రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరించింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడి బరిలోకి దింపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ స్థానం నుంచి కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయ్‌బరేలీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. మరోవైపు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ స్థానంలో రాష్ట్ర మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్‌ను కమలం పార్టీ బరిలోకి దించింది. 2019 ఎన్నికల్లోనూ ఈయన సోనియాపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో శాససమండలి నుంచి ఎన్నికై కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. తొలుత ఈ స్థానం నుంచి వరుణ్ గాంధీని నిలబెడతారని ప్రచారం జరిగింది. పార్టీ ప్రతిపాదనకు ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో గెలుపొందారు. అయితే లైంగిక వేధింపుల…
Author: Editor's Desk, Tattva News
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోల్‌కతా రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై గవర్నర్ బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు. ఈ ఆరోపణలను గవర్నర్ సీవీ ఆనంద్ తీవ్రంగా ఖండిస్తూ సత్యం గెలుస్తందని తెలిపానరు. కల్పిత కథనాలను చూసి తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు. ‘ఇలా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే, గాడ్ బ్లెస్ దెమ్. కానీ, బంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరు’ అని బోస్ చెప్పారు. మరోవైపు, గవర్నర్‌పై వస్తున్న ఆరోపణలపై టీఎంసీ నాయకురాలు శశి పంజా స్పందించారు. “మేం పూర్తిగా దిగ్భ్రాంతికి…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్ తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రాహుల్‌పై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. హస్తం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనపడుతుంటే, అక్కడ పాకిస్థానీయులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యువరాజుని (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) భారత ప్రధానిని చేయాలని పాక్ నేతలు తహతహలాడుతున్నారన్నారని ఆరోపించారు. రాహుల్ కోసం పాక్ నేతలు ప్రార్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆనంద్, ఖేడా లోక్‌సభ స్థానాల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సెంట్రల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. “భారత్‌లో బలహీన సర్కారు ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారు.…
ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊసే లేదని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ట్యాపింగ్ కేసును నీరుగార్చాయని విమర్శించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కరీంనగర్ కు చెందిన ఓ కాంగెర్స్ మంత్రి యత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీబీఐకి ఇవ్వకపోతే ఈ కుంభకోణంతో హస్తం పార్టీ సంబంధం ఉన్నట్లే. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనుమానం కలుగుతుందని స్పష్టం చేశారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు చెప్పారని, ఆయన ఏం చెప్పారో పోలీసు రికార్డులో ఉందని తెలిపారు. పెద్దలు చెబితేనే తాము ఈ…
హైదరాబాద్ లోక్‌సభ నియోజవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపిచ్చారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంటులో రజాకార్ల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళి ఆలయం నుంచి శాలిబండలోని సుధా టాకీస్ వరకు నిర్వహించిన రోడ్‌షోలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి మాధవిలతలతో కలిసి పాల్గొన్నారు. ప్రచార సమయం ముగుస్తుండటంతో సభలో.. అమిత్ షా క్లుప్తంగా మాట్లాడారు. రజాకార్ల పాలన నుంచి హైదరాబాద్‌కు ముక్తి కల్పించాలని, బీజేపీ అభ్యర్థి మాధవిలతను గెలిపించాలని, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలవబోయే 400 ఎంపీ సీట్లలో ఒకటి హైదరాబాద్ నుంచి ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాదులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇక్కడి…
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమ యం సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. రాజకీయ పార్టీలు పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు పెంచాలని చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ముగుస్తుందని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, వడగాల్పులు, రాజకీయ పార్టీల వినతి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పోలింగ్ సమయం పెంచడం వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, మే 6 నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్పై ఈసీ ఈ విధంగా చర్యలు తీసుకుంది. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పా ర్టీపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యా ఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై ఈ నిషేధం విధించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న కెసిఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పాటు, తమ పార్టీ నేతల ను ఉద్దేశించి అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసీఆర్పై చర్యలకు ఈసీ పూనుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన…
స్వాతంత్య్రం అనంతరం దిశను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ రహితంగా కూడా మారిపోయిందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. భారతీయ నాగరికతను, సంస్కృతిని అప్రతిష్ట పాల్జేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని దూషించడానికి, సనాతన ధర్మాన్ని అవమానించడానికి కాంగ్రెస్ నాయకులు పదేపదే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో యుపిఎ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన ఒక కాంగ్రెస్ నాయకుడు కాషాయ ఉగ్రవాదం పేరుతో భారతీయ సనాత సంస్కృతిని అవమానించడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం సమస్యలకు కాంగ్రెస్ విధానాలే కారణమని ప్రతి ఒక్కరికీ తెలుసునని ఆయన ఆరోపించారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం మాత్రమే కాక ఈశాన్య ప్రాంతాలలోని ఉగ్రవాదం, అరాచకం సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని యోగి తెలిపారు. రాజ్యాంగంలోని 370వ అధికరణే ఉగ్రవాదానికి…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో చేవెళ్ల బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా.. తాము మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. అయితే ఆయన కామెంట్లను వక్రీకరిస్తూ.. రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై రేవంత్ రెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ కావటానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం పంపించారు. ఆ వీడియో పోస్టు చేసిన ఐ ఎన్ సి తెలంగాణ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను తాను నిర్వహించడం లేదని చెప్పారు. తాను కేవలం రెండు ట్విట్టర్ ఖాతాలను (సీఎంవో తెలంగాణ, వ్యక్తిగత ఖాతా) మాత్రమే…
బాంబు బెదిరింపు దేశ రాజధానిలో సుమారు 100 పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారక, వసంతకుంజ్, నోయిడా సెక్టార్ 30లోని దిల్లీ పబ్లిక్ స్కూళ్లు, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, సాకేత్‌లోని అమిటీ సహా 97 స్కూళ్లకు మెయిళ్ల ద్వారా బుధవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే ఐదు పాఠశాలలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని దిల్లీ పబ్లిక్ స్కూల్, చాణక్యపురిలోని సంస్కృతి పాఠశాల, వసంత్ కుంజ్ లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, సాకేత్ లోని అమిటీ పాఠశాల, గ్రేటర్ నోయిడాలోని…