Author: Editor's Desk, Tattva News

మూడోసారి అధికారం దక్కించుకోవాలని బిజెపి..లోక్ సభ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో అడుగులేస్తోంది. ఈ క్రమంలో పలువురు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నాయకులు బిజెపిలోకి వెళ్లి కండువా కప్పుకున్నారు. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం మల్లేశ్వరంలోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో గాలి జనార్ధన్ రెడ్డి కమలం పార్టీలో చేరబోతున్నానని వెల్లడించారు. తన పార్టీ.. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్​పీపీ)ని బిజెపిలో విలీనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తనతోపాటు పార్టీ నేతలంతా బిజెపిలో చేరుతారని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఈ సందర్భంగా బిజెపిలో తన పార్టీ విలీన అంశంపై అమిత్ షాతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. బిజెపికి బయట నుంచి మద్దతు ప్రకటించడం కంటే పార్టీని విలీనం చేయడానికి నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారని గాలి…

Read More

లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే.. నాలుగు విడతల్లో మొత్తం 291 అభ్యర్థులను ప్రకటించిన బిజెపి ఆదివారం సాయంత్రం ఐదో జాబితా కూడా విడుదల చేసింది. తొలి విడ‌త‌లో ఒకేసారి 195 మంది అభ్యర్ధుల పేర్లను ప్రక‌టించిన బీజేపీ, రెండో జాబితాలో 72 మంది అభ్యర్థుల‌ను, మూడో జాబితాలో కేవలం 9 మంది అభ్యర్థులను, 15 మంది పేర్లతో నాలుగో లిస్టును ప్రకటించింది.  ఇక ఇప్పుడు ఐదో జాబితాను ప్రకటించిన బీజేపీ.. ఈ జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 402 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అయితే.. ఇప్పటికే ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో పలువురు సినీ నటులు ఉండగా, ఐదో జాబితాలోనూ సినీ గ్లామర్‌ ఉండేలా జాగ్రత్తపడింది బీజేపీ.  హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి హీరోయిన్ కంగనా రనౌత్‌ను రంగంలోకి దించుతోంది కమలం పార్టీ. మరోవైపు.. రామయణంలోని రాముని పాత్రదారుడైన…

Read More

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర ప్రభుత్వ కార్యకలాపాలపై కస్టడీలో నుంచే తొలి ఆదేశం జారీ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న నీటి, మురుగునీటి సమస్యలను పరిష్కరించవలసిందని జల వనరుల శాఖ మంత్రి ఆతిషికి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. ఆతిషి ఆదివారం విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, తనకు ఆ ఉత్తర్వు శనివారం అందిండని, స్వయంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల పట్ల కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తుండడం తన కన్నీళ్లు తెప్పించిందని తెలియజేశారు. ఎక్సైజ్ విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసు సందర్భంగా కేజ్రీవాల్ (55)ను ఇడి గురువారం ఆయన అధికార నివాసం నుంచి అరెస్టు చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను ఒక కోర్లు ఈ నెల 28 వరకు ఇడి కస్టడీకి శుక్రవారం పంపింది. వేసవి నెలలు సమీపిస్తున్నందున నీటి సరఫరాను పెంచడానికి కొరత ఉన్న ప్రాంతాలలో…

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల పాలనలో రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా గ్రామ పరిధిలోని ఎండిన పంటలను హరీశ్ రావు పరిశీలించి రైతులతో మాట్లాడిన అనంతరం రైతులను ఆదుకోకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదని, రైతుల కోసం అని పేర్కొంటూ. రైతుల మరణాలకు కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేసిన ఆయన.. కాల్వలు రాకపోవడంతో నీరు లేక కొత్త బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. వేసిన బోర్లలో కూడా నీరు పడలేదని అప్పుల పాలయ్యామని, రైతుబంధు కూడా పడడం లేదని రైతులు అంటున్నారని హరీశ్ రావు తెలిపారు.  బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీరు సమృద్ధిగా అందించి…

Read More

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది.  వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులను కలిసి నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.  స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి అప్పట్లో పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ 3…

