Author: Editor's Desk, Tattva News

జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై కొంత మేర ఉపశమనం లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈమేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.  ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్‌లో పేర్కొంది. మొత్తానికి జనసేనకు కాస్త ఉపశమనం కానీ మొత్తానికి అయితే కాదు.  గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ జరగగా ఈ విషయంపై 24 గంటల్లో ఈసీ తన నిర్ణయాన్ని తెలియజేస్తుందని హైకోర్టుకు ఈసీ న్యాయవాది చెప్పారు.  తాజాగా, బుధవారం ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు నివేదిక అందించింది. ఈ నివేదికలో జనసేన పార్టీ పోటీ చేసి ఎంపీ స్థానాల్లో(కాకినాడ, మచిలీపట్నం) అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు…

Read More

తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్‌ ఆర్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ విధించిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ ట్యాక్సును రహస్యంగా ఇచ్చుకోవాల్సి వస్తోందని, తెలంగాణ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.  డబుల్‌ ఆర్‌ ట్యాక్సు ఢిల్లీకి వెళ్తుందని, అక్కడ ఎవరికి చేరుతుందో అందరికీ తెలుసని ధ్వజమెత్తారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో మన దేశ ఖ్యాతిని తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. కానీ, డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌తో దేశం సిగ్గుతో తలదించుకుంటోందని పేర్కొన్నారు.  ప్రధాని దుయ్యబట్టారు.  మంగళవారం మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న అల్లాదుర్గంలో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణను తొలుత బీఆర్‌ఎస్‌ ఎలా దోచుకుందో, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే విధంగా డబుల్‌ ఆర్‌ ట్యాక్సు పేరుతో దోచుకుంటోందని…

Read More

ఛత్తీస్‌గఢ్‌లోని నా రాయణ్ పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అడవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సలైట్లు మరణించారు. గత 15 రోజుల్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు మరణించడం ఇది రెండోసారి. రాష్ట్రంలో జరుగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఇదో భారీ విజయమని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఒక వీడియో సందేశంలో తెలిపారు. నక్సలైట్ల కు గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా భావించే అభూజ్ మడ్‌లోని టేక్‌మెట, కాకూర్ గ్రామాల మ ధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కాల్పుల పోరు జరిగిందని పోలీసులు తెలిపారు. న క్సల్ ఏరివేత కోసం జిల్లా రిజర్వ్ గార్డు (డిఆర్‌జి), ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్) సం యుక్తంగా గాలింపు జరిపినప్పుడు ఈ ఘటన జరిగిందని వారు చెప్పారు. గాలింపు చర్యలు సోమవారం రాత్రి ప్రారంభం…

Read More

ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలికి చెందిన 14 ఉత్పత్తుల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్, మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై ఫిర్యాదు అందింది.  పతంజలికి చెందిన స్వసారి గోల్డ్, స్వసరి వాటి, బ్రోంకోమ్, స్వసారి ప్రవాహి, స్వసరి అవలేహ్, ముక్తావతి ఎక్స్‌ట్రా పవర్, లిపిడమ్, బిపి గ్రిట్, మధుగ్రిట్, మధునాశిని వాటి ఎక్స్‌ట్రా పవర్, లివామృత్ అడ్వాన్స్, లివోగ్రిట్, ఐగ్రిట్ డాక్టర్ ఎగ్రిట్ గోల్డ్, పతంజలి లైసెన్సులు సస్పెండ్ చేశారు. పతంజలి ఆయుర్వేద ఆరోగ్య నివారణలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రసారం చేయకుండా నిషేధించిన కోర్టు ఆదేశాలను ధిక్కరించడంపై రామ్‌దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు సంబంధించిన తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనల కేసులో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మందలించింది.…

Read More

వెస్టిండీస్‌-అమెరికా వేదికగా జూన్‌లో జరగనున్న ఐసిసి టి20 ప్రపంచ కప్‌కు భారత జట్టు సిద్ధమైంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టుతోపాటు మరో ముగ్గురిని రిజర్వుగా ఎంపిక చేసింది. బిసిసిఐ మంగళవారం ప్రకటించిన 15మంది ఆటగాళ్ల జాబితాలో యజ్ఞేంద్ర చాహల్‌, సంజు శాంసన్‌, రిషబ్‌ పంత్‌ చోటు దక్కించుకోగా.. మ్యాచ్‌ ఫినిషర్‌ రింకు సింగ్‌ రిజర్వు ఆటగాడిగా ఎంపికయ్యాడు. శివమ్‌ దూబే అనూహ్యంగా తుది 15మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోగా.. శుభ్‌మల్‌ గిల్‌ రిజర్వులోకి వెళ్లిపోయాడు. ఇక కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి దాదాపు రెండేళ్ల తర్వాత బ్యాట్‌ పటిన వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు తుది 15మంది ఆటగాళ్లలో చోటు దక్కింది. ఈ సీజన్‌ ఐపిఎల్‌లో ఢిల్లీ తరఫున పంత్‌ 8మ్యాచుల్లో 158.51 స్ట్రయిక్‌రేట్‌తో 251 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌, చాహల్‌తోపాటు పేసర్ల విభాగంలో బుమ్రా,…

