Author: Editor's Desk, Tattva News

ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పుతిన్ గురువారం నుంచి రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనాకు చెందిన ఓ వార్తా సంస్థతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. “యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర సుస్థిర పరిష్కారాన్ని మేం కోరుకుంటున్నాం. ఉక్రెయిన్ విషయంపై సంప్రదింపులకు మేం సిద్దం. కానీ ఆ చర్చల్లో … మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణన లోకి తీసుకోవాలి ” అని పుతిన్ పేర్కొన్నారు. తమ దేశ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం , రష్యా బలగాల ఉపసంహరణ, ఖైదీల విడుదల, ఘర్షణకు బాధ్యులెవరో తేల్చేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు వంటి అంశాలు రష్యాతో యుద్ధంపై చర్చల ఎజెండాలో ఉండాలని…

Read More

మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ ప్రక్రియకు సంబంధించి సుప్రీం కోర్టు గురువారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తరువాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ సదరు నిందితుడిని కస్టడీ లోకి తీసుకోవాలంటే దర్యాప్తు సంస్థ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. “ పీఎంఎల్‌ఎ చట్టం సెక్షన్ 44 కింద దాఖలైన మనీలాండరింగ్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే కనుక, ఆ కేసుల్లో నిందితుడిగా చూపించిన వ్యక్తిని సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉండదు” అని స్పష్టం చేసింది. “ఈ కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరైతే దాన్ని కస్టడీలో ఉన్నట్టుగా పరిగణించకూడదు. ఒకవేళ తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని ఈడీ కస్టడీకి తీసుకోవాలనుకుంటే అప్పుడు…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీస్‌ గుప్తా గురువారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం  అధికారులను కలిసి వివరించారు. ఈనెల 13న జరిగిన ఎన్నికల రోజు, మరుసటి రోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.  దీనిపై గురువారం మధ్యాహ్నం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరిని ఆదేశించడంతో సీఎస్‌, డీజీపీ ఢిల్లీకి బయలు దేరి సీఈసీని కలిశారు. పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు ఎందుకు జరిగాయని, పోలీసుల నిఘా సంస్థ ఎందుకు గట్టి చర్యలు తీసుకోలేకపోయిందని ప్రశ్నించారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమారవిశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం…

Read More

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.  కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్‌లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. ‘‘అక్రమ ఇసుక తవ్వకాలను నిషేదించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలి. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటాం. కమిటీలోని అధికారులు…

Read More

ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అరెస్టయిన ‘న్యూస్‌క్లిక్‌’ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు, రచయిత ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆయనను వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని బుధవారం ఆదేశించింది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రబీర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేసింది. ప్రబీర్‌ పుర్కాయస్థకు బెయిల్‌ మంజూరు చేయడంతో బుధవారం రాత్రి జైలు నుండి విడుదలయ్యారు. 2023 ఆగస్టులో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన ఓ కధనం ఆధారంగా అదే సంవత్సరం అక్టోబరు3న ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. భారత దేశాన్ని దెబ్బ తీసేందుకు విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారని ప్రబీర్‌పైన, న్యూస్‌క్లిక్‌పైన వారు అభియోగాలు మోపారు. న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడి అరెస్టు విషయంలో ఢిల్లీ పోలీసులు కనీస…

Read More

ప్రధాని  నరేంద్ర మోదీ  రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చొరబాటుదారులు.. అధిక సంఖ్యలో పిల్లల్ని కంటారు అని చేసిన వాఖ్యలు ముస్లింల గురించే అన్నారని అంటూ రాజకీయ దుమారం రేగింది. ఈ  వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎఐఎంఐఎం చీఫ్‌ అధ్యక్షులు అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు తీవ్రంగా ఖండించారు.  తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ న్యూస్‌ 18 టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో  వివరణ ఇచ్చారు. తాను కేవలం ముస్లింల గురించి మాత్రమే మాట్లాడలేదని, ప్రతి పేద కుటుంబం గురించి మాట్లాడానని స్పష్టం చేశారు. హిందూ- ముస్లిం అంటూ రోజును ప్రారంభించినరోజు ప్రజాజీవితానికి అనర్హుడవుతాడు అని ఆయన చెప్పారు. ముస్లింల పట్ల ప్రేమను తాను మార్కెట్‌ చేసుకోనని ఎద్దేవా చేశారు. తాను ఓటు బ్యాంక్‌ కోసం పనిచేయనని, కేవలం సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌నే నమ్ముతానని మోదీ  తెలిపారు. ‘నేను ఆశ్చర్యపోయాను. ఎక్కువ మంది పిల్లలు…

Read More

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు దరిమిలా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని మామూలు తీర్పుగా తాను చూడడం లేదని చెప్పారు. కేజ్రీవాల్‌కు ‘ప్రత్యేక ట్రీట్‌మెంట్’ లభించిందని దేశంలో పలువురు భావిస్తున్నారని అమిత్ షా నొక్కిచెప్పారు. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు అనుకూలంగా తగినన్ని వోట్లు పడినట్లయితే తాను తిరిగి జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండదన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యపై అమిత్ షాను బుధవారం ‘ఎఎన్‌ఐ’ ఇంటర్వూలో ప్రశ్నించారు. ‘ఇది స్పష్టంగా సుప్రీం కోర్టును ధిక్కరించడమేనని నేను భావిస్తున్నాను. ఎవరైనా గెలిస్తే వారు దోషులైనా సరే వారిని జైలుకు సుప్రీంకోర్టు పంపదని ఆయన చెప్పజూస్తున్నారు’ అంటూ విమర్శించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తులు తమ తీర్పును ఎలా వాడుకుంటున్నారో లేక దుర్వినియోగం చేస్తున్నారో ఆలోచించవలసి ఉంటుందని …

Read More

సీఏఏ చట్టం అమలులోకి తీసుకుచ్చిన అనంతరం తొలిసారిగా కేంద్రం పలువురికి పౌరసత్వ ధ్రువీకరపత్రాలను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద బుధవారం తొలిసారిగా ఢిల్లీలోని 14 మంది శరణార్థులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అందజేశారు.  దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 31వేల మంది ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఓ వైపు పార్లమెంట్‌ ఎన్నికల్లో సీఏఏ అంశంపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతుండడం విశేషం. సీఏఏని వ్యతిరేకిస్తున్న పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలుగా బీజేపీ విమర్శిస్తున్నది. ముస్లిం సమాజాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ఈ ఏడాది మార్చి 11 నుంచి దేశంలో అమల్లోకి వచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లు 2019 పార్లమెంట్ ఆమోదించిన అనంతరం ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం…

Read More

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో చెలరేగిన హింసపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హింస చెలరేగింది. పోలింగ్ పూర్తి కాకముందే పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల,తాడిపత్రి,చంద్రగిరి,నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.  దీంతో  సీఈవో ముకేష్ కుమార్ మీనా హింసకు కారణమవుతున్న నేతల హౌస్ అరెస్టులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు…

Read More

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌తో కలిపి మొత్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు విడతల్లో ఒక రాష్ట్ర్లంలో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదేనని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని వివరించారు. సుమారుగా 3500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఆరుదాటిన తర్వాత కూడా ఓటింగ్ కొనసాగినట్లు ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే అర్ధరాత్రి రెండుగంటల వరకూ పోలింగ్ జరిగిందని వెల్లడించారు.  పోలింగ్ అనంతరం ఈవీఎం మెషీన్లను 350 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచామని చెప్పారు. ఇక పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మీనా తెలిపారు. కొన్నిచోట్ల…

Read More