దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయని, ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ నాటికి సాధారణంగా కేరళను తాకే అవకాశాలున్నాయని చెప్పింది. జులై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని చెప్పింది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే ముందగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గతవారం ఐఎండీ జూన్ ఒకటి లేదంటే ముందుగా మే 27న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. రుతుపవనాలు అండమాన్ మీదుగా కేరళను తాకుతూ వర్షాలను కురిపిస్తూ ముందుకు సాగుతాయని పేర్కొంది. వాస్తవానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సీజన్ కొనసాగుతుంది. గతేడాది జూన్ రెండోవారంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళను తాకాయి. ఈ ఏడాది జూన్ ఒకటి నాటికే అంటే సాధారణ సమయానికే…
Author: Editor's Desk, Tattva News
పతంజలి కంపెనీకి సంబంధించిన తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చింది. అఫిడవిట్ దాఖలు చేసేందుకు సైతం సమయం ఇచ్చింది. అఫిడవిట్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెనక్కి తీసుకోవడానికి పతంజలి ఎలాంటి చర్యలు తీసుకున్నది, ఉత్పత్తుల స్టాక్స్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ మెడికల్ అసోసియేసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరుపుతున్నది. కోవిడ్ వ్యాక్సినేషన్, అల్లోపతికి వ్యతిరేకంగా పతంజలి ప్రచారం చేసిందని ఐఎంఏ ఆరోపించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పంతజలిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆరోపించిన తప్పుదోవ పట్టించే ప్రకటనలను పతంజలి ప్రింట్ మీడియాలో ప్రచురించింది. జనవరి 3, 2024న జరిగిన విచారణలో పతంజలిపై ధిక్కార చర్య తీసుకున్నందుకు బాబా రామ్‌దేవ్,…
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు రూ. 3 కోట్ల 2 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో మోదీ పేర్కొన్నారు. రూ. 52,920 నగదు తన వద్ద ఉన్నట్లు పత్రాల్లో మోదీ వెల్లడించారు. సొంత భూమి, ఇల్లు, కారు తనకు లేవని స్పష్టం చేశారు. మోదీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11 లక్షలు ఉండగా, అది 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 23.5 లక్షలు అయ్యింది. ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఖాతాలు ఉన్నాయి. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్ ఖాతాలో 73వేల 304 రూపాయల డిపాజిట్ ఉండగా, వారణాసి బ్రాంచ్‌లో ఏడు వేలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎస్‌బీఐలో మోదీ పేరిట రూ. 2,85,60,338 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రధానికి ఎలాంటి భూములు…
డిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో తీహార్ జైలులో ఉన్న కవితను వీడియో కాన్ఫరెన్స్ హాజరుపర్చారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో ఈ నెల 20వ తేదీ వరకు కవిత కస్టడీనీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది. ఈ కేసులో 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్ ను ఈడీ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం విధానంకు సంబంధించి ఇటీవల ఈడీ అనుబంధ ఛార్జీషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. కవిత పాత్రపై మరికొన్ని అంశాలను ఇందులో పేర్కొంది. ఈ కేసులో…
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితురాలిని చేయనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఒక కేసులో ఒక రాజకీయ పార్టీని నిందితురాలిగా చేర్చడం ఇదే మొదటి సారి కాగలదు. కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు, పార్టీని కూడా నిందితురాలిగా చేర్చనున్నట్లు దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సిసోడియా బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ ఇడి కోర్టుకు ఆ విషయం తెలిపింది. కేసులో అభియోగాల నమోదు ప్రక్రియను జాప్యం చేసేందుకు నిందితులు సంఘటిత యత్నాలు చేస్తున్నారని ఇడి న్యాయవాది ఆరోపించారు. సిసోడియాకు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాది మనీలాండరింగ్, అవినీతి కేసులో ఇడి, సిబిఐ ఇంకా అరెస్టులు జరుపుతూనే ఉన్నాయని, విచారణ త్వరగా ముగిసే అవకాశం లేదని కోర్టుకు…
2024 లోక్‌సభ ఎన్నికల కోసం వారణాసి నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్డీఏ కూటమి నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల కోలాహలం మధ్య.. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్‌ని దాఖలు చేసేందుకు సోమవారం సాయంత్రం వారణాసి వెళ్లిన ఆయన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీ నామినేషన్ కోసం వారణాసిలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఎటు చూసినా కాషాయ రంగే కనిపిస్తోంది. ఫ్లేక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఇక మోదీని చూసేందుకు ప్రజలు భారీ లైన్లలో నిలబడ్డారు. మంగళవారం ఉదయం వారణాసిలో ఘాట్‌కి వెళ్లి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కాలభైరవుడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి…
గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్ ఐఎస్యూలో నెల రోజులుగా చికిత్స పొందుతూ.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 72ఏళ్ల సుశీల్ కుమార్ మోదీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్‌లో బిజెపి ఎదుగుదలకు మూడు దశాబ్దాల పాటు ఎనలేని సేవ చేశారు. ఆయన లేని లోటును భర్తీ చేయడం చాలా కష్టమని బీజేపీ శ్రేణులు అంటున్నారు. పాట్నా యూనివర్సిటీ నుంచి సుశీల్ మోదీ రాజకీయ వృత్తి మొదలైంది. 1973లో పట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌కి జనరల్ సెక్రటరీ అయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ సమయంలో యూనియన్‌కి అధ్యక్షుడిగా ఉండేవారు. అనంతర కాలంలో లాలూ సుశీల్ మోదీకి అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థి అయ్యారు. 1990 లో పాట్నా సెంట్రల్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు సుశీల్ కుమార్ మోదీ.…
సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో ఈ మేరకు పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈసీ వెల్లడించిన వివరాలను బట్టి.. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 76.5 శాతంగా, తెలంగాణలో 64.74 శాతంగా ఉంది. ఏపీ (25), తెలంగాణ(17)లోని మొత్తం ఎంపీ స్థానాలతో పాటు యూపీ (13), మహారాష్ట్ర (11), పశ్చిమబెంగాల్ (8), మధ్యప్రదేశ్ (8), బిహార్ (5), ఝార్ఖండ్ (4), ఒడిశా (4), జమ్ముకశ్మీర్ (1)లోని పార్లమెంటు స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ఈ 96 స్థానాల్లో.. ఈవీఎంల మొరాయింపు, ఏజెంట్ల అడ్డగింత వంటి 1700 ఫిర్యాదులు నమోదయ్యాయి.…
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కొత్త శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఈ ఎన్నికల్లో బిజెపి రెండంకెల స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపికి ఆదరణ పెరిగిందని, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని, ముఖ్యంగా యువత, మహిళలు బిజెపికి ఓటు వేశారని తెలిపారు. పట్టణం, నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువ అయినప్పటికీ బిజెపికి ఎక్కువగా ఓట్లు వేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పక్షం ఎంత రెచ్చగొట్టినా బిజెపి నాయకులు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి మంత్రులు, నాయకుల వరకు బిజెపి పట్ల ద్వేషంతో మాట్లాడినా తమ నాయకులు గొడవలకు దిగలేదని చెప్పారు. తమ పార్టీపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు గ్లోబెల్ ప్రచారం చేసినా ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు.…
ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పోలింగ్ ట్రెండ్ ప్రకారం 80 శాతం ఓటింగ్ దాటేలా కనిపిస్తోంది. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 75.9 శాతం, 2014 ఏపీ ఎన్నికల్లో 78.4 శాతం, 2019 శాసనసభ ఎన్నికల్లో 79.6 శాతం మేర పోలింగ్ నమోదైంది. 2024లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే 67.99 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఈసారి పోలింగ్ 80 శాతం దాటేలా కనిపిస్తోంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఉదయం ఏడు గంటలకు…