దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో సోమవారం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దుమ్ము దుమారం, భారీ వర్షంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. చిమ్మ చీకట్లు కమ్మేశాయి. గాలి దుమారం చెలరేగి ఈదురుగాలులకు ఘట్‌కోపర్‌లో 100 అడుగుల ఎత్తైన బిల్‌బోర్డ్ కుప్పకూలింది. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ముంబయిలో కురిసిన మొదటి వర్షం ఇదే. ఘట్‌కోపర్, బాంద్రా-కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముంబయి విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు గంటల పాటు విమానాలు నిలిచిపోయాయి. సాయంత్రం 5.30 గంటల తర్వాత విమాన సర్వీసులు ప్రారంభించింది. 13 విమానాలను దారి మళ్లించింది. గతవారమే ప్రీ-మాన్సూన్ రన్‌వే నిర్వహణ పనులను ముంబయి ఎయిర్‌పోర్ట్ విజయవంతంగా పూర్తిచేసింది. ఘట్‌కోవర్ చెద్దానగర్…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు మునిగిపోవడమే కాకుండా కీలక నేతలు జైలుకు వెళ్లడంతో కుదేలైన ఆమ్ ఆద్మీ పార్టీకి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. సొంత పార్టీపైనే.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్.. తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్ ఆరోపించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నివాసంలో.. సీఎం సహాయకుడు సొంత పార్టీ ఎంపీపై దాడి చేసినట్లు ఆరోపణలు రావడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం ఇంటి నుంచి ఉదయం 10 గంటలకు ఎంపీ స్వాతి మలివాల్.. పోలీసులకు ఫోన్ చేశారని.. కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ.. బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని చెప్పినట్లు ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. అయితే ఈ…
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కె మాధవిలతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలింగ్ స్టేషన్‌లోకి చొరబడి కొంతమంది ముస్లిం మహిళా ఓటర్లను బురఖా తొలగించి వారి గుర్తింపును వెల్లడించమని కోరడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్‌పేట పోలీసులు మాధవి లతపై సెక్షన్ 171 సి, 186 కింద కేసు నమోదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132తో పాటు, ఐపీసీ 505 (1)(సి) విధులను నిర్వర్తించకుండా ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం సెక్షన్ కింద ఆమెపై కేసు నమోదైంది. అంతకుముందు బీజేపీ అభ్యర్థి మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని అజంపురాలోని పోలింగ్ స్టేషన్ ను సందర్శించి ముస్లిం మహిళా ఓటర్లను గురించి ఆరా తీయడం ప్రారంభించారని తెలుస్తోంది. మహిళా ఓటర్లు తమ గుర్తింపును వెల్లడించేందుకు…
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్ లో చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై ఈసీ స్పందించింది. అన్నాబత్తుని శివకుమార్‌పై వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనను హౌస్ అరెస్టులో ఉంచాలని పేర్కొంది. ఓటేసేందుకు స్ధానిక పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ తనలాగే ఓటేసేందుకు వచ్చిన ఓటర్ పై చేయి చేసుకోవడం, అతను తిరిగి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడం, దీంతో ఎమ్మెల్యే అనుచరులు అతన్ని చితకబాదడం జరిగిపోయాయి. ఇది జాతీయ స్ధాయిలో చర్చకు దారి తీసింది. తెనాలిలో క్యూలో నిలబడకుండా నేరుగా ఓటేసేందుకు ప్రయత్నించిన తనను అడ్డుకున్న ఓటర్ పై చెంపదెబ్బ కొట్టడం, తిరిగి అతను కొట్టాక తన అనుచరులతో దాడి చేయించిన వ్యవహారంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నాబత్తుని శివకుమార్‌పై వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ పోలీసులను…
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని వెల్లడించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా ఉండవల్లిలోని పోలింగ్…
ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ రానంత తక్కువ సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయస్సును గుర్తు చేస్తూ.. ‘‘రాహుల్‌కు యాభై ఏళ్లు దాటాయి. కానీ, కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు కూడా రావు’’ అని తేల్చి చెప్పారు. అవినీతి అనేది ఇండియా కూటమిలోని ఉమ్మడి తత్వం అని, అదే ఆ పార్టీలను కలిపిందని మోదీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం అవినీతిని పూర్తిస్థాయి బిజినె్‌సగా మార్చిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ను ఆ పార్టీ ‘కుటీర బాంబుల పరిశ్రమ’గా మార్చివేసిందని మండిపడ్డారు. ‘‘ప్రతి ఇంటికి మంచి నీళ్లు అని మేం అంటుంటే.. ప్రతి ఇంటిలో బాంబు అని వాళ్లు మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం బెంగాల్‌లోని హౌరా, బారక్‌పూర్, హుగ్లీలో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. అక్రమ వలసదారుల సంక్షేమమే…
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో అక్కడ పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువులను కొనలేక అక్కడి ప్రజలు శనివారం ఆందోళనచేయగా వారిపై పోలీసులు కర్కశంగా విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు తీరును నిరసిస్తూ పీఓకే ప్రజలు మరోసారి ఆందోళన చేపట్టారు. వేలాదిగా ముజఫరాబాద్ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. అయితే పోలీసులు, ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో ఓ పోలీసు అధికారి మృతి చెందిన, దాదాపు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. అవామీ యాక్షన్ కమిటీ పేరుతో ఆందోళనకు దిగిన ప్రజలు మంగ్లా డ్యామ్ నుంచి ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని కోరారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కమిటీలో కీలక సభ్యుడైన షౌకత్ నవాజ్ మిర్ పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. అధిక ధరల నుంచి ఉపశమనం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం అధిక…
త్రినయిని సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి బి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో బుల్లితెర నటి పవిత్ర జయరాం (42) చనిపోయారు. కర్నాటకలోని తన సొంతూరు వెళ్లి హైదరాబాద్‌కు వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సును ఢీకొట్టడంతో ఆదివారం తెల్లవారుజామున ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. త్రినయని అనే సీరియల్‌లో ఆమె మహిళా విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆమె డ్రైవర్ శ్రీకాంత్, బంధువు ఆపేక్ష, తోటి నటుడు చంద్రకాంత్ కూడా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కర్ణాటకకు చెందిన పవిత్ర జయరామ్‌కు ఒక కూతురు, ఒక కొడుకు…
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మోదీ గ్యారంటీలకు కౌంటర్‌గా కేజ్రీవాల్ గ్యారంటీలు ప్రకటించింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చైనా ఆక్రమణలో భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం సహా 10 గ్యారంటీలను అమలు చేయనున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి దిల్లీలో మీడియా సమావేశం నిర్వహంచిన కేజ్రీవాల్ మోదీ గ్యారంటీలు కావాలా? లేక కేజ్రీవాల్ గ్యారంటీలు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. అయితే తాము ప్రకటించిన గ్యారంటీలపై భాగస్వామ్య పక్షాలతో చర్చించలేదన్న కేజ్రీవాల్, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుచేసేందుకు ఒత్తిడి చేయనున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటు వంటి గ్యారంటీలను ఢిల్లీలో అమలు చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యంతోపాటు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేజ్రీవాల్…
ప్రధాని నరేంద్ర మోదీతో పబ్లిక్ డిబేట్‌లో పాల్గనాల్సిందిగా ఇరువురు జ్యూరిస్ట్‌లు, సీనియర్ ఎడిటర్ పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమోదించారు. మోదీతో చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ జస్టిస్ మదన్ బి లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్ పి షా, హిందూ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ రామ్ ఈ నెల 9న రాహుల్‌ను, మోడీని బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆహ్వానించారు. పక్షపాత రహితమైన, వాణిజ్యయేతర వేదికపైన ఈ చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనకు ఆమోదిస్తూ రాహుల్ ఒక లేఖ రాశారు. ఆ కాపీని శనివారం విడుదల చేశారు. తాను గానీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గానీ చర్చకు హాజరవుతామని తెలిపారు. ఆహ్వానంపై స్పందించడానికి ముందు తాను ఖర్గేతో చర్చించానని తెలిపారు. ప్రధాన పార్టీలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు ఆ నేతలు చెప్పేది ప్రత్యక్షంగా ప్రజలు…