భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పెను దుమారం రేపిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ శామ్ పిట్రోడా ఆ పదవికి రాజీనామా చేశారు. తాను ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు చెప్పగా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, ఈశాన్య భారతంలో చైనీయులు మాదిరిగా ఉంటారని పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్య ఔన్నత్యం గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు, పార్టీకి పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. తాజాగా ఆయనే పదవి నుంచి తప్పుకున్నారు. ‘స్టేట్స్‌మన్’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి సామ్ పిట్రోడా మాట్లాడారు. “లౌకిక దేశాన్ని సాధించడం కోసం…
Author: Editor's Desk, Tattva News
సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‍లో సవాల్ చేశారు. దీనిపై గతంలో వాదనలు పూర్తి కావడంతో క్యాట్ తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై తీర్పునిచ్చింది. వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయండం న్యాయ విరుద్దమని క్యాట్ అభిప్రాయపడింది. ఆయనను వెంటనే సర్వీస్ లోకి తీసుకుని రావాల్సిన ఎరియర్స్ మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీవీ సస్పెన్షన్ చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని క్యాట్ అభిప్రాయపడింది. టీడీపీ ప్రభుత్వంలో రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా క్యాట్ సస్పెన్షన్ ను సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టును…
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారాన్ని చేపడితే అయోధ్యలోని రామాలయానికి బాబ్రీ తాళాన్ని వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బుధవారం లఖింపూర్ ఖేరీ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తరఫున ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. బిజెపికి 400 సీట్లు దాటితే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపిస్తున్నాయని తెలిపారు. అది జరిగే అవకాశం లేనప్పటికీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం అయోధ్య రామాలయానికి బాబ్రీ పేరుతో తాళం పడుతుందని అమిత్ షా ఆరోపించారు. రామ జన్మభూమికి సంబంధించిన న్యాయ వివాదాన్ని ప్రధాని మోడీ గెలవడంతోపాటు రామాలయానికి భూమి పూజ చేశారని, జనవరిలో ఆలయానికి ప్రాణ ప్రతిష్ట కూడా జరిగిందని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల మొదటి మూడు దశలు పూర్తయిన తర్వాత మోడీ…
ముస్లింలను, కాంగ్రెస్ పార్టీని లక్షంగా చేసుకుని బిజెపి కర్నాటక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వీయకు కర్నాటక పోలీసులు బుధవారం సమన్లు జారీచేశారు. 7 రోజుల్లోపల బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని ఆ సమన్లలో పోలీసులు ఆదేశించారు. బిజెపి నాయకులపై సమన్లు జారీ చేయడంపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరను విలేకరులు ప్రశ్నించగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు ఉంటాయని చెప్పారు. ఒకసారి వారు (నడ్డా, మాల్వీయ) వచ్చి తమ వాంగ్మూలాన్ని ఇచ్చి, తమ ప్రకటనను సమర్థించుకుంటే తదుపరి చర్యల గురించి పరిశీలిస్తామని ఆయన తెలిపారు. బిజెపి కర్నాటక విభాగం షేర్ చేసిన పోస్టును వెంటనే తొలగించాలంటూ ఎక్స్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం…
కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, కానీ తెర వెనుక మాత్రం అవినీతి సిండికేట్ చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన ‘ఎములాడ జన సభ’కు ప్రధాని మోదీ హాజరై ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే కలుగుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపినప్పుడే కరీంనగర్లో ఆ పార్టీ ఓటమి ఖాయమైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభావం కరీంనగర్లో మచ్చుకైనా కనిపించట్లేదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్…
హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగడంతో ఆ రాష్ట్రంలో సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం కూలిపోయే దశకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు మరో రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడింది. హర్యానాలో అధికార బీజేపీకి మద్దతుగా ఉన్న ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఆ ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం గమనార్హం. ఇప్పటివరకు దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీలోకి వలసలు కొనసాగి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయి బీజేపీ సర్కార్ ఏర్పాటయ్యాయి. కానీ ఈసారి మాత్రం హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని…
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను రిసార్ట్‌గా మార్చి జగన్ దెబ్బ తీశారని మండిపడుతూ తిరుమల పవిత్రతను తాము అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై విరుచుకుపడుతూ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల అవినీతికి అడ్డేలేదని మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటూ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఐదేళ్లుగా దొంగలు పడ్డారని చంద్రబాబు ఆక్షేపించారు. వైసీపీకి ఓటేస్తే మీ భూములు మీవి కావని హెచ్చరించారు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజల మెడకు ఉరితాడు లాంటిదని పేర్కొన్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని నిలదీశారు. తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తమదని స్పష్టం చేశారు. తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేశామని గుర్తు చేశారు. తిరుపతిలోనే పుట్టి పెరిగానని వేంకటేశ్వరస్వామి నాకు పునర్జన్మ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. …
ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. భారీ వర్షాల వల్వ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మెదక్ జిల్లాలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. గ్రేటర్ పరిధిలోని బహుదూర్ పూరలో విద్యుత్‌పోల్‌ను తాకి విద్యుత్‌ఘాతానికి గురై ఒకరు మృతి చెందారు. వర్దన్నపేటలో మరొకరు మృతి చెందారు. భారీ వర్షం వల్ల పంట మీద ఉన్న వరి నేల వాలింది. గింజలు నేలరాలాయి. కాపు మీద ఉన్న మామిడి కాయలు జలజల నేలరాలాయి. పలు చోట్ల ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి.దీంతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లాలోని రెబల్లె గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్న బొప్పాయి పంటకు నష్టం వాటిల్లటంతో రైతులు భోరున విలపిస్తున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా…
తెలంగాణలో రైతు భరోసా చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీలోపు అందరికీ రైతుభరోసా చెల్లింపులు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్.వేణు కుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకొంది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన నగదు బదిలీకి ఎలాంటి ప్రచారం లేకుండా గతంలో అనుమతించినట్లు ఈసీ తెలిపింది. గత శాసనసభ ఎన్నికల సమయంలో కూడా అప్పటి ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రైతుబంధు చెల్లింపులకు అనుమతి నిలిపివేసినట్లు పేర్కొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే విధమైన రీతిలో తొమ్మిదవ తేదిలోగా చెల్లింపులు పూర్తి…
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పరిస్థితి ప్రజలకు అర్థమైందని, రాష్ట్రంలో 7- 10 శాతం కమీషన్లు ఇస్తే తప్ప పనులు కాని పరిస్థితి ఏర్పడిందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. మల్కాజిగిరి వాసులందరూ బీజేపీకే ఓటు వేస్తామని అంటున్నారని, స్వచ్చందంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దని రాజీవ్‌గాంధీ చెప్పారని తెలిపారు. అణగారిన వర్గాల పేరిట ఓట్లు సంపాదించాలని కాంగ్రెస్ యత్నిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన అంబేడ్కర్‌ను ఓడించిన పార్టీ అని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా అమలు కావట్లేదని పేర్కొంటూ . వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు…