చేసిన పార్టీ కార్యకర్త ఒక్కరూ వారికి కనిపించలేదా?’ అని ప్రశ్నించారు. ‘కతోనా తరువాత ఆమె (సోనియా గాంధీ) ఒక్కసారి కూడా తన నియోజకవర్గాన్ని సందర్శించలేదు. ఇప్పుడు ఆమె తన తనయుని కోసం వోట్లు అడుగుతున్నారు. ఆ సీటును తమ కుటుంబ ఆస్తిగా వారు భావిస్తున్నారు’ అని మోదీ విమర్శించారు. సోనియా గాంధీ తన పిల్లలు రాహుల్, ప్రియాంక వెంట ఉండగా తన పూర్వపు నియోజకవర్గం రాయబరేలిలో ఒక ఎన్నికల ర్యాలీలో శనివారం ప్రసంగించారు. తన…
సోమవారం నుంచి పార్లమెంట్ భద్రత బాధ్యతలను కేంద్రీయ పారిశ్రామిక భద్రతా బలగాలు (సిఐఎస్‌ఎఫ్) చేపడుతాయి. దేశ ప్రజాస్వామ్య సౌధం భద్రతను ఇప్పటివరకూ పర్యవేక్షిస్తున్న 1400 మంది జవాన్లతో కూడిన సిఆర్‌పిఎఫ్‌ను ఈ విధుల నుంచి తప్పించారు. ఈ బలగాల స్థానంలో ఇప్పుడు 3300 మందితో కూడిన సిఐఎస్‌ఎఫ్ దళాలను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. నూతన పార్లమెంట్ ఆవరణ భద్రతా పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న సిఆర్‌పిఎఫ్‌కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (పిడిజి) శుక్రవారమే ఈ ప్రాంతం నుంచి తమ పర్యవేక్షక బాధ్యతల నుంచి వైదొలిగింది. ఈ బలగాలకు చెందిన కార్యనిర్వాహక వ్యవస్థ అనుబంధం అయిన వాహనాలు, ఆయుధాలు , కమెండోలు తమ కార్యకలాపాలను ముగించాయి. ఈ బలగాల సారధ్య బాధ్యతల్లో ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి ఒకరు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని సెక్యూరిటీ పాయింట్స్‌ను లాంఛనంగా సిఐఎస్‌ఎఫ్ బృందానికి అప్పగించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో…
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ‘హార్డ్ ల్యాండింగ్’కు గురైంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిసింది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తున్నది. ఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్‌టీవీ పేర్కొంది. రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. అజర్‌బైజాన్‌ను సందర్శిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని, హెలికాప్టర్‌లో అధ్యక్షుడితో సహా ఆయన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడు హెలికాప్టర్ల కాన్వాయ్‌లో రెండు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్ సైట్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటంకం ఏర్పడినట్లు సమాచారం.…
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి కంగనా రనౌత్ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో ఎంపీగా తెలిస్తే సినిమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి.. ‘ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే మీరు సినిమాలకు దూరంగా ఉంటారా..?’ అని ప్రశ్నించారు. అందుకు అవుననే సమాధానం ఇచ్చారు. ‘బాలీవుడ్‌లో నేను విజయం సాధించా. నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నా. ఒక ఉత్తమ ఎంపీగా ప్రజలకు నావంతు సేవ చేసేందుకు కృషి చేస్తా. అదే నాకు గొప్ప అవార్డుగా భావిస్తా’ అని కంగనా చెప్పారు. అయితే ఎంపీగా గెలిచినా సినీ ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్మాతల నుంచి తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని ఆమె తెలిపారు. ‘మీరొక ప్రతిభావంతమైన నటి. సినిమాలకు దూరంగా ఉండొద్దు’ అని చాలా మంది నిర్మాతలు, ప్రముఖ నటులు కోరుతున్నట్లు కంగనా రనౌత్ చెప్పారు. అంతకుముందు మరో…
ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ప్రశ్నించిన వారందరినీ జైల్లో పెడుతున్నారని, తమ పార్టీని అంతం చేసేందుకే పార్టీ నేతలపై వరసగా అక్రమ కేసులు పెడుతూ జైల్లోకి నెడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీకి ఆప్ భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ ఝాడును ప్రారంభించిందని ఆరోపించారు. ఆప్ నేతల ఆరెస్టులకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు ముందు తమ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు144 సెక్షన్ అమలు చేశారు. క్రేజివాల్ పిఎ భిభవ్ కుమార్ అరెస్ట్ కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడికి బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు డీడీయూ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐటిఒ మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా…
నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకినట్లు భారత వాతావరణ శాఖప్రకటించింది. రుతుపవనాలు ప్రస్తుతానికి మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని పేర్కొంది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోనూ సమయానుకూలంగా పురోగమించాయని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 19న భారత భూభాగాన్ని తాకాయి. ఈ ఏడాది ప్రీ మాన్‌సూన్ సీజన్‌లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది ప్రకటించింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. రుతుపవనాల సీజన్‌లో భారత్‌లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మే 22 వరకు అండమాన్ అండ్ నికోబార్ దీవులకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1…
చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సైనిక సహకార కూటమి క్వాడ్ పేరును స్క్వాడ్‌గా అమెరికా మార్పు చేసి తిరిగి ప్రారంభించింది. అయితే, చైనాను కట్టడి చేయాలన్న దాని లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆస్ట్రేలియా, జపాన్, ఫిలీప్పీన్స్, అమెరికా ఈ నాలుగు దేశాలు కొత్త కూటమి స్వ్వాడ్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. ఇవి గత నెల ప్రారంభంలో దక్షిణ చైనా సముద్రంలో సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. ఆస్ట్రేలియాకు చెందిన వారముంగా, జపాన్‌కు చెందిన అకెబోనో, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆంటోనియో లూనా, అమెరికాకు చెందిన మొబైల్ కంపెనీల నౌకలు కలసికట్టుగా పని చేస్తూ ఈ సముద్ర జలాల్లో తమ ఉమ్మడి నావికా సామర్ధ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్నయించినట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. దక్షిణ చైనా సముద్ర దీవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే హక్కును అంతర్జాతీయ చట్టం తమకు కల్పించిందని స్క్వాడ్ కూటమి పేర్కొంది. కొన్ని వారాల తరువాత అంటే ఏప్రిల్ 22, మే 8…
లోక్‌సభ ఎన్నికలతో కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో శనివారం తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ ఈరోజు రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఎన్నికల కమిషన్ అనుమతి రానందున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు.ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు. కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరుగలేదు. సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన…