Author: Editor's Desk, Tattva News

కాంగ్రెస్ హయాంలో ‘హనుమాన్ చాలీసా’ వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థాన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ ఏడాది తొలిసారిగా ‘రామనవమి’ సందర్భంగా రాష్ట్రంలో శోభా యాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు. టాంక్-సవాయ్ మథోపూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా నిత్య పారాయణం చేసే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రామనవమిని కాంగ్రెస్ నిషేధించిందని గుర్తు చేశారు.  హనుమాన్ జయంతి గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నప్పుడు కొద్ది రోజుల క్రితం నాటి ఒక ఫోటో తనకు గుర్తుకువచ్చిందని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల ఒక వ్యాపారి తన దుకాణంలో కూర్చొని హనుమాన్ చాలీసా వింటుండగా కొందరు వ్యక్తులు అతిదారుణంగా అతన్ని చితకబాదారని గుర్తుచేశారు. ”2014లో మీరు ఢిల్లీకి సేవ చేసే అవకాశం మోదీకి ఇచ్చారు. దేశం ఎన్నడూ ఊహించని ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ అధికారంలో…

Read More

న్యాయ వృత్తికి పరిపక్వత గల వ్యక్తులు అవసరమని సుప్రీంకోర్టు సోమవారం అభిప్రాయపడింది. 12వ తరగతి తర్వాత ప్రస్తుతమున్న ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుకు బదులుగా మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సును ప్రవేశపెట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ)కు ఆదేశౠలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి (బ్యాచిలర్ ఆఫ్ లా) కోర్సు బాగానే పనిచేస్తోందని, దానిలో మార్పులు చేయాల్సిన అవసరం ఏమీ లేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అసలు మూడేళ్ల కోర్సు అవసరం ఏమిటి? హైస్కూలు పూర్తి చేసుకున్న వెంటనే ప్రాక్టీసు(న్యాయవాద) ప్రారంభించేస్తారు. నా దృష్టిలో ఐదేళ్లు కూడా చాలా తక్కువే అని సిజెఐ వ్యాఖ్యానించారు. న్యాయవాద వృత్తిలోకి మరింత పరిపక్వత చెందిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉందని, ఐదేళ్ల…

Read More

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో  పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను సోమవారం సాయంత్రం అందించారు. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. వెంకయ్యనాయుడుతో పాటు సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం), ప్రముఖ నటి వైజయంతీమాల, సుప్రసిద్ధ నాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్ కు ఎంపికయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (పద్మ భూషణ్), ప్రముఖ గాయని ఉషా ఉతుప్…

Read More

భారతీయ మసాలా పౌడర్ల బ్రాండ్లు ఎవరెస్ట్, ఎండీహెచ్ పై తాజాగా సింగపూర్, హాంకాంగ్ నిషేధం విధించాయి. వీటిలో క్యాన్సర్ కారక పదార్దాలు ఉన్నాయని నిర్ధారణ కావడంతో ఈ రెండు దేశాలు, ఈ రెండు బ్రాండ్లను నిషేధించాయి. ఇప్పటికే భారత్ లో భారీగా అమ్ముడవుతున్న ఈ రెండు బ్రాండ్లను హాంకాంగ్, సింగపూర్ నిషేధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. వీటి శాంపిల్స్ ను సేకరించాలని ఆదేశాలు ఇచ్చింది. భారతీయ మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ పై హాంకాంగ్, సింగపూర్ నిషేధం విధించినా కేంద్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ ఎట్టకేలకు ఇవాళ అధికారులు స్పందించారు. దేశంలోని ఫుడ్ కమిషనర్లందరినీ అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మసాలా దినుసుల నమూనాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు.  మూడు నాలుగు రోజుల్లో దేశంలోని అన్ని సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తామని తెలిపారు.  మరోవైపు ఎండీహెచ్, ఎవరెస్ట్ మాత్రమే…

Read More

అమెరికాలో 2022 సంవత్సరంలో దాదాపు 66,000 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విధంగా వారు అమెరికా పౌరుల జాబితాలో చేరారు. గణాంకాల ప్రకారం అమెరికా సిటిజన్స్ అయిన భారతీయ సంతతి వారి సంఖ్య 65,960 అని నిర్థారణ అయింది. ఈ పరిణామంతో అమెరికాలో మెక్సికో తరువాత భారతదేశమే అమెరికాకు అతి పెద్ద రెండవ మానవ వనరుల దేశపు స్థాయిలో చేరింది. సంబంధిత కీలక విషయాలను చట్టసభల సంబంధిత కాంగ్రెషనల్ రిపోర్టులో నివేదించారు. 2022లో లెక్కల ప్రకారం అమెరికాలో దాదాపు 46 మిలియన్ల విదేశీ సంతతి వారు నివసిస్తున్నారు. ఈ విధంగా వీరి సంఖ్య మొత్తం అమెరికా జనాభా 333 మిలియన్లలో దాదాపుగా 14 శాతం వరకూ ఉంది. అమెరికా జనాభా లెక్కల సంబంధిత కమ్యూనిటి సర్వే డాటా మేరకు ఈ విషయం స్పష్టం అయింది. కాగా 2022లో అమెరికా పౌరసత్వం పొందిన విదేశీ సంతతి వారి సంఖ్య…

