దేశ రాజధానిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా విజృంభించింది. ఆఫీసులో 50 మందికి మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా బారిన పడిన వారిలో సెక్యురిటీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల కోసం మంగళవారం బీజేపీ కార్యాలయంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా, యుపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యకుడు జెపి నడ్డా, సీనియర్ మంత్రులు రాజ్ నాఁథ్ సింగ్, నితిన్ గడ్కరీలు సహా పలువురు కేంద్ర మంత్రులు, నాయకులకు కరోనా సోకింది.
తాజాగా ఇప్పుడు పార్టీ ఆఫీసులో కరోనా కేసులు రావడంతో బీజేపీ నేతలంతా అప్రమత్తం అవుతున్నారు. క్వారంటైన్ లో ఉండి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి 12 వ తేదీ లోపు దాదాపుగా 1700 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. మరోవైపు ఢిల్లీలో ప్రైవేటు కార్యాలయాలన్నింటిని బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది.
కేవలం హెల్త్, మీడియా వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసిన వారికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. నగరంలో బార్లు, రెస్టారెంట్లు కూడా మూయించి వేశారు. తాజాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ ఢిల్లీలో రోజువారి కరోనా కేసులు 20,000 కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
అయితే పాజిటివిటీ రేటు దాదాపు 25% వద్ద నిలకడ ఉందని, ఇది మంచి సంకేతమని తెలిపారు. అలాగే, గత 4 నుంచి 5 రోజులుగా హాస్పిటల్ అడ్మిషన్ రేటు పెరగలేదని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే రిస్ట్రిక్షన్స్ లో కొంత రిలీఫ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.