తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం గాంధీభవన్‌న్‌లో ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మహేశ్‌కుమార్ గౌడ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో సందడి నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ వ్వవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పలువురు ఏఐసీసీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహేశ్‌కుమార్ గౌడ్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. ర్యాలీ పెద్దఎత్తున వాహనాలు, గుర్రాలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం కార్యకర్తలకు గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం…
Author: Editor's Desk, Tattva News
ట్యాంక్‌బండ్‌పై నుంచి వినాయక నిమజ్జనం లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు. ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న ఉత్సవ సమితి నాయకులు ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, భారీ కెడ్లను తొలగించారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన జాలీలను తొలగించి వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతోందని తెలిపారు. కొత్త నిబంధనలు తీసుకువచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. 2022లో, 2023లో కూడా ఇదే విధంగా ట్యాంక్‌బండ్‌పై నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం లేదని చెప్పారని, కానీ చివరకు ట్యాంక్ బండ్లోని గణేష్ నిమజ్జనాలు జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం…
తాను ప్రధాని రేసులో నిలిస్తే మద్దతు ఇస్తామంటూ ఓ కీలక ప్రతిపక్ష నేత 2024 ఎన్నికల ముందు తనకు ఆఫర్ ఇచ్చారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే, తాను ఆ ఆఫర్‌ని తిరస్కరించానని, ప్రధానిమంత్రి కావడమే తన ఆశయం కాదని చెప్పానని తెలిపారు. నాగ్‌పూర్‌లో జరిగిన జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓ సంఘటన గుర్తుందని.. తాను ఎవరి పేరు చెప్పడం లేదని పేర్కొన్నారు. మీకు ప్రధానమంత్రి కావాలని అనుకుంటే మద్దతిస్తామని చెప్పారని, దానితో తనకు మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి ? నేను ఎందుకు మీ మద్దతు తీసుకోవాలని ప్రశ్నించానని చెప్పారు. ప్రధాని కావడమే తన జీవితాశయం కాదని, విశ్వాసానికి.. తన సంస్థకు విధేయుడినని, ఈ విషయంలో తాను రాజీపడనని స్పష్టం చేశానని గడ్కరీ తెలిపారు. పదవి కంటే విశ్వాసం చాలా ముఖ్యమైందని గడ్కరీ…
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తాను రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతానని తెలిపారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రెండు రోజుల తర్వాత నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. ఢిల్లీలో ఎన్నికలకు నెలరోజుల సమయం ఉంది. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం కావాలి. ప్రజల ఆజ్ఞ మేరకే నేను…
రైతులు పండించిన ఆయిల పామ్ గెలలకు ఇకపై అధిక ధర రానుంది. దీంతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల కష్టాలు దూరం కానున్నాయి. పామ్ ఆయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంఖాన్ని పెంచడంతో ఆయిల్ పామ్ సాగు రైతులకు మంచిరోజులు రానున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అయ్యే పామ్ అయిల్‌పై దిగుమంతి సుంఖం 5.5శాతంగా నే ఉంది. ఇకపై అది 27.5శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయంగా సాగవుతున్న ఆయిల్ పామ్ గెలల ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతి సుంఖం 5.5శాతంగా ఉండడంతో ఇప్పటి వరకు విదేశాల నుంచి పామ్ ఆయిల్ పెద్ద ఎత్తున దిగుమతి అయింది. దీంతో తెలంగాణలో పండించిన పామ్ ఆయిల్ గెలలు టన్ను ధర రూ.12,000 నుంచి రూ.13వేల మధ్యనే పలుకుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా దిగుబతి 27.56శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో…
జీఎస్టీ ఎగవేతల విలువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్‌లైన్ గేమింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం… పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం, రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023-24లో ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల…
సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు ఇక నుంచి ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ఏపీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలకు స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, స్పెషల్ ప్రత్యక కార్యదర్శి ఆర్ పి సిసోడియా ప్రతిపాదనలు చేశారు. సబ్‌రిజిస్ర్టార్లు కూర్చునే కుర్చీ ఎత్తు తగ్గించడమే కాకుండా, వారి ముందుండే పోడియంను ఎత్తేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ర్టార్ ముందు ఉండే పోడియం చెక్కతో ఉంటుంది. దాని చుట్టూ ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది. సబ్‌రిజిస్ర్టార్ కుర్చీ, ఆ వ్యక్తి ముందుండే టేబుల్ చుట్టుపక్కల ఉన్న ఫ్లోరింగ్ కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి. రిజిస్ర్టేషన్ కోసం వచ్చిన…
గురుకుల పాఠశాలలో, కళాశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో చదవాలని అనుకునే వారికి 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజక వర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎన్‌ఆర్‌ఐ సెల్ సూచించింది. దీనిని తెలంగాణ ఏర్పడినప్పటి రోజు నుంచి, ఏరోజు తీసుకుంటే బాగుంటుందనే దానిపై కమిటీ లు పలువురు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ…
వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలే దేశంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పర్యటించారు. అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిశాయని చెప్పారు. ‘ఈ ఎన్నికలు జమ్ముకశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌ను విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరివారవాదులు వంచన చేయడం ప్రారంభించారు. మీరు విశ్వసించిన రాజకీయ పార్టీలు మీ పిల్లల భవిష్యత్తును పట్టించుకోలేదు. వాళ్లు వాళ్ల వారసుల భవిష్యత్తుపైనే దృష్టిపెట్టారు. జమ్ముకశ్మీర్ యువత ఉగ్రవాదంతో బాధపడింది. ఈ వారసత్వ పార్టీలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి వేడుక చూశాయి.’ అని ప్రధాని విమర్శించారు. ‘2000 సంవత్సరం నుంచి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. కొత్త నేతలకు అవకాశం ఇవ్వలేదు. అందుకే కొత్త నాయకత్వాన్ని మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నించాను. తర్వాత…
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం, హత్య కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులను కలవడానికి శనివారం కోల్ కతాలోని స్వాస్థ్య భవన్ కు చేరుకున్నారు. గత వారం రోజులుగా చర్చలకు ఆహ్వానించినా వారు వెనుకడుగు వేస్తుండడంతో ఆమె స్వయంగా వారి నిరసన శిబిరానికి వచ్చి మారితో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి వైద్యులను సంప్రదించడానికి ఇదే చివరి ప్రయత్నం అని ఆమె నిరసనకారులతో చెప్పారు. తమ డిమాండ్లను పరిశీలించి ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని ఆమె వైద్యులకు ఆమె హామీ ఇచ్చారు. సాల్ట్ లేక్ లోని స్వాస్థ్య భవన్ వెలుపల ‘మాకు న్యాయం కావాలి’ అనే నినాదాల మధ్య నిరసన తెలుపుతున్న వైద్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిగా కాకుండా మీ ‘దీదీ’ (సోదరి)గా మిమ్మల్ని కలిసేందుకు వచ్చానని చెప్పారు. మీ డిమాండ్లను అధ్యయనం చేసి…