పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో సంవత్సరకాలంగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న జి23 బృందంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చివరకు రాజీ ధోరణి ప్రదర్శించనున్నారు. ఈ బృందం నేత గులాబీ నబి ఆజాద్ సోనియా గాంధీని కలిసి, గంట సేపటికి పైగా సురదీర్గంగా చర్చించిన అనంతరం ఆయనకు తిరిగి పార్టీలో కీలక బాద్యక్తలు అప్పచెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
గత ఏడాదిగా పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరంగా ఉంచుతూ వస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. అయితే ఈ ఏడాది చివరిలో గాని, వచ్చే ఏడాది ప్రారంభంలో గాని జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఆయనను పార్టీ ఇన్ ఛార్జ్ గా నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది అక్కడి నుండే రాజ్యసభకు కూడా పంపగలనని సోనియా హామీ ఇచ్చిన్నట్లు చెబుతున్నారు.
ఆజాద్ తో సమావేశం పర్యవసానంగా వచ్చే నెలలో భారీస్థాయిలో ఎఐసిసిలో మార్పులు చేర్పులకు దిగాలని సోనియా గాంధీ సంకల్పించిన్నట్లు తెలుస్తున్నది పరాజయానికి కారకులుగా నిర్థారిస్తూ ఇప్పటికే ఆయా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులపై వేటేశారు. కొందరు రాజీనామాలకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో విస్తృతస్థాయి కుదుపు ఇదే అవుతోంది.
వచ్చే నెలలో ఎప్పుడైనా పార్టీ ప్రధాన విభాగం అయిన ఎఐసిసిలో భారీస్థాయి మారుపలు ఉంటాయని, సోనియా తరువాత ఇప్పటిలాగానే రెండో ప్రధాన బాధ్యతలలో రాహుల్ గాంధీ ఉంటారని వెల్లడైంది. గత లోక్ఐసభ ఎన్నికలలో పార్టీ కేవలం 44 స్థానాలను దక్కించుకుని సంతృప్తి చెందాల్సి వచ్చింది. పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు, త్వరలో జరిగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తరువాత 2014 లోక్‌సభ ఎన్నికలను లక్షంగా ఎంచుకునే పార్టీలో సమూల ప్రక్షాళనకు సోనియా సిద్ధం అయ్యారు.
మరో, అసంతృప్తి నేత, ప్రస్తుతం రాజ్యసభలో ఉపనేత ఆనంద్ శర్మను కూడా రాజ్యసభకు తిరిగి ప్రంపుతామని సోనియా హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. మరో అసంతృప్తి ఎంపీ మనీష్ తివారికి ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వడానికి సోనియా సిద్ధపడ్డారు. ఇక రాయబారం నడిపిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాకు హర్యానా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కూడా ఆమె నిర్ణయించారు. ప్రస్తుత పిసిసి అధ్యక్షురాలు షెల్జా కుమారితో ఆయనకు అసలు పొసగడం లేదు.
అయితే మరో కీలక జి23 నేత కపిల్ సిబాల్ విషయంలో మాత్రం సోనియా ఎటువంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. పార్టీ వ్యవహారాల గురించి ఆ బృందంలోని అందరితో సమాలోచనలు జరిపేందుకు ఆమె హామీ ఇచ్చారని చెబుతున్నారు. రాహుల్ ఈ ఏడాది నవంబర్ 2న పార్టీ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు తీసుకుంటారనే వార్తలపై సీనియర్ నేత జనార్దన్ ద్వివేది స్పందిస్తూ త్వరలోనే రాహుల్ గాంధీ పార్టీలో మరింతగా క్రియాశీలక పాత్ర వహిస్తారని నిర్ధారించారు. అయితే తేది సమయం తాను చెప్పలేనని చెప్పారు.