బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బిఆర్‌ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాళేశ్వరం విచారణకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదని, కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేష విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాకుమారుడి రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారని, శరీర రంగును బట్టి మనం ఆఫ్రికన్లు అని మాట్లాడుతున్నారని ప్రధాని మండిపడ్డారు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నానని, పాలమూరు సోదర, సోదరీమణులకు హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుతూ నారాయణ పేట జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహబూబ్‌నగర్ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉందని, ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఇచ్చినప్పటికీ సద్వినియోగం కాలేదని, దీంతో పాలమూరు ప్రజలు వలస పోతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రాంతాన్ని తమ…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతగా ఉన్న కేజ్రీవాల్ కు ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించడానికి ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదించింది. ఎన్నికల ప్రచారం రాజ్యాంగ హక్కు కాదని పేర్కొంది. ఢిల్లీలో మే 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు కేజ్రీవాల్ బెయిల్ పై బయటే ఉంటారు. జూన్ 2న తిరిగి కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంటుంది. కౌంటింగ్, ఫలితాల రోజు అయిన జూన్ 4న ఆయన జైలులో ఉంటారు. బెయిల్ షరతులను పేర్కొంటూ వివరణాత్మక…
పోలింగ్ పూర్తయ్యే వరకు నగదు బదిలీ పథకాలు నిలిపివేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు పెద్ద ఉపశమనం కలిగింది. విపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ నిలిపివేసిన నగదు బదిలీ పథకాలకు సంబంధించిన నిధులను లబ్దిదారులకు శుక్రవారం పంపిణీ చేయాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దానితో, పోలింగ్ కు ముందుగా రూ 14,000 కోట్లకు పైగా నగదును లబ్ధిదారులకు చెల్లించే విధంగా గత నాలుగు నెలలుగా ఏర్పాట్లు చేసుకొంటున్న జగన్ ప్రభుత్వానికి సానుకూలత ఏర్పడినట్లయింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధులు పంపిణీ చేయొద్దని ఈసీ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం 10వ తేదీన నిధుల పంపిణీకి అనుమతించింది. మే 11 -13 మధ్య కాలంలో మాత్రం నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది. సంక్షేమ పథకాల్లో భాగంగా నిధుల విడుదల అంశాన్ని…
భారత్ జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా ఆరోపణలను అగ్రరాజ్యం కొట్టిపారేసింది. తమంటతాముగా ఏ దేశ ఎన్నికల వ్యవహారాల్లో కలుగజేసుకునేది లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. వాస్తవానికి తాము భారత్‌తోపాటు ప్రపంచంలో ఏ ఎన్నికల విషయంలో తాము కల్పించుకోబోమని తెలిపారు. అది భాతరదేశ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు. భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నదంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్ పన్నున్ హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందని, దాని వెనక భారత పౌరుల హస్తం ఉందని ఆరోపించిన అమెరికా అందుకు సంబంధించి ‘నమ్మదగిన సాక్ష్యాల’ను చూపలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా గురువారం విమర్శించారు. భారత్‌లోని మతస్వేచ్ఛను ప్రస్తావిస్తూ భారతదేశ జాతీయ మనస్తత్వం,…
మెగాస్టార్ చిరంజీవి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ గురువారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంటే వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన ఎంతో సంతోషంగా కనిపించారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ అభిమానులను అలరిస్తూ మెగాస్టార్ బిరుదు అందుకున్న కొణెదలచిరంజీవికి ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవితోపాటు ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కూడా ఢిల్లీ వెళ్లడం విశేషం. చిరంజీవి అవార్డు అందుకుంటుండగా ప్రేక్షకుల్లో ఉన్న చరణ్, ఉపాసన కూడా ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. చిరంజీవి కాకుండా వైజయంతిమాల, మిథున్ చక్రవర్తి, విజయ్‌కాంత్, ఉషా ఉతుప్ లకు ఈసారి పద్మ అవార్డులను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది…
