ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగ్గా అధికారంలోకి రాగలనని అంచనాలు వేసుకొని భంగపడిన సమాజవ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే పూర్తి సమయం కేటాయిస్తూ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నిర్ణయించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సంకేతం ఇచ్చారు.
అఖిలేష్ తో పాటు ఆ పార్టీ మరో ఎంపీ ఆజంఖాన్ కూడా రాంపూర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.అఖిలేష్ యాదవ్, ఖాన్ తమ అసెంబ్లీ స్థానాలను వదిలి లోక్‌సభ సభ్యత్వాన్ని నిలుపుకుంటారని ఇప్పటి వరకు ఊహాగానాలు వచ్చాయి. తన రాజీనామాకు ముందు, అఖిలేష్ యాదవ్ మార్చి 18న కర్హల్‌లో ఎస్పీ ఆఫీస్ బేరర్లు, మద్దతుదారులతో సమావేశమయ్యారు.
గెలుస్తానని నమ్మకం లేకనే అసెంబ్లీకి పోటీచేయడం లేదని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేయడంతో, మొదటిసారి అసెంబ్లీకి పోటీచేసి గెలుపొందిన ఆయన అధికారంలోకి రాలేకపోవడంతో ఆ పదవికి రాజీనామా చేస్తారని అందరు అనుకున్నారు. ఆయన పార్టీ వర్గాలు సహితం లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతారని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన లోక్‌సభ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసారు.
మంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు తెలిపారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కార్హల్ నిజయోకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో అఖిలేష్ యాదవన ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే.
ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి రాకపోయినా.. ప్రజా తీర్పును శిరసావహిస్తానని, ప్రతిపక్ష హోదాతో యోగి ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఈ సందర్భంగా చెప్పారు. అసెంబ్లీలో యోగి సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకే తాను ఎంపీ పదవికి రాజీనామా చేశానని అఖిలేష్ స్పష్టం చేశారు.
బిజెపి అభ్యర్థి సింగ్ బాఘెల్‌పై అఖిలేష్ 67 వేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అజాంఘడ్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.
తన రాజీనామాను అఖిలేష్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ ల ద్వారా ఓం బిర్లాకు పంపిన అజాంఖాన్, 10వ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన 80 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నందున సెప్టెంబర్ 2019 నుండి జైలులో ఉన్నాడు. ఖాన్ భార్య తజీన్ ఫాతిమా రాజ్యసభ సభ్యురాలు కాగా, వారి కుమారుడు అబ్దుల్లా కూడా ఈ నెలలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.