బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలున్న చోట కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లతో ఘర్షణాత్మక ధోరణులు తరచూ వెలువడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా కేరళలో సహితం రాజ్‌భవన్‌కు, పినారయ విజయన్ ప్రభుత్వంల మధ్య ఏదో ఒక అంశంపై రాజకీయ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.
అయితే అకస్మాత్తుగా రెండు వివాద అంశాలపై ఇరువురు అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదాలు తెలపడం రాజకీయ వర్గాలలో విస్మయంకు గురిచేస్తున్నది. ఇదంతా క్విడ్ ప్రోకో అంటూ ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నది.
తాజాగా, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు అదనపు వ్యక్తిగత సహాయకుడిగా ప్రముఖ జర్నలిస్ట్, బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు హరి ఎస్ కర్త నియామకం తాజా వివాదంపై కేంద్రంగా నిలిచింది. అయితే ఈ నియామకానికి, పినరయి విజయన్ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూనే ఆ విధంగా గవర్నర్ నియమించుకోవడం నిబంధనలకు విరుద్ధం అంటూ స్పష్టం చేసింది.
కేరళ చరిత్రలోనే రాజ్‌భవన్‌కు మొదటిసారిగా ఓ రాజకీయ నియామకం జరపడాన్ని సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం తన అత్తరువులో ఇది “అపూర్వమైనది” అని పేర్కొంది. గవర్నర్ స్వయంగా తన వ్యక్తిగత సిబ్బందిలో కార్తాను నియమించుకోవాలని కోరుకున్నందున మాత్రమే అందుకు అంగీకరించినట్లు తెలిపింది.
“ప్రస్తుత నిబంధనలకు కట్టుబడి ఉండటం మంచిది” అని గవర్నర్‌కు సూచించినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో రాజకీయ జోక్యంతో “నియమాలు, విధానాలను పూర్తిగా ఉల్లంఘించడం” గురించి ప్రశ్నిస్తూ తాను ఛాన్సలర్ గా ఉండబోనని బెదిరించిన గవర్నర్ ను ఈ అంశం ఒక విధంగా ఆత్మరక్షణలో పడవేసిన్నట్లయింది.
ఖాన్ ఆ తర్వాత ఛాన్సలర్ బాధ్యతలను తిరిగి చేపట్టడంతో పాటు కన్నూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్‌ను తిరిగి నియమించడం వంటి కొన్ని ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదం కూడా తెలిపారు. తాజా సంఘటన ద్వారా నిబంధనలు , విధానాలపై గవర్నర్ “ప్రమాణాలు” గురించి ప్రశ్నిపలేని పరిష్టితి ఏర్పడింది.
పైగా, రాజ్‌భవన్ వ్యవహారాలలో బీజేపీ జోక్యం గురించి వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చిన్నట్లయింది. కర్తా నియామకం కూడా ఆసక్తికరంగా జరిగింది. వాస్తవానికి గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టగానే నియమించుకున్నారు. అయితే ఆ నీయమకంకు ప్రభుత్వం ఆమోదం కోసం ఈ మధ్యనే పంపారు.
లోకాయుక్త అధికారాలకు కత్తెర వేస్తూ విజయన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపిన సమయంలో ఇది జరగడం గమనార్హం. ఆ ఆర్డినెన్సు పై సంతకం చేయవద్దని కాంగ్రెస్, బిజెపి పార్టీలు గవర్నర్ ను కోరాయి. కానీ ఆయన ఆమోదం తెలిపారు.
ఈ ఆర్డినెన్సు కు గవర్నర్ ఆమోదం తెలపకపోవచ్చని అందరూ భావిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి విజయన్ ఆయనను కలిసిన మరుసటి రోజే ఆమోదం తెలపడం జరిగింది. ఆ తర్వాత వారం రోజులు కర్తా నియామకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానితో ఈ రెండు పరిణామాల్లో క్విడ్ ప్రోకో అని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.
ఇలా ఉండగా, కర్త ను గవర్నర్ నియమించుకోవడంలో బీజేపీ ప్రమేయం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ జీ వారియర్ స్పష్టం చేశారు. “ఇది గవర్నర్ విచక్షణ. కర్తా సీనియర్ జర్నలిస్టు. వ్యక్తిగత సిబ్బందిని ఎప్పుడు నియమించుకోవాలో ఖాన్ నిర్ణయించుకోవాలి. నియామకానికి సంబంధించి కాంగ్రెస్ ఆరోపణ నిరాధారం. మేము ఆ ప్రక్రియలో పాల్గొనడం లేదు,”అని తేల్చి చెప్పారు.