యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారడంతో భయంతోనే ఉగ్రవాదులు పాల్పడ్డారని ఈ దాడి జరిగి మూడేళ్లయిన సందర్భంగా వెల్లడైనది.
2019 పుల్వామా దాడి జరిగినప్పుడు జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 15 కార్ప్స్కు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేజీఎస్ ధిల్లాన్ ఆ దాడికి సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు.
ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపురా సమీపంలోని లేథిపురలో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
సూసైడ్ బాంబర్
పాకిస్తానీ ఉగ్రవాద గ్రూప్ జైషే మహమూద్ కు చెందన సూసైడ్ బాంబర్ కారులో ఐఈడీతో దూసుకొచ్చి సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సును ఢీకొట్టాడు. అవంతిపుర దగ్గర జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై జరిగిన ఘటనలో 76వ బెటాలియన్ కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సును 300 కేజీల పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారుతో ఓ సూసైడ్ బాంబర్ ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
పుల్వామా దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ దురాగతానికి తామే బాధ్యులమని జైషే మహమూద్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. సూసైడ్ బాంబర్ కు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని అదిల్ అహ్మద్ దార్ గా గుర్తించారు.
అదిల్ స్వస్థలం పుల్వామా జిల్లా గుండీబాగ్. ఎటాక్ కు ఏడాది క్రితమే అతను జైషేలో చేరాడు. ఎటాక్ జరిగిన స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మారుతీ ఎకో వ్యాన్ ను రెంట్ కు తీసుకుని అదిల్ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
భద్రతా దళాల ఆపరేషన్ లతో భయం
జైష్-ఎ-మొహమ్మద్‌కు వ్యతిరేకంగా భద్రతా దళాల ఆపరేషన్ల తర్వాత ఉగ్రవాదులు భయాందోళనలకు గురయ్యారు. తీవ్రవాదులు చనిపోతారని చాలా భయపడ్డారు. అందుకే ఎవరూ కూడా నాయకత్వ పాత్రను పోషించడానికి ముందుకు రావడం లేదు. పాక్ నుండి వచ్చిన కాల్లు ఉగ్రవాదులను నాయకత్వ పాత్ర పోషించమని అడిగినా ఉగ్రవాదులు మాత్రం దాన్ని తిరస్కరించారని ధిల్లాన్.తెలిపారు.
దాడి జరిగిన 100 గంటల్లోనే పాకిస్థానీ జాతీయుడు కమ్రాన్ నేతృత్వంలోని భద్రతాదళాలు పుల్వామా దాడి వెనుక ఉన్న మాడ్యూల్‌ను తొలగించాయని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు ఐక్యంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
పాక్ సైన్యం చురుకైన భాగస్వామ్యం, మార్గదర్శకత్వం లేకుండా అక్కడివారు ఎవరూ నియంత్రణ రేఖను దాటలేరని స్పష్టం చేశారు. ఆర్మీ పోస్ట్‌కు ఎదురుగా పాక్ నియంత్రణ రేఖ నుంచి వచ్చిన పాక్ జాతీయులను గుల్మార్గ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై పట్టుకున్నామని ధిల్లాన్ తెలిపారు.
కాగా, ఈ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు 15 రోజుల తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. 2019 ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ బాలాకోట్ లోని జైషే ట్రైనింగ్ క్యాంప్ పై బాంబుల వర్షం కురిపించాయి. పుల్వామా దాడి సూత్రధారి, జైషే మహమూద్ కశ్మీ ర్ చీఫ్ మహమూద్ ఖరి యాసిర్ ను అవంతిపురాలోని పరిట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు హతమార్చాయి.