Author: Editor's Desk, Tattva News

వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి వినియోగించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఒక వంక వారితో వారితో రాజీనామాలు చేయిస్తూ రాజకీయపరంగా దుమారం రేపాలని ప్రయత్నిస్తున్న వైసిపి ప్రభుత్వం మరోవంక సకాలంలో పెన్షన్ల పంపిణి జరగకుండా ఎన్నికల కమిషన్ పై, ప్రతిపక్షాలపై ప్రజలను రేచ్ఛగొట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతుంది. గ్రామా సచివాలయాలు వద్ద పంపిణి చేస్తామని అంటూ ఈ నెల మొదట్లో నిరసన ప్రదర్శనలు జరియించింది. అయితే ఇతరత్రా సిబ్బందిని ఉపయోగించుకొని ఇంటివద్దనే పంపిణి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా సకాలంలో స్పందించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి ధిక్కార ధోరణి ప్రదర్శించారు. వచ్చే నేలకూడా అదేవిధంగా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఎన్నికల కమిషన్ మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30 తేదీన జారీ చేసినట్టు…

Read More

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం తలకు బ్యాండేజీ లేకుండా ప్రత్యక్షం కావటంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ తెరమీదకు వచ్చింది. విజయవాడలో రాయి దాడి జరిగినప్పటి నుంచి నుదుటిపై బ్యాండేజీతో మేమంతా సిద్ధం బస్సు యాత్రలోనే సీఎం దర్శనమిచ్చారు.  ఆ గాయం చాలా తీవ్రమైందని, ఆ గాయానికి మూడు కుట్లు పడ్దాయని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయగా.. అయ్యో అని జనం కూడా కాస్త బాధను వ్యక్తం చేశారు. ఇక బస్సు యాత్ర ముగిసిన తరువాత తాడేపల్లిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ నుదుటన బ్యాండేజి లేకుండా కనిపించారు. అంతే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు సీఎం జగన్ పై సెటైర్లు దంచుతున్నారు. “ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం… జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం” అంటూ టీడీపీ నాయకుడు లోకేష్ సెటైర్ వేశారు. ఈ…

Read More

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న కేజ్రీ ఆరోగ్యంపై కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు చెందిన మెడికల్‌ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్రస్తుతం కేజ్రీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ధ్రువీకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుమారు అరగంట పాటు సీఎంతో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సదరు కథనాలు తెలిపాయి. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని సూచించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం మరోసారి సీఎంను పరీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు తెలిసింది.…

Read More

ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శనివారం తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాదిరిగా అబద్దపు హామీలతో మోసాలు చేయకుండా సాధ్యమయ్యే వాటినే అమలు చేస్తామని చెప్పారు. . అమ్మబడి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచి ఇస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు భరోసా పథకం వర్తింపచేస్తామని, వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద మహిళలకు రూ. 3లక్షల వరకు రుణాలు అందిస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్లను అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి నెలా అందిస్తున్న రూ. 3వేల పెన్షన్‌ ను రెండు విడతలుగా 2028 జనవరి , 2029 జనవరి నుంచి అందిస్తామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాగానే అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.…

Read More

ఓటు వేయడం, మన హక్కు మాత్రమే కాదు, భారత దేశ పౌరుడిగా మన భాధ్యత అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరులో శనివారం ఓటర్ అవగాహన ర్యాలీలో ఆయ‌న‌ పాల్గొననున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి త్రీ కే వాక్ ను ప్రారంభించారు. అనంతరం మొదటిసారి ఓటు వేస్తున్న యువతకు ఓటు హక్కు పై అవగాహన క‌ల్పించారు. మొదటి సారి ఓటు వేయనున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రజాస్వామ్యన్ని పరి పుష్టి చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అనే భాధ్యత తీసుకోవాలని సూచించారు. మీరు ఓటు అనే పండుగలో మీ హక్కు వినియోగించుకోవడం కోసం, ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.. మీరు ఓటు వేయండి.. ప్రతి ఒక్కరితో ఓటు వేయించండి అని సూచించారు ముఖేష్ కుమార్ మీనా. “దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడం యువత…

Read More

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్ వద్దకు వచ్చానని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సిఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలో హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని లేదంటే, రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని సవాల్ చేశారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, హామీల అమలుపై సిఎం అమరవీరుల స్తూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, ఎంఎల్‌సి శంభీపూర్ రాజుతో హరీశ్ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. అయితే, హరీష్‌రావు చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామ లేఖ అంటున్నారని, కానీ, స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే…

Read More

ఈవీఎంలను అనుమానించిన ప్రతిపక్ష నేతలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బిహార్‌లోని అరారియా, ముంగేర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం ప్రకటించారు.  ‘‘ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం’’ అని వ్యాఖ్యానించారు.  ఇక ప్రతిపక్ష పార్టీలు తమకు ఎంతో ఇష్టమైన ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని  ప్రధాని ఆరోపించారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలకు మళ్లించడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని.. ఇది మోదీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. దేశ వనరులపై తొలి హక్కు పేదలకే ఉంటుందని స్పష్టం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఇతర ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకొని.. పేదలు, వెనకబడిన వర్గాలు, దళితుల ఓటు హక్కును హరించేవారని ఆరోపించారు. ఈవీఎంలు వచ్చిన తర్వాత వారి ఆటలు…

Read More

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారెంటీ మేరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అశోక్ నగర్ జిల్లాలోని పిప్రయ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సలో ఆయన ప్రసంగిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు(షరియా చట్టాలు)ను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. బుజ్జగింపు కోసం రాహుల్ గాంధీ ఏమైనా చేయవచ్చని, కాని బిజెపి ఉన్నంత వరకు పర్సనల్ లా బోర్డును అనుమతించబోదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ తరహాలోనే దేశవ్యాప్తంగా యుసిసిని అమలు చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, దీన్ని చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మావోయిస్టు తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని మోడీ ప్రభుత్వం అంతం చేసిందని అమిత్ షా తెలిపారు. 2019లో ఒక్క కలంపోటుతో రాజ్యాంగంలోని 370వ అధికరణను మోడీ ప్రభుత్వం…

Read More

బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని కొండా సురేఖను హెచ్చరించింది. ఇతర పార్టీలను, నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈనెల 1న వరంగల్‌లో మీడియా సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. అధికారం లేకనే కేసీఆర్, కేటీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని పేర్కొన్నారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‌లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశాడని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని అందువల్లే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చాడే తప్పా, రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు…

Read More

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ప్రొటోకాల్‌లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం.. ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం.. పేపర్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు…

Read More