Author: Editor's Desk, Tattva News

గాంధీ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు తెలుస్తున్నది. అక్కడి నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేయమని గత కొంతకాలంగా పార్టీ పెద్దలు వత్తిడి తెస్తున్నా అందుకు విముఖంగా ఉన్నట్లు చెబతున్నారు. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం ఉండడంతో ఆమెపై పోటీకి బలమైన అభ్యర్థిని ఎంచుకోవడం కోసం బిజెపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభీత్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనతో మాటమాత్రమైనా చెప్పకుండా ఆ నియోజకవర్గం తనకు కాకుండా కాంగ్రెస్ నుండి వచ్చిన నేతకు కేటాయించడం పట్ల ఆగ్రహంగా ఉన్న ఆయన తన సోదరి ప్రియాంకపై పోటీకి సిద్ధంగా లేరని స్పష్టం అవుతుంది. అక్కడి నుండి పోటీ చేసేందుకు కుమారుడు వరుణ్ గాంధీని ఒప్పించమని మాజీ కేంద్ర మంత్రి మానేక గాంధీని పార్టీ…

Read More

ఎనన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం … పత్రా చాల్‌ కేసుకు సంబంధించి రూ.73.62 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. ఇది ముంబైలోని గోరేగావ్‌లో గురు ఆశిష్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న పత్రా చాల్‌ ప్రాజెక్ట్‌ రీడెవలప్‌మెంట్‌లో అక్రమాలకు సంబంధించిన కేసు. అటాచ్‌ చేసిన ఆస్తుల్లో పాల్ఘర్‌, దపోలి, రారుగఢ్‌, థానే, చుట్టుపక్కల ఉన్న నిందితుడు ప్రవీణ్‌ రౌత్‌, అతని సన్నిహితుల అనేక ల్యాండ్‌ పార్శిల్స్‌ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఎంహెచ్‌ఎడిఎ, ముంబై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా 1860 ఐపిఎస్‌ లోని వివిధ సెక్షన్ల కింద జిఎసిపిఎల్‌, రాకేష్‌ కుమార్‌ వాధావన్‌, సారంగ్‌ కుమార్‌ వాధావన్‌, ఇతరులపై ఈడి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 11 డిసెంబర్‌ 2020తేదీ ఛార్జ్‌ షీట్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించబడింది. 672 మంది అద్దెదారుల పునరావాసం కోసం పత్రా చాల్‌ ప్రాజెక్ట్‌ను పునరాభివృద్ధికి అప్పగించిన జిఎసిపిఎల్‌ భారీ ఆర్థిక అవకతవకలకు…

Read More

గత రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లోపరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు దాయాది తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలను ప్రారంభించాలని పాక్ వ్యాపారవేత్తలు నుంచి డిమాండ్ మొదలైంది. ఇటీవల పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో జరిగిన సమావేశం వారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.  భారత్‌తో వాణిజ్య చర్చలు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా షెహబాజ్ షరీఫ్ బంగ్లాదేశ్‌ ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు భారం అనుకున్న దేశాన్ని చూసి సిగ్గుపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే మార్గాలపై చర్చించేందుకు గాను వ్యాపారవేత్తలతో షెహబాజ్‌ షరీఫ్‌ పాక్ వాణిజ్య రాజధాని కరాచీలో బుధవారం భేటీ అయ్యారు.  వ్యాపారులతో గంటపాటు చర్చించిన అనంతరం.. వారి ప్రశ్నలు, సలహాలు, సూచనలకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, ఆరీఫ్‌ హబీబ్‌ అధినేత మాట్లాడుతూ.. దేశంలోని రాజకీయ…

Read More

ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీస్ విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా “ఫెయిర్ ప్లే” యాప్‌లో ప్రదర్శించిన కేసులోఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చింది. ఈ నెల 29న సైబర్ విభాగం ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడంతో ‘వయాకామ్’ మీడియాకు రూ. కోట్ల మేర నష్టం జరిగిందని సైబర్ విభాగం వెల్లడించింది. ఇదే కేసులో ఇటీవల మరో నటుడు సంజయ్ దత్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 23నే విచారణకు రావాలని ఆదేశించగా, ఆయన గైర్హాజరయ్యారు. ఆ సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని కోరారు. ఈ ఫెయిర్‌ప్లే యాప్ అనేది మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఎలాంటి అధికారిక బ్రాడ్ కాస్టింగ్…

Read More

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లలో శుక్రవారం రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగింది. ఇలా తొలి దశ పూర్తి చేసుకున్న రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ జరగబోతోంది. అలాగే మరికొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేపు ఒకే దశలో పోలింగ్ కూడా జరగబోతోంది. ఇందుకోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రెండో దశ పోలింగ్ జరగబోతున్న 89 లోక్ సభ సీట్లలో 2019 ఎన్నికల్లో బీజేపీ 55, కాంగ్రెస్ 18 సీట్లు గెల్చుకున్నాయి. ఈ 89 సీట్లలో 9 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వుడు సీట్లు కూడా ఉన్నాయి. 2019లో ఎన్డీయే కూటమి పార్టీలు వీటిలో 61 సీట్లను గెల్చుకోగా.. ఇప్పుడు ఇండియా కూటమిగా ఏర్పడిన పార్టీలు 23 సీట్లు గెల్చుకున్నాయి. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితుల్లో చాలా…

