Author: Editor's Desk, Tattva News

ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ  తెలిపారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని వెల్లడించారు.  లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌ సందర్భంగా గాంధీనగర్‌ లోక్‌సభ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ హైస్కూల్‌లో ప్రధాని మోదీ మంగళవారం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎండల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు.  వీలైనంత ఎక్కవ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. సమయంతో పోటీపడుతూ మీడియా మిత్రులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోమంత్రి అమిషా కూడా ప్రధాని మోదీతోపాటు పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చారు. పోలింగ్‌ కేంద్రం పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ప్రధాని పలుకరించారు.…

Read More

బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఇకపై ఎవరైనా అంటే వారికి బుద్ది చెప్పాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అమలు చేసేదే బీజేపీ అని, అంబేడ్కర్​ స్ఫూర్తిగా వెళ్లేదే తామని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో కొంతమంది కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హనుమకొండ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సోమవారం సాయంత్రం నిర్వహించిన బిజెపి పోలింగ్ బూత్ ఏజెంట్ ల సమ్మేళనంలో పాల్గొంటూ మోదీ, అమిత్​ షా గురించి మాట్లాడే విషయంలో నోరుజారితే బీజేపీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికొత్తగా గాడిద గుడ్డు గుర్తుతో ప్రచారం చేస్తున్నారని, అదే ఆ పార్టీ గుర్తని సంజయ్ ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు, నా గుండు మీద ఉన్న శ్రద్ధ పథకాల అమలు మీద ఎందుకు లేదో చెప్పాలని ఆయన…

Read More

మరో వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా వైసీపీకి వరుస షాక్ లు తగుతున్నాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తుంది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాల బటన్లు నొక్కారు. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి అయ్యింది. అయితే పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదలకు ఈసీ నిరాకరించింది. నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. తుపాను, కరవు కారణంగా దెబ్బతిన్న పంటలకు అందించే ఇన్ పుట్ సబ్సిడీ విడుదలకు నిరాకరించింది. అలాగే విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు కేంద్ర ఈసీ అంగీకరించలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ఉంటుందని ఈసీ తెలిపింది. 2019 ఎన్నికల సమయంలో…

Read More

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు. మే 2వ తేదీన బద్వేల్‌ బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ 168 , ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల.. వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు…

Read More

నిషిద్ధ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు స్వీకరించారన్న ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఎఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సిఫార్సు చేసినట్లు రాజ్ ని వాస్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. కాగా..బిజెపి ప్రోద్బలంతో కేజ్రీవాల్ పై మరో కుట్రకు లెఫ్టినెంట్ గవర్నర్ తెరతీశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జైలులో ఉన్న దేవేంద్ర పాల్ భుల్లార్‌ను విడుదల చేసేందుకు విదేశాలలో ఉన్న సిక్కు ఉగ్రవాద ఖలిస్తానీ గ్రూపులు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌కు 16 మిలియన్ డాలర్ల నిధులు అందచేసినట్లు సక్సేనాకు ఫిర్యాదు అందిందని కేంద్ర హోం కార్యదర్శికి రాసిన లేఖలో ఎల్‌జి సచివాలయం తెలిపింది.  ఢిల్లీలో 1993లో 9 మంది ప్రాణాలు తీసిన ఒక బాంబు పేలుడు కేసులో దోషిగా తేనలి భుల్ల్లార్ అమృత్‌సర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. 2001 ఆగస్టు 25న ప్రత్యేక టాడా కోర్టు భుల్ల్లార్‌కు…

Read More

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. ఈ ప్యానెల్లో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్కుమార్ గుప్తా పేర్లు ఉన్నాయి. వీరిలో హరీశ్కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేస్తూనే, తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. దానితో ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. హరీశ్కుమార్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా…

Read More

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం బాట పట్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని భరోసా వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నెంబర్‌వన్‌గా ఉండేదని, జగన్‌ ఐదేళ్ల ప్రభుత్వంలో పాలన పట్టాలు తప్పిందని ధ్వజమెత్తారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరిలతో కలిసి బహిరంగసభలో పాల్గొంటూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని , వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా, కానీ, అవినీతి వందశాతం పెరిగిందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అవసరమని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్డీఏదే అధికారమని నరేంద్ర మోదీ తెలిపారు.…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది.  ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ.. పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ మేరకు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తీర్పును వెలువరించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేయగా.. రిమాండ్‌లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై ఆరోపణలు ఉన్నాయి.  మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకు ఆప్‌కు కవిత రూ. 100 కోట్ల లంచం ఇచ్చారని…

Read More

తన గురించి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి ప్రస్తావిస్తూ, ‘మాకు పిల్లలు లేరు. మీ పిల్లల కోసం మేముపని చేస్తున్నాం’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతిపక్ష కూటమి భాగస్వాములు తమ సొంత కుటుంబ ప్రయోజనార్థం పని చేస్తుండగా తాను దేశ తదుపరి తరాలకు మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తున్నానని ప్రధాని తెలియజేశారు. ఎస్‌పి వ్యవస్థాపకుడు, 2022లో మరణించిన ములాయం సింగ్ యాదవ్ సొంత జిల్లాలో ఎటావాలో లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వచ్చే వెయ్యి సంవత్సరాలకు భారత్ శక్తిమంతమైన దేశంగా కొనసాగేలా చూసేందుకు తాను పునాది వేస్తున్నానని కూడా ప్రధాని తెలిపారు. ‘మోదీ ఈ పని చేస్తున్నది ఎందుకంటే మోదీ ఉన్నా లేకపోయినా దేశం ఎల్లప్పుడూ ఉంటుంది’ అని తెలిపారు. `ఎస్‌పి, కాంగ్రెస్‌వారు ఏమి చేస్తున్నారు? వారు తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు.…

Read More

ఏపీలో అధికార వైసిపి, ప్రతిపక్షాల మధ్య ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ వద్దకు పార్టీలు క్యూకడుతున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఫిర్యాదు చేయగా ఈసీ సిఐడి విచారణకు దేశించింది. దీంతో వెంటనే సీఐడీ చంద్రబాబు నాయుడు, లోకేశ్ లపై కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కారణమని వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఈ దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ఎస్…

Read More