Author: Editor's Desk, Tattva News

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు పడింది. 17 ఏళ్ల క్రితం నమోదైన క్రిమినల్ కేసులో భాగంగా కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీను అరెస్టు చేశారు. 2007 నాటి క్రిమినల్‌ కేసులో విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. బిభవ్ కుమార్‌ నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌.. గురువారం ఆయనను విధుల నుంచి తొలగిస్తూ విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2007లో తన విధులు నిర్వహించకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడటంతో వైభవ్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురిపై నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసే మహేష్ పాల్ అనే ప్రభుత్వ అధికారి కేసు నమోదు చేశారు. దీంతో పోలీస్‌లు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిపాలన పరమైన చర్యలో భాగంగా సీఎం కేజ్రీవాల్…

Read More

వీసా నిబంధనలను ఉల్లంఘించి బెడ్డింగ్, కేక్ ఫ్యాక్టరీలో అక్రమంగా పనిచేస్తున్నారన్న అనుమానంపై వరుస దాడులు నిర్వహించిన బ్రిటన్‌కు చెందిన ఇమిగ్రేషన్ అధికారులు ఒక మహిళతోసహా 12 మంది భారతీయులను అరెస్టు చేశారు. చట్ట విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇంగ్లండ్‌కు చెందిన వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని ఒక బెడ్డింగ్, మ్యాట్రెస్ ఫ్యాక్టరీపై ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహంచినట్లు బ్రిటక్ అంతరంగిక వ్యవహారాల(హోం) శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారన్న అనుమానంపై ఏడుగురు భారతీయులను అరెస్టు చేసినట్లు తెలిపింది. సమీపంలోని ఒక కేక్ ఫ్యాక్టరీలో వీసా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న మరో నలుగురు భారతీయులను అధికారులు అరెస్టు చేశారని తెలిపింది. ఒక ప్రైవేట్ హోంలో వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న ఒక మహిళను కూడా అధికారులు అరెస్టు చేశారని, దాడులు కొనసాగుతున్నాయని హోం శాఖ తెలిపింది. వీరిలో నలుగురిని…

Read More

ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి అందించిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఆర్‌టిఐ చట్టం కింద వెల్లడించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) నిరాకరించింది. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగత సమాచారం విశ్వసనీయమైదని ఎస్‌బిఐ తెలిపింది. వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించలేమన్నది. సుప్రీం ఆదేశాలతో ఇసికి సమర్పించిన వివరాలకు చెందిన డిజిటల్‌ డేటాను కోరుతూ ఆర్‌టిఐ కార్యకర్త కమోడోర్‌ (రిటైర్డ్‌) లోకేశ్‌ బాత్రా ఎస్‌బిఐకి దరఖాస్తు చేశారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద సమచారం ఇచ్చేందుకు ఎస్‌బిఐ తిరస్కరించింది. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌8(1)(ఇ), సెక్షన్‌ 8(1)(జే) ప్రకారం విశ్వసనీయ, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయబోమని ఎస్‌బిఐ తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నవారి, రాజకీయ పార్టీల సమాచారాన్ని వెల్లడించడం ఆ చట్టాల ప్రకారం నేరం అవుతుందని వెల్లడించింది. అలాగే ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టులో కేసును వాదించేందుకు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేకు ఎస్‌బిఐ చెల్లించిన ఫీజు…

Read More

భారత్‌, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతియుత సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ముఖ్యమని అన్నారు. దౌెత్య, మిలిటరీ స్థాయి చర్చల్లో నిర్మాణాత్మకంగా, సానుకూలంగా ఉంటే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో శాంతియుత, ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించగలవు, కొనసాగించగలవని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన న్యూస్‌వీక్‌ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘సరిహద్దుల్లో దీర్ఘకాలంగా నెలకొన్న విబేధాలు వేగంగా పరిష్కారం కావాలి.. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది.. సానుకూల చర్చల ద్వారా సరిహద్దుల్లో పొరుగుదేశాలు శాంతిని నెలకొల్పుతాయి’ అని ప్రధాని తెలిపారు.  హిందూ మహాసముద్రంలోని దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌) ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమకు వ్యతిరేకంగా క్యాడ్…

Read More

రాజకీయంగా కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కేసులో గత నెల ఈడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యూడిషల్ కస్టడీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను తాజాగా గురువారం సిబిఐ జైలు నుంచే అరెస్ట్ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆమెను కస్టడీలోకి తీసుకొని లిక్కర్ కేసుకు సంబంధించి విచారించనుంది. కవితను జైలులోనే విచారించేందుకు సీబీఐ గత వారమే ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి పొందింది. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాలను పేర్కొంది. కవిత చార్టర్డ్ అకౌంటెంట్, మరో నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్ నుంచి లభించిన వాట్సాప్ చాట్‌లు, విచారణలో లభించిన కొన్ని పత్రాలు, ఫోన్‌ల ఆధారంగా కవితను విచారించాల్సిన అవసరం ఉందని…

