బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ అధికారికంగా ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను ఈ సందేశాన్ని టైప్ చేయలేకపోతున్నాను. కానీ కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున తాను తప్పక టైప్ చేయాల్సి వచ్చింది. దయచేసి క్షమించండి.. తనకు మరో మార్గం లేదు. కొత్త దారి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తాను అని తెలిపారు. ఇటీవల తెలంగాణలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వేరోగా తాను ఎవరినీ నిందించను. తనను నమ్మిన వారిని మోసం చేయను. మళ్లీ చెబుతున్నా.. చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెలో పదిలంగా దాచుకుంటాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పంచాయితీ ముగిసింది. ఏపీ భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో శనివారం ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ అశోకా రోడ్డు, మాధవరావు సింధియా మార్గ్‌ల వెంబడి రెండు రాష్ట్రాలకు కలిపి 19.733 ఎకరాల భూమి ఉంది. తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు, ఏపీ వాటాగా 11.536 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 2.396 ఎకరాలు ఏపీకి కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిపాదనకు…
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్డీయే కూటమి ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయింది. సుపరిపాలన, అన్ని రంగాల ప్రజలకు చేసిన సేవల ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం” అని చెప్పుకొచ్చారు. “పదేళ్ల క్రితం యూపీఏ హయాంలో ప్రజలు మోసపోయారు. కుంభకోణాలు, అవినీతికి ఇండియా కూటమి కేరాఫ్‌గా మారింది. అప్పటి నుంచి ఒక్కో రంగంలో అవినీతిని అరికడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తున్నాం. మా ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరాయి. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈ అభివృద్ధికి చేయూతనివ్వడానికి ప్రజలు సిద్ధమయ్యారు” అని తెలిపారు. . “140 కోట్ల మంది భారతీయులచే ఆధారితమైన మన దేశం అభివృద్ధిలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మనం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా…
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మార్చి 23వరకూ ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ పూర్తయ్యాక కవితను మళ్లీ కోర్టులో హాజరుపరుస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ శనివారం హాజరుపరిచింది. కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది. కాగా.. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఐటీ, ఈడీ జాయింట్ సోదాలు నిర్వహించిన అనంతరం.. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా పైవిధంగా కోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత…
18వ లోక్ సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 దశల్లో జరుగుతాయని వెల్లడించారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు. రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మొత్తం పోలింగ్ 7 దశల్లో జరగనుంది. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ 13న, ఐదో దశ 20న, ఆరో దశ 25న, చివరిదైన ఏడో దశ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే…
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మళ్లీ బిజెపిని గెలిపించాలని ప్రజలు నిర్ణయానానికి వచ్చారని చెబుతూ నాగర్ కర్నూలు ప్రజలు కూడా ఈ సారి బిజెపిని గెలిపించాలని ప్రధాని ప్రజలను కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో బిజెపి ర్యాలీ బ్రహ్మాండంగా సాగిందని చెబుతూ మల్కాజ్ గిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి బిజెపికి మద్దతు తెలిపారని ప్రధాని చెప్పారు. బిఆర్ఎస్ పట్ల తమ కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్న ప్రధాని సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బిజెపినే గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పదేళ్లుగా బిఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని విమర్శించారు. పదేళ్లుగా బిఆర్ఎస్ అవినీతికి పాల్పడితే.. ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణను దక్షిణ భారతానికి ముఖ ద్వారమని చెబుతున్నారని, తెలంగాణలోనూ…
సరిగ్గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజునే 175 అసెంబ్లీ స్థానాలు 25 లోక్ సభ సీట్లకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంతకు ముందు విడతల వారీగా ప్రకటించిన సమన్వయకర్తల జాబితాలో స్వల్ప మార్పులతో తుది జాబితాను ప్రకటించారు. ఇడుపుపాయలో తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన జాబితాలో సామాజిక సమీకరణాల విషయానికి వస్తే ఎస్సీ – 29, ఎస్‌టీ- 7, బీసీ-48 సీట్లు కేటాయించినట్టు వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల్లో…
గత 5 సంవత్సరాలుగా ఎలక్టోరల్ బాండ్ల లావాదేవీల వివరాలను సమర్పించాలని ఎస్‌బిఐకి సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్‌ల విరాళాల గురించి వాస్తవాలు గణాంకాలను కొంతమేరకు వెల్లడించింది.రూ 6060.5 కోట్ల మేరకు ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేస్తున్న జాబితాలో అధికార బీజేపీ అగ్రస్థానంలో ఉండగా, ప్రాంతీయ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రూ.1,609 కోట్ల విరాళాలు అందుకోవడంతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. తర్వాత కాంగ్రెస్ రూ.1,421.90 కోట్ల విరాళాలను ఎన్‌క్యాష్ చేయడంతో పాటు నాల్గవ స్థానంలో ఉన్న ప్రాంతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి రూ.1,214.70 కోట్ల విరాళాలను అందుకుంది. కోట్లాది రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు పనులను దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి బిఆర్‌ఎస్‌కు భారీ మొత్తం లభించిన్నట్లు వెల్లడి అవుతుంది. దేశంలోనే ఎలక్టోరల్ బండ్లకు అత్యధికంగా నిధులు సమకూర్చిన సంస్థలలో మేఘా కూడా ఉండటం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్…
మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హంతకుల్ని కాపాడుతున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్.షర్మిల, ఆమె సోదరి, వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం వైసిపి ప్రజాప్రతినిధులు పార్టీ నుండి బయటకు రావాలని వారు కోరారు. శుక్రవారం కడప నగర శివారులోని జయరాజ గార్డెన్స్‌లో వివేకా ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని స్మారక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తులసిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ఆర్ తమ్ముడికి ఐదేళ్లుగా న్యాయం జరగని నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో అప్పుడు తెలియదని, అన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయని, బంధువులే హత్య చేశారని అర్ధమవుతోందని ఆమె చెప్పారు. ‘అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నాడని’ ఆమె ఆరోపించారు. చెల్లెలికి న్యాయం చేయాల్సింది పోయి చివరికి ఆమే హత్యచేసిందన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన…
రాజకీయ పార్టీలకు విరాళాలు అందచేసిన 30 కంపెనీలలో కనీసం 15 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొన్నయని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దాడులకు, విరాళాలకు ముడిపెడుతూ చేస్తున్న వాదనలు ఊహాజనితమైనవని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆమె పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2013లో అప్పటి యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలెక్టోరల్ ట్రస్ట్ సీమ్‌ను ప్రస్తావిస్తూ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఇదివరకటి విధానం పూర్తిగా లోపభూయిష్టమని ఆమె చెప్పారు. ఇసి విడుదల చేసిన ఎన్నికలబాండ్ల వివరాలపై అడిగిన ఒక ప్రశ్నకు ఆమె జవాబిస్తూ ఇడి దాడుల తర్వాతే విరాళాలు ఇచ్చారన్న మీ ఆలోచనే ఊహాజనితమైనదని చెప్పారు. విరాళాలు ఇచ్చిన తర్వాత కూడా ఇడి ద్వారా కంపెనీలపై దాడులు జరిపించకూడదా అని ఆమె ప్రశ్నించారు. ఇడి దాడులు చేసిన తర్వాత తమను…