ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపిందన్న అనుమానంతో ఇరాన్ శుక్రవారం తెల్లవారుజామున తన అణు స్థావరం, వైమానిక కేంద్రం ఉన్న ఇస్ఫాహన్ నగరంలో స్వీయ రక్షణ శ్రీఇపణులను ప్రయోగించింది. ఎవరూ ఊహించని రీతిలో గత శనివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపడంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఇస్ఫాహన్‌లోని అణు కేంద్రం వద్ద గాలిలో డ్రోన్లు ఎగురుతున్నాయన్న అనుమానంతో వాని ధ్వంసం చేసేందకు ఇరాన్ క్షిపణులను పేల్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ అధికారి ఎవరూ ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఈ వార్తలను నిర్ధారించలేదు. అమెరికా అధికారులు సైతం శుక్రవారం తెల్లవారుజామున దాడిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించినప్పటికీ అమెరికా ప్రసార మాధ్యమాలు మాత్రం ఇజ్రాజెల్ ప్రతీకార దాడి నిజమేనని అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ…
Author: Editor's Desk, Tattva News
నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఓటర్లు తమ ఓటు బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. శుక్రవారం నాగాలాండ్‌లో ఆరు తూర్పు జిల్లాలో ఏ ఒక్క బూత్‌లోనూ ఒక్కటంటే ఒక్క ఓటు నమోదు కాలేదు. పోలింగ్ సిబ్బంది ఓపికగా దాదాపు తొమ్మిది గంటల పాటు వేచి చూసినా జనం రాకడ లేకుండా పోలింగ్ ఘడియలు గడిచిపోయాయి. తమకు సరిహద్దు ప్రాంతపు నాగాలాండ్ (ఎఫ్‌ఎన్‌టి) ఏర్పాటు చేయాలని ఈ జిల్లాల వారు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ సాధనకు ఈ పోలింగ్ రోజును ఎంచుకుని హర్తాళ్ పిలుపు ఇచ్చారు. ఏడు గిరిజన సంస్థల సమ్మిళిత వేదిక ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఇఎన్‌పిఒ) పిలుపు ప్రభావంతో తూర్పు జిల్లాలలో జనజీవితం స్తంభించింది. ఎక్కడా వాహన సంచారం లేదు. పలు వ్యాపార సంస్థలు కార్యాలయాలు మూతపడ్డాయి. కేవలం జిల్లా అధికార యంత్రాంగం, ఎమర్జెన్సీ విభాగాల వాహనాలే రోడ్లపై తిరుగుతూ కన్పించాయి. కాగా ఈ జిల్లాలోని 738 పోలింగ్ కేంద్రాలలో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్‌కు ముందు, కోడ్ సమయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఫిర్యాదులు అందాయి. ఉమ్మడి కడప జిల్లాలో మార్చి 31న ప్రజారవాణా శాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, మరికొందరితో కలిసి వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయాలని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేశారని ఫిర్యాదులు చేశారు. వైఎస్సార్‌సీపీ అనుకూలంగా కరపత్రాలు పంచారని.. మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ…
20 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు వస్తానంటే తాను ఇప్పుడే వద్దని చెప్పానని ప్రతిపక్ష నేత, బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు గురువారం బి. ఫారంలతో పాటు రూ 95 లక్షలు చొప్పున చెక్ లను అందజేస్తూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాధించటం కష్టమే అనిపిస్తోందని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వానికి బిఆర్ఎస్ నుండి కాకుండా బిజెపి నుండి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. “నాడు బీఆర్ఎస్ పార్టీకి వంద మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగానే సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ యత్నించింది. అలాంటిది మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా?” అని నేతలతో అన్నట్లు సమాచారం. బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లినవారు బాధపడుతున్నారని, అక్కడ పరిస్థితి ఏం బాగాలేదని చెప్పారని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. …
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాయి దాడి కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో పాటు సీసీ పుటేజీని పరిశీలించిన తర్వాత సతీశ్ ను అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గురువారం సతీశ్ ను కోర్టులో ప్రవేశపెట్టగా 17వ తేదీ నిందితుడు సతీశ్ ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. సతీశ్ ఫోన్ కూడా సీజ్ చేశామని తెలిపారు. సీఎం జగన్ ను చంపాలన్న ఉద్దేశం ఉందంటూ ఇందులో ప్రస్తావించారు. ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. డాబా కోట్ల సెంటర్ లో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడని తెలిపారు. అక్కడ తోపులాట ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. వివేకానంద స్కూల్ పక్కనున్న బెంచ్ దగ్గరకు వెళ్లి సతీశ్ రాయితో దాడి చేశాడని వివరించారు. ఈ కేసులోని ఏ2…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. వైఎస్ వివేకా హత్యపై ఇకపై ఎవరూ మాట్లాడకూదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్థావన తీసుకురావడానికి వ్యతిరేకంగా వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకా హత్య విషయంపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని సురేష్ బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కడప కోర్టు వివేకా హత్య ప్రస్థావన తీసుకురావొద్దని వైఎస్ సునీత, షర్మిల, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, పురందేశ్వరిలను న్యాయస్థానం ఆదేశించింది.తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను అజెండాగా చేసుకుని కడప లోక్ సభ సీటులో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తుండటం, వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ తో పాటు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ…
దేశం వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోలాహాలంగా నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలకు ఏడు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరుగుతున్నది. తొలి దశలో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక.. ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో, రాజస్థాన్‌లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 5 చొప్పన స్థానాలు.. బిహార్, పశ్చిమ బెంగాల్‌లో 3 స్థానాల చొప్పున.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 లోక్ సభ స్థానలతో పాటు ఛత్తీగఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర , జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్ సభ స్థానాలకు రేపు ఉదయం నుంచి సాయంత్రం అయిదు గంటలవరకు…
బిట్ కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో జుహూ లోని ఓ నివాస ఫ్లాట్ శిల్పాశెట్టి పేరు మీద ఉన్నట్టు తెలిపింది. దీంతోపాటు పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్టు వెల్లడించింది. ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్ కాయిన్ ఫోంజీ స్కీమ్’ ను నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్‌ఎం) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో సంస్థ , దాని ప్రమోటర్లపై…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుకునేందుకు ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెర కలిపిన టీ తాగుతున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. తన షుగర్ లెవల్స్ ను నిరంతరం పర్యవేక్షించాలని, తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించింది. కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, ఆయన రెగ్యులర్ గా డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉందని కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు. వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులను సంప్రదించే అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. ‘డయాబెటిస్ ఎక్కువగా ఉందని చెబుతున్న వ్యక్తి.. రోజూ మామిడి పండ్లు తినడం, స్వీట్లు తినడం, పంచదారతో టీ తాగడం చేస్తున్నారని కేజ్రీవాల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ కోర్టుకు తెలిపింది. బెయిల్ పొందడానికే ఆయన ఇవన్నీ…
రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3-6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దదేవళాపురం (నంద్యాల జిల్లా) 44.9, రావికమతం (అనకాపల్లి), రామభద్రపురం (విజయనగరం), దొనకొండ (ప్రకాశం), మంగనెల్లూరు (తిరుపతి)ల్లో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పు గోదావరి…