ఉత్తరాది హిమాలయాల్లో చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర సందడి ఆరంభం అయింది. అశేష భక్తుల సందర్శనకోసం శుక్రవారం నుంచి ఉత్తరాఖండ్‌లోని కేదారినాథ్ , గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులు తెరుచుకుంటాయి. ఆరునెలల పాటు శీతాకాలం మంచు కారణంగా మూసి ఉండే ఈ ఆలయాలకు నేటి నుంచి యాత్రికులను అనుమతిస్తారు. ఈ ప్రసిద్ధ ఆలయాలు గర్హవాల్ హిమాలయ శ్రేణువులలో నెలకొని ఉన్నాయి. సాధారణంగా ఈ ఆలయాలను వేసవి కాలం ఆరంభ దశలో తిరిగి తెరుస్తారు. కేదారినాథ్, యమునోత్రి ఆలయాలను శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పూజాదికాలకు తెరుస్తారు. కాగా గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు తెరుచుకుంటుందని దేవాలయాల కమిటీ అధికారులు గురువారం తెలిపారు. ఇక చార్‌ధామ్ యాత్రలోనే భాగమైన బద్రీనాథ్ ఆలయం ఈ నెల 12న సందర్శనకు సిద్ధం అవుతుంది. ఆలయాల దర్శన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బద్రీనాథ్ కేదారినాథ్ ఆలయ కమిటీ(బికెటిసి) మీడియా నిర్వాహకులు హరీష్ గౌర్ తెలిపారు. కేదారినాథ్…
భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందూ మతం జనాభా గణనీయంగా తగ్గింది. 1950 నుంచి 2015 మధ్య కాలంలో దేశంలో హిందువుల జనాభా వాటా 7.81 శాతం తగ్గినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఇఎసి-పిఎం) తన నివేదికలో వెల్లడించింది. ఒకపక్క దేశంలో హిందువుల జనాభా తగ్గిపోగా మరోపక్క బౌద్ధులు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులతోసహా మైనారిటీల జనాభా పెరిగింది. అయితే సార్శీలు, జైనుల జనాభాలో మాత్రం తగ్గుదల కనిపించింది. ఇతర పొరుగు దేశాలలో మెజారిటీ మతస్తుల జనాభా పెరుగుదల ఉండగా భారత్‌లో మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం. 1950లో భారత జనాభాలో హిందువుల వాటా 84.68 శాతం ఉండగా 2015 నాటికి అది 78.06 శాతానికి తగ్గింది. ముస్లింల జనాభా మాత్రం 1950లో 9.84 శాతం ఉండగా 2015 నాటికి అది 14.09 శాతానికి చేరుకున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. హిందువుల జనాభా పొరుగుదేశమైన మయన్మార్‌లో 10 శాతం తగ్గగా నేపాల్‌లో అధిక సంఖ్యాక…
అనారోగ్యం పేరుతో ఆకస్మిక సెలవు పెట్టిన సిబ్బందిపై ఎయిర్ ఇండియా చర్యలకు దిగింది. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 25 మంది సిబ్బందిని తొలగించింది. అంతేకాకుండా మిగతా వారికి అల్టిమేటం జారీ చేసింది. గురువారం సాయంత్రం 4గంటల లోపు విధుల్లోకి చేరాలని లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరించింది. ఉగ్యోగుల తొలగింపుల సందర్భంగా ఎయిర్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉగ్యోగులు విధులకు హాజరుకాలేదని, ఉద్యోగుల వైఖరి సరిగాలేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. వారి గైర్హాజరీ వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు పేర్కొంది. సంస్థ ప్రతిష్ఠకూ నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇది పూర్తిగా సంస్థ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. అందువల్లే చర్యలు తీసుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది.మే 13 వరకు పరిమితంగా విమానాలు నడపాలని సంస్థ నిర్ణయించింది. సిబ్బంది మూకుమ్మడి సెలవుతో వందకుపైగా విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రద్దు చేసింది. అనారోగ్య కారణాల పేరుతో 200 మందికిపైగా…
ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి అని పేర్కొంటూ కుటుంబ అభివృద్ధి, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరు అని చెప్పారు. రాహుల్ పిల్ల చేష్టల హామీలు, మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటూ బీజేపీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. మూడు విడతల ఎన్నికల్లో ఇప్పటికే 200 సీట్లకు పైగా స్థానాలు గెలిచామని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 400కు లోక్‌సభ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ సీట్లు గెలిచామని, ఈసారి మొత్తం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో బుధవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి స్వాగతం పలికారు. భారీగా వచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో బెజవాడలోని ఆ ప్రాంతమంతా జన సంద్రంగా మారింది. దాడి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ, బాబు, పవన్ ముందుకు సాగారు. బెంజ్ సర్కిల్ వరకు అశేష జన ఈ రోడ్ షో కొనసాగింది. ఇక, ఎన్డీఏ కూటమికి మద్దతుగా రైతులు, మహిళలు అక్కడికి చేరుకుని అభిమాన నేతకలు మద్దతు తెలిపారు. కాగా, రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో కూటమికి వస్తున్న ప్రజాదరణ పట్ల…