Read More

కెనడాలో చదువుకుంటున్న భారత్‌తోసహా ఇతర అంతర్జాతీయ విద్యార్థుల ఆఫ్ క్యాంపస్ పని గంటలపై కెనడా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. వచ్చే సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 24 గంటల వరకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పని చేయవచ్చు. ఈ చట్టం మంళవారం నుంచి అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 20 గంటలకు పైగా పనిచేసేందుకు అనుమతిస్తూ తీసుకువచ్చిన తాత్కాలిక విధానం ఏప్రిల్ 30తో ముగిసిపోతున్నట్లు ఇమిగ్రేషన్, శరశణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. కొత్త చట్టం ప్రకారం సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 24 గంటల వరకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పని చేసుకోవ్చని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కత్తెర వేస్తూ కెనడా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. కొవిడ్ 19 కాలంలో దేశంలో కార్మికుల కొరతను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విద్యార్థుల కోసం పని గంటలపై…

Read More

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ మంగళవారం ఉమ్మడిగా మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది. పలు కీలకమైన హామీలతో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు పథకాలపై ఫోకస్ పెట్టారు.   ⇨ మెగా డీఎస్సీపై మొదటి సంతకం⇨ సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)⇨ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం⇨ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం⇨ దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు⇨ బీసీలకు 50 ఏళ్లకే…

Read More

రాజకీయాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సినీ స్టార్లందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. చిరంజీవి స్వయంగా వస్తుండటంతో పిఠాపురంలోని జనసైనికులు, కూటమి శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. చిరంజీవి ప్రచారం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిరంజీవి ప్రచారంలో పాల్గొంటే పవన్ కల్యాణ్ కు కలిసి వ‌స్తుందని జనసైనికులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ పార్టీ నుంచి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకో గలిగారు. ఆ ఎమ్మెల్యే కూడా జనసేనను వీడి వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ రంగంలోకి దిగారు. ఓటర్లు తనను నమ్మాలని, ఆ నమ్మకాని తాను నిలబెడుతానని చెబుతూ పిఠాపురంలోనే నివాసం ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఇటీవలె గృహ ప్రవేశం కూడా…

Read More

కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవెగౌడ మనవడి డర్టీపిక్చర్‌ కుదిపేస్తోంది! ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి, మే 7న మరో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ రాష్ట్రంలో.. దేవెగౌడ పెద్దకుమారుడైన రేవణ్ణ కొడుకు.. హసన్‌ సిటింగ్‌ ఎంపీ అయిన ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెనుసంచలనం సృష్టిస్తోంది.  ఆ వీడియోల్లో వందలాది మంది సాధారణ మహిళలతోపాటు.. పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ వీడియోలన్నీ అతడి ఫోన్‌లో రికార్డ్‌ చేసుకున్నవే! ఎలా బయటపడ్డాయోగానీ.. ఆ వీడియోల పెన్‌డ్రైవ్‌లు పలు పార్టీల నేతలకు, జాతీయ స్థాయిలో పలువురు కాంగ్రెస్‌ నేతలకు కూడా చేరాయి.  సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్‌ కావడం.. ఈ వ్యవహారం మీడియా ద్వారా ప్రపంచమంతా టాం టాం కావడం జేడీఎ్‌సను, ఆ పార్టీతో జట్టు కట్టిన బీజేపీని ఇరుకున పెడుతోంది. నిజానికి ప్రజ్వల్‌ కామలీలల గురించి బయటి…

Read More

ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, సిట్టింగ్ బిజెపి ఎంపి స్మృతి ఇరాని సోమవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి నిషా అనంత్ సమక్షంలో ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గౌరీగంజ్‌లోని బిజెపి కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు మూడు కిలోమటర్ల రోడ్‌షో ఆమె నిర్వహించారు. ఆమె వెంట మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఇతర బిజెపి నాయకులు ఉన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌కు 200 మీటర్ల దూరంలో రోడ్‌షో ముగిసింది. రోడ్‌షోలో ఉత్తర్ ప్రదేశ్ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్, స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ కూడా పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం స్మృతి ఇరాని విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఐదేళ్ల క్రితం అమేథీ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. 50 ఏళ్లలో సాధ్యం కాని…

Read More