ఈ సారి తెలంగాణలో బిజెపి పది లోక్ సభ సీట్లలో విజయం సాధిస్తోందని కేంద్ర హోమ్ మంత్రి, సీనియర్ బిజెపి నేత అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదటి రెండు దశలలో వంద సీట్లకు బిజెపి చేరుకొంది, మిగిలిన దశలలో మొత్తం 400 సీట్లు గెల్చుకొంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తోందని భరోసా వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభలో పాల్గొంటూ దేశంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఓవైపు మోదీ, మరోవైపు రాహుల్ బాబా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పండుగలను కూడా సైనికుల మధ్య జరుపుకేనే మోదీ ఓ వైపు.. సెలవుల కోసం బ్యాంకాంక్ టూర్లు వేసే రాహుల్ బాబా ఓ వైపు ఉన్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా.. మోదీ .. మోదీ అనే నినాదాలే…
Author: Editor's Desk, Tattva News
బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం పీఠికను ఎన్నటికీ మార్చదని, రిజర్వేషన్లు రద్దు చేయదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విస్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ జనంలో ‘భయ వాతావరణాన్ని’ సృష్టిస్తున్నదని, ‘వోటు బ్యాంకు’ రాజకీయాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నదని రాజ్‌నాథ్ ఆరోపించారు. రాజ్‌నాథ్ సింగ్ ‘పిటిఐ’కి ఇంటర్వూ ఇస్తూ, బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ ‘దుష్ప్రచారం’ చేస్తున్నదని విమర్శించారు. అసలు రాజ్యాంగం పీఠికను మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం పీఠికను మార్చడం జరగదని మంత్రి హామీ ఇవ్వడం బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటే భారత్‌ను అభివర్ణించేందుకు ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తుందన్న విమర్శకుల ఆందోళనలను పరిహరించినట్లు అయింది. బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటే రాజ్యాంగాన్ని ‘చించి, పారవేస్తుంది’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించసాగారు. రాజ్యాంగం పీఠిక నుంచి ‘సెక్యులర్’ పదాన్ని బిజెపి తొలగించవచ్చు అని ఇతర కాంగ్రెస్ నేతలు కొందరు భయాందోళనలు వెలిబుచ్చారు. ‘కాంగ్రెస్…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు ఆదివారం సాయంత్రం జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం సీఎస్‌ను ఆదేశించింది. మరోవైపు ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో…
అవినీతి రహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోదీకి ఓటేశారని, మరోసారి ఆశీర్వదించబోతున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలు బీజేపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాదిరే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తయారవుతుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా చేశామని, రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులను తెలంగాణలో ఖర్చు చేశామని పేర్కొన్నారు. రూ.1.02 లక్షల కోట్లతో రహదారులు నిర్మించామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో దేశంలో రహదారులు నిర్మిస్తున్నామని, 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నామని గుర్తు చేశారు. 13 కోట్ల ఇళ్లల్లో టాయిలెట్లు నిర్మించామని వివరించారు.…
ఆంధ్ర ప్రదేశ్ లో గూండా గిరి, అవినీతి, అరాచకాలను అరికట్టేందుకే తాము కూటమిలో కలిశామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా స్పష్టత ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొంటూ రాష్ట్రంలో భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాను నివారించడానికి పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి అమరావతిని రాజధాని చేసేందుకే రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కలిశామని అమిత్ షా తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్రతను పున:స్థాపితం చేయడం కోసం, తెలుగు భాషను కాపాడేందుకే బీజేపీ కూటమిలో చేరిందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని అమిత్ షా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. ఏపీలో జగన్ రెడ్డి అవినీతితో వాటిని దుర్వినియోగం…
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం రెబల్‌గా మారి సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తనను చంపేసినట్టే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో ప్రసంగించిన మోత్కుపల్లి నర్సింహులు భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తనను చంపినట్టే అంటూ ఉద్వోగభరితంగా మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్…
కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అవినీతి శక్తుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనితీకి పాల్పడిన వారందరూ వచ్చే ఐదేళ్లలో చట్టపరంగా చర్యలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. లోహర్‌దాగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సిసయ్‌లో శనివారం బిజెపి అభ్యర్థి సమీర్ ఓరాన్ తరఫున ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై విరుచుకుపడ్డారు. అవినీతిపరులకు మద్దతుగా కాంగ్రెస్, ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు ర్యాలీలు నిర్వహించారని ఆయన విమర్శించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి జైలు పాలయ్యారని ఆయన ఆరోపించారు. వచ్చే ఐదేళ్లలో అవినీతి చీడను అంతం చేయాలన్నదే తన లక్షమని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన వారందరూ చట్టపరమైన చర్యలు ఎదురుంటారని ఆయన స్పష్టం చేశారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ఇండియా కూటమి నాయకులు అవినీతిపరులకు మద్దతుగా ఢిల్లీ, రాంచిలో ర్యాలీలు నిర్వహిస్తారని, దీన్ని…
హసన్ సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితునిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను (ప్రత్యేక దర్యాప్తు బృందం) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళను అపహరణ చేసినట్లు ఆయనపై కిడ్నాపింగ్ కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు ఆయన ముందస్తు బెయిల్ కోసం బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిని బెంగళూరు సెషన్ కోర్టు తిరస్కరించింది. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని, రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీనితో బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం శుక్రవారం బెంగళూరు సెషన్ కోర్టులో రేవణ్ణ పిటిషన్ దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో, తాజాగా హెచ్డీ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. తన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణల కేసుకు సంబంధించి కూడా సిట్…
ఏపీలో భూహక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఇవాళ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారంపై టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి అంతకు ముందు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.. సీఐడికి ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో వైసీపీ సర్కార్ గతంలో అసెంబ్లీలో ఆమోదించిన భూహక్కు చట్టం ద్వారా ప్రజల భూములు లాక్కుంటారంటూ విపక్ష ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇదే అంశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ఇందులో నిర్ధారణ కాని విషయాలు ఉన్నాయని, అవాస్తవాలు…
భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళ దుబాయ్ నుంచి బంగారం తీసుకువచ్చి అడ్డంగా ముంబై కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. దీంతో ఆమె పదవి పోయింది. కేసు మాత్రమే పెట్టిన అధికారులు ఆమెకు ఉన్న అధికారం ప్రకారం అరెస్ట్ నుంచి మాత్రం మినహాయింపు లభించింది. గుట్టుచప్పుడు కాకుండా విమానంలో దుబాయ్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన ఆఫ్ఘనిస్తాన్ రాయబారి చివరికి అధికారుల కంట పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మాత్రం ఆమె కొట్టిపారేయడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో తనకు అండగా ఉండాల్సిన భారత అధికారులు ఇలా చేయడం ఏంటని ఎదురు ప్రశ్నలు వేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన జకియా వార్దక్ భారత్‌లోని విదేశీ రాయబార కార్యాలయంలో ఎంబస్సీ అధికారిణిగా పనిచేస్తోంది. అయితే తాజాగా ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో అడ్డంగా దొరికిపోయింది. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన జకియా వార్దక్‌ను కస్టమ్స్…