Author: Editor's Desk, Tattva News

పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, హిందుత్వం గురించి, రాముడి గురించి మాట్లాడనని, కాషాయ జెండా ముట్టుకోనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ కరీంనగర్ ఎంపి అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఓడించడానికి ముస్లింలు ఏకం కావాలని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్ అంటున్నారని ఆరోపించారు. అయితే, తాను ఆయనకు సవాల్ విసురుతున్నానని.. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒకవేళ గెలిస్తే కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా, మతం మారుతారా.. అందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ‘కెసిఆర్ ఈ మధ్య చిలుక జోష్యం చెప్పడం నేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. తనను ఓడించేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఏకమై డబ్బులు పంచుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల తరఫున కరీంనగర్ ఎంపి అభ్యర్థులుగా నిలబడినవారు నాన్ లోకల్ అని,…

Read More

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన, ఒక రోజు ముందే జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మాటల దాడిని ప్రారంభించారు. 75 సంవత్సరాలు నిండిన నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి పంపించే సంప్రదాయం బీజేపీలో ఉందని, అదే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కూడా పాటిస్టారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. వచ్చే సంవత్సరం మోదీకి 75 ఏళ్లు నిండిన తరువాత ఆయన పదవి నుండి వైదొలుగుతారని, ఆయన స్థానంలో హోంమంత్రి అమిత్ షా ప్రధాని అవుతారని అంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వాఖ్యాలను కొద్దిసేపటికే అమిత్ షా కొట్టిపారేసారు. ప్రధాని మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల కేజ్రీవాల్ సంతోషించడానికి ఏమీ లేదని అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మోదీజీ 75వ ఏట అడుగుపెట్టినందుకు మీరు సంతోషించాల్సిన అవసరం లేదని అరవింద్ కేజ్రీవాల్…

Read More

ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. తన కూతురు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇందుకు సంబంధించిన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘వైఎస్సార్ ను అభిమానించే వారికి, ప్రేమించేవారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్ కూతురు షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తోంది. కడప ప్రజలకు సేవ చేసే అవకాశం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కల్పించినట్టే నా బిడ్డకు కూడా కల్పించండి అని నేను విన్నవించుకుంటున్నాను. ఆమెను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కడప ప్రజలను ప్రార్థిస్తున్నాను’ అని ఆ వీడియోలో విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ కుటుంబానికి కడప లోక్ సభ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. అయితే, తొలిసారిగా కడప లోక్ సభ నియోజకవర్గంలో ఇద్దరు కుటంబ సభ్యుల మధ్య ఎన్నికల పోటీ హోరాహోరీగా…

Read More

జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కు ప్రతిపక్షానికి కావలసినంత సంఖ్యా బలం కూడా ఉండకుండా 50 స్థానాల కంటే తక్కువ బలమే ఉండగలదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని కంధమల్ లోక్ సభ నియోజకవర్గంలో నిర్వహించన ర్యాలీలో ఆయన నేడు ప్రసంగించారు. ఎన్డిఏ 400కు పైగా సీట్లను గెలువబోతోందని, బిజెపి ఇదివరకటి తన రికార్డులను కూడా అధిగమించగలదని తెలిపారు. ‘‘నా మాటను రికార్ఢుగా ఉంచుకోండి’’ అని ప్రధాని చెప్పారు. ‘‘షెహజాదా రాహుల్ గాంధీ ప్రతి రోజు ఏదో ఓ ప్రకటన చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షానికి కావలసినంత సంఖ్యా బలం కూడా కాంగ్రెస్ కు ఇవ్వకూడదని దేశం నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ కు 50 కంటే తక్కువ సీట్లే వస్తాయి. అది మీరు జూన్ 4న చూస్తారు’’ అని మోదీ వెల్లడించారు. కాన్పూర్ ర్యాలీలో రాహుల్ గాంధీ ‘‘జూన్ 4 తర్వాత మోదీ ప్రధానిగా ఉండబోరు’’ అన్న మరునాడే మోదీ ఈ …

Read More

తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. జూన్‌ 4 తర్వాత భారత విరోధులు పారిపోక తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బీజపీని గెలిపించాలని 140 కోట్ల మంది ప్రజలు సంకల్పం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలుడు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడికెళ్లాలన్న భయపడాల్సిన పరిస్థితి ఉండేదని.. గత పదేళ్ల కాలంలో అలాంటి పరిస్థితిని చూశారా? అని మోదీ ప్రశ్నించారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని,…

Read More

సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలోనే ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బిజిఎల్), 12-బోర్ రైఫిల్ మరియు మజిల్-లోడింగ్ రైఫిల్స్‌తో సహా 12 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం… ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్), బస్తారియా బెటాలియన్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) లతో పాటు రాష్ట్ర పోలీసుల ఉమ్మడి బృందం పాల్గొంది. గురువారం…

Read More

పోలింగ్ ముందు వివిధ పధకాల లబ్ధిదారులకు వేలకోట్ల రూపాయల నగదు బదిలీ చేయరాదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించిన ఎన్నికల కమిషన్ ఆదేశాలపై ఏపీ హైకోర్టు ఓ రోజు పాటు స్టే విధించినా ప్రయోజనం లేకపోయింది. ఆ విధంగా చేయడానికి వీల్లేదని ఈసీ మరోసారి స్పష్టం చేయడంతో శుక్రవారం నగదు బదిలీకి ప్రయత్నించిన ప్రభుత్వానికి చుక్కెదురైనది. హైకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నించిన ఈసీపై డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసిన్నప్పటికీ అప్పటికే స్టే గడువు పూర్తి కావడంతో ఏమీ చేయలేకపోయింది. దానితో పోలింగ్ తర్వాతనే నగదు బదిలీ చేసుకోమని ప్రభుత్వానికి సూచించింది. శుక్రవారం ఒక్క రోజు నగదు బదిలీ చేసేందుకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై.. డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియ జరగనుండగా, ఆ తర్వాత రోజు నుంచి డిబిటి ద్వారా నగదు బదిలీ చేసుకోవాలన్న…

Read More

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌కు ఢిల్లీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది.  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. అయితే ఐదు కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నట్లు కోర్టు తేల్చింది. మే 21న బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. ఆరో కేసును కొట్టివేసింది. కాగా, బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగాలు నమోదుకు సంబంధించిన తీర్పును ఏప్రిల్‌ 18న ఢిల్లీ కోర్టు వెల్లడించాల్సి ఉంది. అయితే 2022 సెప్టెంబర్ 7న డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయానికి తాను హాజరైనట్లుగా వచ్చిన నివేదికలపై విచారణ కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు.…

Read More

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కు సీఈవో వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి దూషిస్తున్నారని, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది. గులాబీ పార్టీ ఫిర్యాదు ఆధారంగా వివరణ కోరిన సీఈవో వికాస్ రాజ్, 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఫిర్యాదును సీఈవో కార్యాలయం పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్కు పంపింది. ఫిర్యాదులోని అంశాలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా వివరణ రాకపోతే, ఏమీ చెప్పేది లేదని భావించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం…

Read More

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆయనతో పాటు మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావుపైనా నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం వారు దేశం బయట ఉన్నారని, వారిపై రెడ్‌ కార్నర్ నోటీసులు ప్రాసెస్ చేసేందుకు 73 సీఆర్‌పీసీ కింద వారెంట్ జారీ చేయాల్సిందిగా ఇటీవల పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.ఈ అంశంపై ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు తరఫు న్యాయవాది సురేందర్ రావు వారి తరఫున కోర్టులో మెమో దాఖలు చేశారు. 30 ఏళ్ల సర్వీసులో…

Read More