హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, హర్ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన ప్రతీ అగ్నివీర్‌కు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. సంకల్ప పత్ర పేరిట రోహ్‌తక్‌లో ఈ మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు.24 రకాల పంటలకు కనీస మద్దతు ధర సహా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్ ఖర్ఖోడా తరహాలో పది పారిశ్రామిక నగరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్…
Author: Editor's Desk, Tattva News
సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మంత్రివర్గ భేటీలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా వరద బాధితుందరికీ సాయం అందించడమే కూటి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గుంతలు పూడ్చేందుకు రూ.500 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అంతే కాకుండా రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో రహదారులకు రూ.58 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామాల్లోని రోడ్డు నిర్వహణ కోసం రూ. 49 వేల…
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన ఒక వర్తమానంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారానికి తేదీని ఈ నెల 21గా ప్రతిపాదించారు. అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మంగళవారం రాజీనామా చేయగా, ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా ఆతిశీ కోరిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ ఢిల్లీ సిఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా లేఖ ప్రతులను, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆతిశీ అవకాశం కోరుతున్న లేఖ ప్రతులను ‘ఇండియా టుడే’ ప్రత్యేకంగా సంపాదించింది. కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాకుండా రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించి రాశారు. అయితే, కేజ్రీవాల్ తన రాజీనామా సమర్పణకు ఎల్‌జి వికె సక్సేనాను స్వయంగా కలవడం గమనార్హం. పదవికి కేజ్రీవాల్ రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు లెఫ్టినెంట్ గవర్నర్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన…
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషా పై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్‌ను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో యాడ్ చేశారు. జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ”2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు” అని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. “ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో…
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వైసీపీని ఎంతమంది నేతలు వీడుతున్నా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడటం పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో గురువారం భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాజీనామా చేసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ తీరుపైనా, వైఎస్ జగన్ మీద సునిశిత విమర్శలు చేశారు. “జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను గత మూడేళ్ల నుంచి వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు కూడా కొన్ని కారణాల వలన పార్టీ…
ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి కీలక ముందడుగు పడింది. బీజేపీ మేనిఫేస్టోలోని కీలక అంశం, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో కోరుకుంటున్న జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు సమగ్రంగా అధ్యయనం చేసి.. నరేంద్ర మోదీ సర్కార్‌కు గతంలోనే ఒక నివేదికను పంపించింది. తాజాగా ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించి రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుత ఎన్డీఏ సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు…
రాజధాని బీరుట్‌తోసహా లెబనాన్ వ్యాప్తంగా, సిరియాలో కొన్నిచోట్ల మంగళవారం చోటుచేసుకున్న పేజర్ పేలుళ్లలో 9 మంది మరణించగా, దాదాపు 2750మంది గాయపడ్డారు. వీరిలో ఇరాన్ రాయబారి, హిజ్బుల్లా ఎంపి కుమారుడు, ఒక బాలిక కూడా వున్నారు. తండ్రి పక్కనే వుండడంతో పేజర్ పేలుడులో ఆ బాలిక మరణించిందని బంధువులు తెలిపారు. గాయపడిన వారిలో 200మంది పరిస్థితి విషమంగా వుంది. ఈ పేలుళ్లకు ఇజ్రాయిల్ కారణమని, ఇందుకు బాధ్యులైనవారు శిక్ష అనుభవించక తప్పదని హిజ్బుల్లా హెచ్చరించింది. ఈ పేలుళ్లలో తమ సభ్యులు ఇద్దరు మరణించారని అంతకుముందు హిజ్బుల్లా ధ్రువీకరించింది. పేలుళ్ళకు కారకులైన వారిని నిర్ధారించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవలి మాసాల్లో హిజ్బుల్లా అత్యంత ఆధునాతనమైన మోడల్ పేజర్లని తీసుకువచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. సమాచారాన్ని పంపుకునేందుకు వీటిని వాడతారు. లెబనాన్‌వ్యాప్తంగా ఆ పేజర్లు పలుచోట్ల పేలిపోయాయి. హిజ్బుల్లా సభ్యుల వద్ద వున్న పేజర్లను పేల్చివేసినట్లు తెలుస్తోందని పేరు వెల్లడించని భద్రతా అధికారులు…
10 సంవత్సరాల తర్వాత జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైయ్యాయి. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాశ్మీర్‌లో 16, జమ్ములో 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు 11.11 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న పుల్వామాలో అత్యంత తక్కువగా 9.8 శాతం నమోదైంది. కిష్త్వార్ లో అత్యధికంగా 14.83 శాతం నమోదైంది. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని, మహిళలు, ప్రత్యేక వికలాంగులు మరియు యువత నిర్వహించే ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు, పర్యావరణ సమస్యల గురించి సందేశాలను వ్యాప్తి చేయడానికి గ్రీన్ పోలింగ్ స్టేషన్లు మరియు ఇతర ప్రత్యేక పోలింగ్ స్టేషన్లను…
నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇచ్చిన హామీలతోపాటు ప్రజా సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టినం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయించినం. కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినం. ముద్రా రుణపరిమితిని పెంచినం. రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నం. 75 వేల మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేసినం. మూలధన వ్యయం కింద మౌలిక సౌకర్యాల కల్పనుకు రూ.11 లక్షల 11 వేల కోట్లు కేటాయించినం. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ఛార్జీలను తగ్గించినం…ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే.’’అని వివరించారు. మరి కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైందని,…
నేడు వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం బుధవారం ఏర్పడనున్నది. అయితే, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం. ఇది పాక్షిక గ్రహణం కాగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు. ఈ దృగ్విషయాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. వాస్తవానికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఉపగ్రమైన చంద్రుడు చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడి, చంద్రుడి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యకాంతి చంద్రుడిని చేరుకోలేకపోతుంది. భూమినీడ చంద్రుడిపై పడుతుంది. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తుంటారు. అయితే, ఈ గ్రహణం భారత్‌లో కనిపించేందుకు అవకాశం లేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.11 గంటల సమయం ఏర్పడి.. 10.17 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం 4 గంటల 6 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణాన్ని…