Author: Editor's Desk, Tattva News

ఏపీలోని అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి పది ఎమ్మెల్యే, ఆరు ఎంపీ సీట్లు దక్కాయి. ఎంపీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. బుధవారం సాయంత్రం పది అసెంబ్లీ సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. ఊహించిన విధంగానే కొంతమంది నేతలకు సీట్లు దక్కగా.. మరికొంతమందికి మాత్రం అనూహ్యంగా స్థానం దక్కింది.మరోవైపు సీనియర్ బీజేపీ నేతలకు ఈసారి నిరాశ ఎదురైంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి నేతలకు అవకాశం దక్కలేదు. యువ మోర్చా జాతీయ కార్యదర్శి సురేష్ కు నిరాశే ఎదురైంది.మరోవైపు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన అనపర్ ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. పొత్తులో భాగంగా అనపర్తి సీటుకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. అక్కడి నుంచి శివకృష్ణరాజు పోటీ చేయనున్నారు. గతంలో ఈ సీటుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాజాగా బీజేపీ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. అలాగే…

Read More

ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలోని రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో విధి నిర్వహణలో ఉన్న ఒక ప్రొవిన్షియల్ ఆర్డ్ కానిస్టేబులరీ (పిఎసి) కమాండో తన గన్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాథ్తు అది పేలవిపోవడంతో గాయపడ్డాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ప్లాటూన్ కమాండర్ రాం ప్రసాద్(50)ను అయోధ్య వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు వారు చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా అవసరాల నిమిత్తం రాం ప్రసాద్ రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో గత ఆరు నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన భద్రతా పోస్టులో ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో అది పేలి రాం ప్రసాద్ గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాం ప్రసాద్ ఛాతీకి ఎడమమ వైపున బుల్లెట్ తగిలిందని అయోధ్యలోని మెడికల్ కాలేజ్ ఎమర్జెన్సీ విభాగం ఇన్‌చార్జ్…

Read More

అధికారం లేని పార్టీలో కొనసాగేందుకు అసహనంగా ఉండే మాజీ మంత్రి దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి గెలుపొందినా ప్రతిపక్షంలో ఉండలేక కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు, వెంటనే సికింద్రాబాద్ నుండి లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, బిఆర్ఎస్ ఎమ్యెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దపడటంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఫిర్యాయింపు నిరోధక చట్టం క్రింద దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని చెప్పారు.  ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా…

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ క్రమంలోనే తనకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు హైకోర్టులో నిరాశే ఎదురైంది. తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఏప్రిల్‌ 2 వ తేదీ వరకు ఈడీకి గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను ఏప్రిల్‌ 3 వ…

Read More

మహారాష్ట్రలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వంచిత్ బహుజన్ అఘాడి (విబిఎ) వ్యవస్థాపకుడు ప్రకాశ్ అంబేద్కర్ మరాఠా రిజర్వేషన్ ప్రచారోద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్‌తో చర్చల అనంతరం మూడవ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)కు దూరం జరిగారు. అంబేద్కర్ ముంబయిలో ‘ఇండియా’ కూటమి ర్యాలీకి హాజరైన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకున్నది. ముంబయి ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించగా వాయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ, ప్రతిపక్ష కూటమి నేతలు కొందరు హాజరయ్యారు. అంబేద్కర్ కొన్ని వారాలుగా మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతోను, ఎన్‌సిపి (ఎస్‌సిపి) చీఫ్ శరద్ పవార్‌తోను, శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాక్కరేతోను చర్చలు జరుపుతున్నారు. తుదకు అంబేద్కర్ ఈ నిర్ణయం తీసుకుని తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. అంబేద్కర్ స్వయంగా మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలా…

Read More

ఛత్తీస్‌​గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ​ బీజాపుర్​ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌​కౌంటర్‌​లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్(మావోయిస్టులు) మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. చికుర్​బత్తి – పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగింది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్​ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్​ రేంజ్ ఐజీ సుందర్ ​రాజ్​ తెలిపారు. ‘కాల్పుల ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలకు కూడా తీసున్నాం. కాల్పుల్లో పలువురు నక్సలైట్లు గాయపడ్డారు. ఇంకా బీజాపుర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు…

Read More

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ కన్నుమూశారు. 95 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం రాత్రి 8.14 గంటలకు స్మరణానంద తుదిశ్వాస విడిచినట్టు రామకృష్ణ మిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  జనవరి 29న మూత్రనాళం ఇన్‌ఫెక్షన్‌తో స్వామి స్మరణానంద రామకృష్ణ మిషన్‌ సేవా ప్రతిష్ఠాన్ (ఆస్పత్రి)లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించి, శరీరంలో ఒక్కో అవయవం దెబ్బతింది. మార్చి 3 వరకూ స్వామీజీ వెంటిలేటర్‌పై ఉన్నారు. రామకృష్ణ మిషన్‌, మఠానికి 17వ అధ్యక్షుడిగా 2017లో స్వామి స్మరణానంద బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బేలూరు మఠంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2017లో స్వామి స్మరణానంద మహరాజ్ 16వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మిషన్ నిర్వహిస్తున్న దక్షిణ కోల్ కతా ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. ఈ ఏడాది మార్చి 5న రెండోసారి బెంగాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై…

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద ఘెరావ్‌కు యత్నించారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘కేజ్రివాల్‌ జిందాబాద్‌’ అన్న నినాదాలు ఆ ప్రాంతమంతటా హోరెత్తాయి.  మంగళవారం ఉదయం 10 గంటలకు ఇక్కడి పటేల్‌ చౌక్‌ నుంచి బయల్దేరిన ప్రదర్శన తుగ్లక్‌ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోదీ నివాసం వైపు సాగింది. ప్రదర్శన పటేల్‌ చౌక్‌ వద్దకు చేరుకోగానే ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్లు పోలీస్‌ వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌ కు తరలించారు.  ఆప్‌ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో ప్రధాని నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సెంట్రల్‌ ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్ళే, వచ్చే మార్గాలను భద్రతా కారణాలను సాకుగా చూపి మూసివేవేశారు. పటేల్‌…

Read More

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు కంపెనీలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. మంగళవారం క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్ డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు అనుబంధ సంస్థలు, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమొత్తం వాషింగ్‌ మెషిన్‌లో దొరికినట్లు ఈడీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే వివిధ పత్రాలు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. భారతదేశం వెలుపల పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్య లావాదేవీల్లో ఈ సంస్థల ప్రమేయం ఉందని..బోగస్‌ సరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట సింగపూర్‌కు చెందిన గేలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హోరిజన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌ల్లో రూ.1,800…

Read More

ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయడంపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై స్పందించిన జర్మనీ  ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఇదే విషయంపై అమెరికా కూడా స్పందించింది. తాజాగా, ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, దేశంలో ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అగ్రరాజ్యం పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈ-మెయిల్‌ ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సమాధానం ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో సమయానికి అనుగుణంగా, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా…

Read More