Read More

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంబంధిత వర్గాల తెలిపాయి. ఈ అంశంపై ఏప్రిల్‌ 26 తర్వాత పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. ఈ రెండు స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు మే 3 ఆఖరు తేదీ కాగా దానికి రెండు రోజుల ముందే రాహుల్‌, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామినేషన్‌ వేసే అవకాశాలున్నట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఆయా స్థానాల్లో ప్రచారం మొదలు పెట్టడానికి ముందు వీరు అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్‌ దూరంగా ఉన్న నేపథ్యంలో రాహుల్‌, ప్రియాంక అక్కడకి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్‌ గాంధీ ఇప్పటికే కేరళ వయనాడ్‌ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వయనాడ్‌లో పోలింగ్‌ జరిగే శుక్రవారమే అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఈసీ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం లేదా భాష ప్రాతిపదికన ఆయన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి.  కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై  వారిని కాకుండా వారి పార్టీల అధ్యక్షులు జెపి  నడ్డా, మల్లికార్జున్‌ ఖర్గేల  నుంచి ఎన్నికల సంఘం సమాధానాలు కోరింది. మోదీ, రాహుల్ ప్రసంగాలపై వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ ఈ నోటీసులు పంపింది.  ఈ ఫిర్యాదులలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. మతం, కులం, వర్గం, భాషల ప్రాతిపదికన ప్రజల మధ్య విద్వేషాలు, చీలికలు పెంచేలా ఈ నేతలు పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం రెండు పార్టీల అధ్యక్షులకు ఎన్నికల…

Read More

పదేళ్ల నరేంద్ర మోదీ పరిపాలనలో దేశంలో ఆర్ధిక వ్యత్యాసాలు పెరిగిపోయాయని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ వ్యత్యాసాలను తగ్గిస్తామని భరోసా ఇచ్చేందుకు ఉపయోగించిన పదజాలం ఇప్పుడు వివాదాస్పదంగా మారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు శ్యామ్‌ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసారు. దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారి ఆస్తుల్లో మెజారిటీ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలని కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘అమెరికాలో వారసత్వ పన్ను అనేది ఉన్నది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సంపద ఉందనుకొందాం. ఆ వ్యక్తి మరణిస్తే.. ఆ సొత్తు అంతా వారసులకు వెళ్లదు. సంపదలో 45…

Read More

ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్‌కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది. వీటికి ఎన్నికల కమిషన్‌ అధికారులు బదులివ్వగా, తీర్పును వాయిదా చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడం ద్వారా సరిపోల్చాలని దాఖలైన పిటిషన్లను బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్లను ఏప్రిల్‌ 18న విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. బుధవారం తీర్పు ఇవ్వాల్సి ఉండగా.. ఈవీఎంల పనితీరుపై మరిన్ని సందేహాలు ఉన్నందున ముందుగా స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈవీఎంల పనితీరును ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ అధికారులు కోర్టుకు నివేదించగా.. ఐదు సందేహాలను కోర్టు లేవనెత్తింది. ‘మైక్రోకంట్రోలర్‌ కంట్రోలింగ్‌ యూనిట్‌లో ఉంటుందా? వీవీప్యాట్‌లో ఉంటుందా? అని ప్రశ్నించింది. మైక్రోకంట్రోలర్‌ ఒకసారి మాత్రమే ప్రోగ్రామ్‌ చేసేదేనని నిర్ధారిస్తారా ? సింబల్‌…

Read More

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బుధవారం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌లో ఒక మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండ్, ముగ్గురు మహిళలు ఉన్నట్లు దంతెవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్ తెలిపారు. హుర్రేపాల్ పంచాయత్ మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌గా పనిచేస్తున్న హిడ్మా ఓయం(34)తోపాటు అదే సెక్షన్‌లో డిప్యుటీ కమాండర్‌గా పనిచేస్తున్న సంబటి ఓయం(23), నిషిద్ధ మావోయిస్టు పార్టీ కాకడి పంచాయత్ క్రాంతికారి మహిళా ఆదివాసి సంఘటన్ ఉపాధ్యక్షురాలు గంగి మడ్కం(23), హుర్రేపాల్ పంచాయత్ సభ్యురాలు హంగి ఓయం(20) లొంగిపోయిన నక్సలైట్లలో ఉన్నారు. పోలీసులు, సిఆర్‌పిఎఫ్ అధికారుల ఎదుట 18 మంది నక్సల్స్ తమ ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని ఎస్‌పి చెప్పారు. దక్షిణ బస్తర్‌లోని మావోయిస్టులకు చెందిన భైరంగఢ్, మలంగెర్ ఏరియా కమిటీలలో వీరంతా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. మావోయిస్టుల సిద్ధాంతంలో నిస్పృహ చెంది వారంతా తమకు తాముగా లొంగిపోయారని, వారికి పునరావాస ప్యాకేజీ కల్పిస్తామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పటి వరకు…

Read More