Author: Editor's Desk, Tattva News

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్‌ వీడియోల కేసులో రేవంత్‌కు పోలీసులు ఈ సమన్లు అందించారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకున్న ఢిల్లీ పోలీసులు సమన్లు అందజేశారు. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇదిలా ఉండగా.. అమిత్‌ షా ఇటీవల తెలంగాణ పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే…

Read More

కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ పేరుతో మ‌రో కొత్త మోసం చేస్తుంద‌ని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ర‌ఘునంద‌న్ విమర్శించారు. దుబ్బాకలో జరిగిన రైతు సమ్మేళనంలో మాట్లాడుతూ  కలెక్టర్ గా మాట్లాడిన మాటలు.. వరి వేస్తే ఉరి అని బెదిరించిన వ్యక్తి నేడు మీ ముందుకు వస్తున్నాడని బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ కలెక్టర్ గురించి హెచ్చరించారు. ఇది రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అంటూ  అసెంబ్లీలో మోసపోయి గోసపడుతున్నాం, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఏనాడు పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా మాట్లాడలేదని విమర్శించారు. గెలిచాక‌ ప్రజలను పట్టించుకోలేదు, పైసలు పంచి గెలుద్దామనే కుట్రలకు తెరతీశారని పేర్కొన్నారు.  దుబ్బాక ప్రజలు చివర్లో ఆగం కావద్దు, గోస పడొద్దు.. ఎవ‌రికి కష్టం వచ్చినా అందుబాటులో ఉండని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి, సమస్యలపై స్పందించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. కారుకు ఓటు వేసినా లాభం లేద‌ని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద 2500…

Read More

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానానికి ఆ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన అక్షయ్ కాంతి బామ్ పోటీ నుంచి తప్పుకున్నారు. తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్న ఆయన.. వెనువెంటనే బీజేపీలో చేరారు.  ఈ స్థానంలో నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుండగా.. నామినేషన్‌కు గడువు సోమవారంతో ముగియనుంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలాతో కలిసి కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లిన ఆయన.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ పోటీలో ఉన్నారు.  ఇప్పటికే గుజరాత్‌లో సూరత్ స్థానం బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇక, బీజేపీలోకి అక్షయ్ బామ్‌ను స్వాగతిస్తున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి కైలాస్ విజయ్ వర్గీయ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ఇండోర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్‌కు ప్రధాని నరేంద్ర…

Read More

సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి కామన్ సింబల్ `గాజు గ్లాస్’ గుర్తును జనసేనకు కేటాయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. గతంలో గ్లాసు గుర్తును ఈసీకి ఫ్రీ సింబల్స్‌ జాబితాలో చేర్చింది. అయితే జనసేన అభ్యర్థన మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. అలాగే సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీ జై భారత్‌ నేషనల్‌ పార్టీకి కామన్ సింబల్ టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది ఈసీ. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్తిపాడు, జగ్గయ్యపేట వారాహి విజయ భేరి యాత్రలో ఆదివారం పాల్గొన్నారు. ఇక్కడ నిర్వహించిన…

Read More

కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మానవుడు, జేడీఎస్ యువ ఎంపీ ప్రజ్వల రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు రెండు దశల్లో జరగుతుండగా.. ఏప్రిల్ 26న మొదట విడత ముగిసింది. ఈ పోలింగ్‌కు రెండు రోజుల ముందు యువ ఎంపీ వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.  ఆ నేత యువతులు, మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు అందాయి. యువతులపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి.. వాటిని వీడియోలు తీసి, అవసరమైనప్పుడు శారీరక అవసరాలను తీర్చుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌‌ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి వెల్లడించారు. లైంగిక వేధింపుల నివేదికలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మహిళా కమిషన్.. వీడియోలతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటనల్లో శక్తివంతమైన రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు.ఈ అంశంపై దర్యాప్తునకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై ఏర్పడిన వివాదంపై స్పష్టత వచ్చింది. మే నెల పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దివ్యాంగులు, మంచం పట్టినవారు, తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, వీల్‌ ఛైర్‌లో ఉన్నవారు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే గ్రామ, సచివాలయాల సిబ్బంది అందించనున్నారు.  మొత్తం 14,995 గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సేవలను వినియోగించనున్నారు. లబ్ధిదారుల కోసం 10,814 కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి పింఛను పంపిణీని పర్యవేక్షించనున్నారు.  ఒకవేళ ఏదైనా సమస్యతో బ్యాంకు అకౌంట్‌లలో నగదు జమ కాకపోతే.. వారికి మే 2న ఇంటి దగ్గరే నగదు అందించనున్నారు.  ఇళ్ల దగ్గర పింఛన్‌ తీసుకునే లబ్ధిదారుల జాబితా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పింఛను యాప్‌లో ఉంటుంది.…

Read More

పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ రగడ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేతల స్పందనతో ఈ వివాదంముదిరింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలన కాంగ్రెస్ నేతలు తప్పు బట్టారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆరోపించారు. ఈ వివాదం పై ఆర్ఎస్ఎస్ అధినేత డా. మోహన్ భగవత్ హైదరాబాద్ లో స్పష్టత ఇచ్చారు.రిజర్వేషన్ల పై బీజేపీ – కాంగ్రెస్ మధ్య వివాదం సాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. 400 లోక్ సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చుననేది బీజేపీ కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.  తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే…

Read More

హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ -2కు శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ వరకు 14 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఫేజ్- 2లో మొత్తం 13 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నాగోల్ మెట్రో స్టేషన్ తో మొదలై నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్డు , మైత్రి నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్ రోడ్ కూడలి , ఓవైసీ ఆసుపత్రి, డిఆర్డీఓ ఆఫీస్, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్తగా 13 స్టేషన్లు రాబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్, స్టేషన్ స్థానాలను ఖరారు చేసేందుకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్వీస్ రెడ్డి పరిశీలించారు. మెట్రో రైల్ స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారతదేశ ఐటీ హబ్‌ బెంగళూరు బాంబులతో దద్దరిల్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.   “బాంబు పేలుడుతో బెంగళూరు దద్దరిల్లితే, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పేలిందని బుకాయించింది. కేఫ్​లో బాంబు పేలలేదు, వాళ్ల (కాంగ్రెస్) మెదడు  పేలింది. ఆ పేలుడుకు పాల్పడిన వాళ్లంతా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలని తేలింది” అని కాంగ్రెస్​పై మోదీ మండిపడ్డారు.  కర్ణాటకలోని సిర్సిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.  కర్ణాటకను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని మోదీ ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో అసాంఘిక శక్తులు, దేశ వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన సమూహాలకు మద్దతు లభిస్తోందని ధ్వజమెత్తారు. తాము కర్ణాటకలో అధికారంలో ఉన్న సమయంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలను నిషేధించిన విషయాన్ని ఆయన…

Read More

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకుగాను తాను పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆప్‌తో పొత్తును ఢిల్లీ యూనిట్‌ అంగీకరించలేదని వెల్లడించారు. ఈ మేరకు ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలతోనే ఆ పార్టీ ఏర్పాటయిందని చెప్పారు. అలాంటి పార్టీతో పొత్తు వద్ద ఢిల్లీ శాఖ ఏకగ్రీవంగా తీర్మాణం చేసిందన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం నిర్ణయం మేరకు తాము సమర్ధించినట్లు తెలిపారు. కాగా, పీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలకు ఢిల్లీ ఇన్‌చార్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి దీపక్‌ బబరియా తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే…

Read More