ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పడిన సమాజ్‌వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమిని ప్రస్తావిస్తూ వారిద్దరూ ఎంతకాలం కలిసి ఉంటారని అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. “సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌జీ నిన్న తాను, ఆర్ఎల్డి అధ్యక్షుడు జయంత్ చౌదరి ‘సాథ్-సాత్’ అని చెప్పుకున్నారు.(కలిసి), అయితే ఎంతకాలం?” అని ప్రశ్నించారు.
యాదవ్, ఆర్ఎల్డి చీఫ్‌ల కలయికను ఆయన అపహాస్యం చేస్తూ ఈ పార్టీల నాయకులను ఎన్నికలు ముగిసే వరకు మాత్రమే కలిసి చూస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడితే ఆజంఖాన్, అతిక్ అహ్మద్ లాంటి వాళ్లు కేంద్రాన్ని నిలదీస్తారని, చౌదరి ఎక్కడా కనిపించరని స్పష్టం చేశారు.
“ప్రభుత్వం ఏర్పడితే, జయంత్ భాయ్ వెళ్లిపోతారు. ఆజం ఖాన్ (అతని స్థానంలో) కూర్చుంటాడు. అతని (అఖిలేష్)తో జయంత్ కనిపించడు. అతిక్ అహ్మద్ కూడా వస్తాడు. ప్రజలను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు? టిక్కెట్ల పంపిణీ భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలియజేస్తోంది’’ అని కేంద్ర మంత్రి తెలిపారు
గత వారం, జయంత్ చౌదరికి బిజెపి తలుపులు ఇంకా తెరిచి ఉన్నాయని సూచించింది. “జయంత్ చౌదరి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు… ఎన్నికల తర్వాత కూడా అవకాశాలు తెరుచుకున్నాయి. అతను మా వద్దకు రావాలని మేము కోరుకున్నాము, కానీ అతను మరొక ఇంటిని ఎంచుకున్నాడు” అని జాట్ నాయకులతో జరిగిన సమావేశంలో అమిత్ షా చెప్పిన్నట్లు బిజెపి ఆ తర్వాత తెలిపింది.
ఈలోగా, ముజఫర్‌నగర్‌లో ఓటర్లను ఉద్దేశించి, అమిత్ షా యాదవ్‌పై నేరుగా విరుచుకుపడ్డారు,. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం ఉన్న శాంతి భద్రతల గురించి “అబద్ధాలు” ప్రచారం చేస్తున్నప్పుడు యాదవ్‌కు “సిగ్గు” లేదని ఆరోపించారు. గత హయాంలో విజృంభించిన నేరస్తులను, మాఫియాలను తమ ప్రభుత్వం తరిమికొట్టిందని గుర్తు చేశారు.
ఎస్పీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రభుత్వాల హయాంలో కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారి హయాంలో మాఫియా విజృంభిస్తున్న తీరు, శాంతిభద్రతల గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు.
హోంమంత్రి ప్రస్తుత ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో, ఆయనకున్న ముందున్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరిగిన తులనాత్మక నేర గణాంకాలను కూడా బయట పెట్టడానికి తాను సిద్ధమని తెలిపారు. అయితే, తన పాలనలో జరిగిన నేరాల వివరాలతో అఖిలేష్ ధైర్యం చేసి రావాలని ఆయన సవాల్ చేశారు.
“గూండాలందరూ (పోకిరి) ఉత్తరప్రదేశ్ సరిహద్దు నుండి పారిపోయారు. మా హామీ మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గూండాలను, మాఫియాలను తరిమికొట్టింది. బెహెన్జీ పార్టీ (బిఎస్పి) అధికారంలోకి వచ్చినప్పుడు, అది ఒక కులం గురించి మాట్లాడింది, కాంగ్రెస్ ఒక కుటుంబం గురించి, అఖిలేష్‌జీ గూండాలు, మాఫియాలు, బుజ్జగింపుల గురించి మాట్లాడింది. కానీ బిజెపి భద్రత. అభివృద్ధి గురించి మాట్లాడింది, ”అని ఆయన వివరించారు.
ఎస్పీ హయాం (2012-17)తో పోల్చితే బిజెపి పాలనలో కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీ కేసులు గణనీయంగా తగ్గాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి మద్దతు కోరుతూ, అమిత్ షా ప్రముఖ జాట్ నాయకుడు దివంగత ప్రధాని చౌదరి చరణ్ సింగ్, రైతుల నాయకుడు మహేంద్ర సింగ్ టికైత్లను గుర్తు చేస్తూకొంటూ, 2013 ముజఫర్‌నగర్ అల్లర్లను ఎవరైనా మరచిపోగలరా? అని ప్రశ్నించారు.
అల్లర్ల సమయంలో పోలీసులు ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించారని ఆరోపిస్తూ, “బాధితులను నిందితులుగా చేసి, బాధితులను నిందించారు. వేల సంఖ్యలో నకిలీ కేసులు పెట్టారు. పార్టీ నాయకుడు సంజీవ్ బలియన్ ఆధ్వర్యంలో పనిచేసి న్యాయస్థానాలు, రోడ్లపై ‘న్యాయ్ కి లడై’ (న్యాయం కోసం పోరాటం) పోరాడిన బిజెపిని నేను అభినందిస్తున్నాను. నేను ముజఫర్‌నగర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజలను అల్లర్లను మరచిపోయారా? అని అడగాలనుకుంటున్నాను. అదే తప్పు చేస్తే, అల్లర్లను ప్రేరేపించిన వారు లక్నోలో అధికార పీఠంపై కూర్చుంటారు. కానీ ‘కమలం’ (బిజెపి పార్టీ గుర్తు) ఎన్నికైతే, అల్లర్లు ఉండవు” అంటూ హెచ్చరించారు.
ఉత్తర ప్రదేశ్ లో 300కు పైగా సీట్లతో బిజెపి గెలుపొందాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముజఫర్‌నగర్‌లో 2013లో జరిగిన మతపరమైన హింసలో 60 మందికి పైగా ప్రజలు మరణించారు. 40,000 మంది నిరాశ్రయులయ్యారు. ప్రజాస్వామ్యంలో ‘ఓటు’ను అతిపెద్ద శక్తిగా అభివర్ణించిన అమిత్ షా, దానిని తెలివిగా ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బిజెపి ప్రభుత్వానికి దేశ భద్రత అత్యంత ప్రధానమని పేర్కొంటూ, 10 సంవత్సరాలు, సోనియా (గాంధీ), మన్మోహన్ (సింగ్) ప్రభుత్వ హయాంలో, పాకిస్తాన్ సరిహద్దు నుండి ఉగ్రవాదులు భారతదేశానికి వచ్చి భద్రతా సిబ్బందిని చంపారని అయన గుర్తు చేశారు . ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచగలవా? అని ప్రశ్నిస్తూ మోదీ నాయకత్వంలోని బీజేపీ మాత్రమే దీన్ని చేయగలదని ఆయన స్పష్టం చేశారు.
రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఇక్కడ మొత్తం 42 చక్కెర కర్మాగారాల్లో 21 ఎస్పి, బీఎస్పీల హయాంలోనే మూతపడ్డాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. “అయితే మా కాలంలో దేనిని మూసివేయలేదు. రైతులకు చెల్లింపులు జరిగాయి. చెల్లింపుల క్లియరెన్స్‌లో జాప్యం జరిగితే చక్కెర మిల్లుల నుండి వడ్డీని వసూలు చేస్తామని బిజెపి మేనిఫెస్టోలో ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాము” అని తెలిపారు.