Read More

జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయని తణుకు వేదికగా బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్‌సిపై చేస్తామని, దాంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని, అందుకే పొత్తు పెట్టుకున్నామని వారు తెలిపారు. మధ్య తరగతి ప్రజానీకం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఇరుపార్టీల అధినేతలు హెలికాప్టర్‌లో తణుకులోని పాలిటెక్నిక్‌ కళాశాలకు, అక్కడి నుంచి రోడ్‌ షోగా నరేంద్ర సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్‌ భేషరతుగా మద్దతిచ్చారని, ఇది ఎన్నటికీ మర్చిపోనని చెప్పారు.  ఓట్లు చీలకూడదనే…

Read More

గాజాలో హమాస్‌ పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడిని సిరియాలో హిజ్బుల్లా వ్యతిరేకిస్తున్నందుకుగాను సిరియాలో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రతీకార వైమానిక దాడులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. హమాస్‌కు మద్దతు తెలిపేవారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. గాజాలో హమాస్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌ పై హిజ్బుల్లా దాడులు చేస్తోంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ కూడా ఆ మిలిటెంట్‌ సంస్థపై వైమానిక దాడులకు పాల్పడుతోంది. తాజాగా బుధవారం ఉదయం మరోసారి హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్‌ చేసుకుని ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఓ భవనంపై దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసింది. గాజాలో హమాస్‌ పై ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని హిజ్బుల్లా చాలాసార్లు వ్యతిరేకించింది. ఐడిఎఫ్‌ ఆ మిలిటెంట్‌ గ్రూప్‌పైనా దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ సోమవారం జరిపిన దాడిలో హిజ్బుల్లాలోని ప్రధాన విభాగమైన రాడ్వాన్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ అలీ అహ్మద్‌ హుస్సేన్‌ మృతి…

Read More

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై నేరాలు, బలవంతపు భూ కబ్జాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది. సిబిఐ దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షిస్తుందని చీఫ్ జస్టిస్ టిఎస్ వివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ బుధవారం ప్రకటించింది. వ్యవసాయ భూములను చట్టవిరుద్ధంగా చేపల చెరువులుగా మార్చడంపై లోతుగా దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని సిబిఐని డివిజన్ బెంచ్ ఆదేశించింది. మహిళలపై నేరాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు జరిపి నివేదికను ఇవ్వాలని సిబిఐని కోరింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసిన డివిజన్ బెంచ్ ఆలోగా నివేదికను సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్‌ను ప్రశ్నించేందుకు జనవరి 5న సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందంపై దాడి జరిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్, అతని అనుచరులు…

Read More

ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం మంత్రివర్గం నుంచి వైదొలగడంతోపాటు ఆప్ కు రాజీనామా చేశారు. పార్టీలో దళితులకు ప్రాతినిధ్యం కల్పించలేదని ఆయన ఆరోపించారు. సాంఘిక సంక్షేమ శాఖతో సహా వివిధ శాఖలను నిర్వహిస్తున్న ఆనంద్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్ర నేతలలో దళితులు ఎవ్వరూ లేరని ఆరోపించారు. ‘పార్టీ దళిత ఎంఎల్‌ఎలు, కౌన్సిలర్లు, మంత్రులను గౌరవించదు. ఇటువంటి పరిస్థితుల్లో తాము వంచనకు గురైనట్లు దళితులు అందరూ భావిస్తున్నారు. మనం సమ్మిళిత సమాజంలో నివసిస్తున్నాం. అయితే, దామాషా గురించి మాట్లాడడం తప్పు కాదు. ఈ పరిస్థితుల మధయ పార్టీలో కొనసాగడం నాకు కష్టం. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘రాజకీయాలు మారితే దేశం కూడా మారుతుందని అర్వింద్ కేజ్రీవాల్…

Read More

పంతజలి సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌, ఆ సంస్థ సిఇఒ బాలకృష్ణ క్షమాపణలను సుప్రీంకోర్టు బుధవారం మరోసారి తిరస్కరించింది. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. చర్యలకు సిద్ధం కావాలని ఆదేశించింది. ‘క్యూర్‌ ఫర్‌ కొవిడ్‌’ ప్రకటనలపై చర్యలు తీసుకోని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. రామ్‌దేవ్‌ ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగానే కోర్టు హామీని ఉల్లంఘించినట్లు జస్టిస్‌ హిమా కొహ్లీ, జస్టిస్‌ అసదుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మేము అంధులం కాదు. ఈ సమయంలో కూడా ఉదారంగా వ్యవహరించలేము ” అని వ్యాఖ్యానించారు. క్షమాపణ కాగితంపై మాత్రమే ఉందని, కానీ వారి యథావిథిగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కోర్టు చర్యల నుండి తప్పించుకునేందుకు కేవలం ఆత్మరక్షణ కోసమే క్షమాపణలు చెప్పారని మండిపడింది. రామ్‌దేవ్‌ రెండు సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించారని జస్టిస్‌ అమానుల్లా మండిపడ్డారు. క్షమాపణలను ముందుగా మీడియాకు పంపారని ధర్మాసనం పేర్కొంది. మంగళవారం సాయంత్రం 7.30 గంటల వరకు కోర్టులో…

Read More