Read More

రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ హాల్‌లో శుక్రవారం జరిగిన ఉగ్రవాద దాడి వెనుక ఉక్రెయిన్‌ ప్రమేయముందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో శనివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. మాస్కొలోనూ, మాస్కో పరిసర ప్రాంతాల్లోనూ అదనంగా తీవ్రవాద నిరోధక చర్యలు చేపట్టామని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరారు.  ఈ దాడికి పాల్పడిన నలుగురితో సహా మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో నలుగురు ఉక్రెయిన్‌లోకి పారిపోయేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడైందని, దీనితో ఉక్రెయిన్‌ హస్తం బయటపడిందని పుతిన్‌ చెప్పారు. తీవ్రవాదులకు ఆయుధాలు ఎవరు అందచేశారు? వారికి వాహనాలు ఎవరు సమకూర్చారు? తప్పించుకుని పోయే మార్గాలను ఎవరు సిద్ధం చేశారు? వంటి వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారని పుతిన్‌ తెలిపారు. మాస్కోలో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతుల సంఖ్య 150కు చేరిందని,150 మంది పైగా గాయపడ్డారని దర్యాప్తు కమిటీ అధికారులు…

Read More

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులకు కారణం చెప్పకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్యను కోరుతూ కేరళలోని సిపిఎం ప్రభుత్వం అనూహ్య రీతిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి చర్యను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యూనివర్సిటీ చట్టాలు(సవరణ)(నంబర్ 2) బిల్లు, 2021, కేరళ సహకార సొసైటీల(సవరణ) బిల్లు, 2022, యూనివర్సిటీ చట్టాలు(సవరణ) బిల్లు, 2022, యూనివర్సిటీ చట్టాలు(సవరణ) (నంబర్ 3) బిల్లు, 2022 వంటి నాలుగు బిల్లులకు ఎటువంటి కారణాలు చెప్పకుండా ఆమోదం తెలియచేయకపోవడాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని తన పిటిషన్‌ లో ర్రాష్ట్ర ప్రభుత్వం అర్థించింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి కార్యదర్శి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా సిపిఎం సారథ్యంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం చేర్చింది. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ నాలుగు బిల్లులతోపాటు మొత్తం ఏడు బిల్లులను పెండింగ్‌లో…

Read More

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు (ఈ నెల 26 వరకు) పొడిగించింది. ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి కోరగా.. మూడు రోజులకు కోర్టు అనుమతించింది. కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టు అక్రమమని, న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. మరోవైపు సిబిఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను కవిత తరఫు న్యాయవాది దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. లిక్కర్‌ కేసుకు సంబంధించి ఏడు రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కవిత కస్టడీని మూడు రోజులు పొడిగించింది. అంతకుముందు తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది. సమీర్‌ మహీంద్రతో కలిపి కవితను…

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసిన జర్మన్ విదేశాంగ మంత్రిత్వశాఖపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. ఇక్కడి జర్మన్ రాయబారి జార్జ్ ఎన్జ్‌వీలర్‌ను పిలిపించి తన నిరసన తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు శనివారం జర్మన్ రాయబారిని పిలిపించి కేజ్రీవాల్ అరెస్టుపై జర్మన్ విదేశాంగ మంత్రిత్వశాఖ చేసిన వ్యాఖ్యలను భారతదేశ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై అభివర్ణించారు. ఒక పక్షానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అవాంఛనీయమని తెలియచేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టును తాము గమనంలోకి తీసుకున్నట్లు జర్మన్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రతా ప్రమాణాలు, మౌలిక ప్రజాస్వామిక సూత్రాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని భావిస్తున్నట్లు, ఆశిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. న్యూ ఢిల్లీలోని జర్మన్ డిప్యుటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను శనివారం రప్పించి జర్మన్ విదేశాంగ శాఖ అధికార…

Read More

కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన రోజును చీకటి రోజు అని కెసిఆర్ చెబుతుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రులు లిక్కర్ స్కాంకు పాల్పడితే బ్లాక్ డే అవుతుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి తమ కుటుంబానికి సంబంధం లేదని, కేజ్రీవాల్‌కు, ఆ ప్రభుత్వానికి కూడా ఈ కుంభకోణంతో సంబంధం లేదని మాజీ సీఎం కెసిఆర్ చెప్పగలరా? అని నిలదీశారు.  మద్యం వ్యవహారంలో ఆప్ అవినీతికి పాల్పడిందని, వందల కోట్లు చేతులు మారాయని దీనిని తాను ఆధారాలతో నిరూపిస్తానని చెబుతూ కెసిఆర్ కాదని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. అమరవీరుల స్థూపం వద్దకు వస్తావా? ప్రెస్ క్లబ్ వద్దకు వస్తావా? చెప్పాలని సవాల్ చేశారు. అయినా మద్యం అంశంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చించడం తమకు ఇష్టం లేదని చెప్పారు.  కెసిఆర్ తన కూతురు కవితను అరెస్ట్…

Read More