* వామపక్షాలకూ నోటీసులుకాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18 అలాగే 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. కాగా తమపై ఐటీ శాఖ ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది. లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని వివేక్ తంఖా ఆరోపించారు. ఈ విషయంలో చట్టపరంగా పోరాడుతామని చెప్పారు. ఐటీ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఆదాయ పన్ను శాఖ నుంచి తాజాగా అందని నోటీసులపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్ నేత…
Author: Editor's Desk, Tattva News
లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయిన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్యయనంలో వెల్లడైంది. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదు కాగా, వీరిలో ఐదుగురు బీజేపీకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు కాగా, వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వారే కావడం గమన్హారం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ ఎంపీలపైనే ఎక్కువగా క్రిమినల్ కేసులు…
‘నారీ న్యాయ్’లో భాగంగా మహిళలకు ఐదు హామీలను కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే .. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. శక్తివంతమైన మహిళలు భారత భవితవ్యాన్ని మారుస్తారని ఉద్ఘాటించారు. ఇప్పటికీ ముగ్గురిలో కేవలం ఒక్క మహిళ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని, పది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క మహిళ మాత్రమే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. భారత్‌లో మహిళా జనాభా 50 శాతం కాదా, సెకండరీ, ఉన్నత విద్యల్లో మహిళల వాటా 50 శాతం లేదా.. మరి వ్యవస్థలో వారి భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. మహిళలు ‘ సగం జనాభా అయినా పూర్తి హక్కులు’ ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని తెలిపారు. దేశాన్ని నడిపించే ప్రభుత్వంలో మహిళలకు సమాన సహకారం ఉన్నప్పుడే మహిళల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగలమని తమ పార్టీ విశ్వసిస్తోందని రాహుల్ గాంధీ ఎక్స్‌లో హిందీలో ట్వీట్ చేశారు. …
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకూ మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. శుక్రవారం మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. వీటితో పాటు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చింది. కదిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదాదేవికి గతంలో టికెట్ కేటాయించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై ఉన్న నకిలీ డీడీల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేయటంతో ఇప్పుడు తిరిగి కందికుంటకే టికెట్ ఇచ్చారు. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రత్యర్థిగా చీపురుపల్లికి తొలుత ఆయన పేరు పరిశీలించారు. అయితే విశాఖపట్నం జిల్లాలో పరిధిలోనే పోటీ చేసేందుకు గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపించారు. ఇదే…
బిఆర్‌ఎస్ పార్టీ వరంగల్లు లోక్‌సభ నియోజకవ ర్గం అభ్యర్ధి అయిన డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగబోతున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి హా మీ రావడంతోనే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. పోటీలో నుంచి తప్పుకోవడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలను కూలంకషంగా వివరిస్తూ కారు పార్టీ అధినేత, మాజీ సి ఎం కెసిఆర్‌కు రాసిన లేఖను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు. ఆమె తండ్రి మాజీ మంత్రి కడియం శ్రీహరి పేరును కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా పరిశీలిస్తోందని కొందరు నాయకులు వివరించారు. ఎందుకంటే కడియం శ్రీహరి అపారమై న రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావడమే కాకుండా, ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేకపోవడం, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సుపరిచితుడు కావడం వంటి…
పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రణీత్ రావు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది. ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా, పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్‌రావు, సిఐ గట్టు మ ల్లును పోలీసులు విచారించారు. ట్యాపింగ్ వ్యవహారంలో మూలాలు కీలక ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. ఓ మాజీమంత్రి తరచూ ఆయన ఇంటికి వచ్చి వెళ్తుండేవారని స్థానికులు పోలీసులకు వివరించారు. అరెస్టయిన అధికారుల ఆస్తులు, ఆదాయాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రణీత్‌రావుకు మూసాపేటలోని నివాసంతోపాటు నగరంలో మరో చోట కోట్ల విలువైన విలాసవం తమైన గృహం ఉన్నట్లు అధికారులు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్ కోసం వినియోగించిన సామగ్రిని విదేశాల నుంచి కొనుగోలు చేశారని తేలడంతో, ఇందుకు సహకరించిన వారిపైనా…
బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, పార్టీ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు ఆ పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కేశవ రావుతో పాటు ఆయన కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పార్టీ మార్పుపై విజయలక్ష్మీతో పాటు కేకే ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. మరోవైపు పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో కేశవరావును గురువారం ఫార్మ్ హౌస్ కు పిలిపించి కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతక్కువ చేశామని ప్రశ్నించినట్టు చెబుతున్నారు. మార్చి 30వ తేదీన కేశవరావు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు పది మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.…
ఉత్తరాఖండ్ లోని నానక్ మట్ట సాహిబ్ గురుద్వారా డేరా చీఫ్ ను గురువారం తెల్లవారుజామున బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆలయ ప్రాంగణంలోనే కాల్చి చంపిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఉదయం 6.30 గంటల సమయంలో డేరా బాబా ప్రాంగణంలో కుర్చీలో కూర్చున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం ఆ దుండగులు బైక్ పై పారిపోయారు. వెంటనే, అక్కడి వారు తేరుకుని బాబా తర్సెమ్ సింగ్ ను ఖతిమాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించాడని ఉధమ్ సింగ్ నగర్ ఎస్ ఎస్ పి మంజు నాథ్ తెలిపారు. నానక్ మట్ట సాహిబ్ గురుద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ సిఖ్ పుణ్యక్షేత్రం. ఇది రుద్రపూర్-తనక్పూర్ మార్గంలో…
అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. 1610 కిలోమీటర్ల నిడివి గల సరిహద్దులో ప్రస్తుతం యథేచ్ఛగా రాకపోకలు సాగుతున్నాయి. జాతీయ భద్రత కారణాలతో సరిహద్దులో గల పౌరుల కోసం సైనిక తిరుగుబాటు జరిగిన మయన్మార్‌తో సరిహద్దులో కంచె ఏర్పాటు చేసి, దశాబ్దాలుగా కొనసాగుతున్న వీసా రహిత రాకపోకల విధానానికి స్వస్తి పలకనున్నట్లు కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించింది. సరిహద్దులో కంచె నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం కమిటీ ఒకటి ఈ నెలారంభంలో ఆమోదించిందని, దానికి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం ఆమోదముద్ర అవసరమని ఆ ప్రతినిధి తెలియజేశారు. కంచె ఏర్పాటుకు భారత్ యోచనపై మయన్మార్ ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. 2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు దరిమిలా వేలాది మంది పౌరులు, వందలాది మంది భద్రత సిబ్బంది…
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. ఆయనను మరోసారి ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగియగా గురువారం ఉదయం ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్ మరోసారి కేజ్రీవాల్‌కు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. దీంతో ఆయనను మళ్లీ ఈడీ ప్రధాన కార్యాలయానికి అధికారులు తరలించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వ తేదీ వరకు పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. విచారణలో కేజ్రీవాల్ తప్పించుకునే రీతిలో సమాధానాలు చెబుతున్నారని కోర్టులో ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ భార్యకు సంబంధించిన సెల్‌ఫోన్‌ను సీజ్ చేశామని.. ఆ ఫోన్, లోని డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఈడీ కోర్టుకు…