Read More

పశ్చిమ్ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ 2016 టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో సంచలన తీర్పును వెలువరించింది కోల్కతా హైకోర్టు. మొత్తం 25,753 టీచర్ల ఉద్యోగాలను రద్దు చేసింది! అంతేకాదు ఇప్పటివరకు వారందరు తీసుకున్న వేతనాలను 12శాతం వడ్డీతో సహా తిరిగివ్వాలని తేల్చిచెప్పింది. “ఓఎంఆర్ షీట్లను నింపకుండా సబ్మీట్ చేసి, అక్రమంగా టీచర్ ఉద్యోగాన్ని సంపాదించిన వారందరు.. నాలుగు వారాల్లో, ఇప్పటివరకు తీసుకున్న జీతాలు తిరిగిచ్చేయాలి. టీచర్ల నుంచి డబ్బులు సేకరించే బాధ్యత జిల్లా మెజిస్ట్రేలకు అప్పగిస్తున్నాము,” అని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ దీబాంగ్షు బసక్, జస్టిస్ షబ్బర్ రషిది నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ పూర్తి టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన నియమాక ప్రాసెస్పై దర్యాప్తు చేపట్టాలని, 3 నెలల్లో రిపోర్టును సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఇలా 25వేలకుపైగా ఉద్యోగాలను తొలగించినప్పటికీ మళ్లీ రిక్రూట్మెంట్ నిర్వహించాలని, సంబంధిత ప్రక్రియను త్వరగా మొదలుపెట్టాలని పశ్చిమ్…

Read More

భారతీయ జనతా పార్టీ(బిజెపి) లోక్ సభ ఎన్నికల్లో తొలి విజయం సాధించి ఖాతా తెరిచింది. గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నామినేషన్ ల తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థిత్వం తిరస్కారానికి గురికావడంతో బిజెపి అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ 21న జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. తాము ఆ పత్రాలపై సంతకాలు చేయలేదని వారు స్పష్టం చేశారు.  పైగా, తాము సంతకాలు చేయలేదని పేర్కొంటూ రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ ను సమర్పించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. చేతివ్రాత నిపుణిడితో ఆ సంతకాలు వారే చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆధారాలు సమ్పరించినా…

Read More

తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలలో జరిగిన ఎన్నికల సభల్లో ఆయన ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.  ‘సజ్జల పులివెందుల నుంచి వచ్చారో.. ఫ్యాక్షన్‌ నేపథ్యం నుంచి వచ్చారో తెలియదు, సింహం సింగిల్‌గా వస్తుందంటాడు.. కానీ రాష్ట్రాన్ని దోచుకున్న పందుకొక్కల సమూహం మీది. మీ అందరికీ డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువయ్యాయి. సజ్జలను హెచ్చరిస్తున్నా.. మా అన్న చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికి గానీ, శెట్టి బలిజ, కాపు, ఎస్సీ, ఎస్టీ.. ఇలా ఏ సామాజికవర్గం జోలికి గానీ వచ్చినా ఊరుకోను’ అని హెచ్చరించారు.  చిరంజీవి జనసేనకు రూ.5 కోట్లు ఇచ్చి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ను కూడా విరాళం ఇవ్వమని చెప్పినందుకు రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ (అనకాపల్లి…

Read More

ఇరాన్ హొర్ముజ్ జల సంధిని అడ్డుకుంటే ఆయిల్, ఎల్‌ఎన్‌జి ధరలు పెరిగే అవకాశం ఉందని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చునని ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ జల సంధి ద్వారానే భారత్ వంటి దేశాలు సౌదీ అరేబియా, ఇరాక్, యుఎఇ నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటుంటాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గత కొన్ని రోజులలో ముదిరింది. ఇరాన్ మొదట ఇజ్రాయెల్‌పై డ్రోన్, రాకెట్ దాడులు జరిపింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ క్షిపణిని ఆ దేశంపై ప్రయోగించింది. ఆ యుద్ధం దరిమిలా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు సుమారు 90 డాలర్ల శ్రేణిలో సాగుతున్నాయి. యుద్ధం తీవ్రత తగ్గించేందుకు కృషి జరిగితే సంక్షోభం అదుపులోకి వస్తుందని, అయితే, ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా హొర్ముజ్ జల సంధిని అడ్డుకున్న పక్షంలో ఆయిల్, ఎల్‌ఎన్‌జి ధరలు పెరుగుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక పత్రంలో సూచించింది. హొర్ముజ్…

Read More

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆదివారం రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఆయన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు ‘ఇంతకుముందు వాళ్లు(కాంగ్రెస్‌) అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారు. అంటే ఈ సంపద మొత్తాన్ని వారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి, చొరబాటుదారులకు పంచేస్తారు’ అని ప్రధాని ధ్వజమెత్తారు. ‘తల్లులు, చెల్లెళ్ల దగ్గర ఉన్న బంగారం లెక్క తీస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చెప్తున్నది. ఈ సంపదను పంచేస్తారు. సంపదపై ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం చెప్పింది. ఈ అర్బన్‌ నక్సల్స్‌ ఆలోచన నా తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలను కూడా వదలదు’ అని మోదీ హెచ్చరించారు. కాగా…

Read More