ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని కోర్టులో ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తి పిటిషన్ వేశారు. ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని, వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర చేస్తున్నారని ఆయన పిటిషన్ లో తెలిపారు. దీనిపై విచారించిన కోర్టు.. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, గత కొంతకాలంగా వేణుస్వామి చెప్పినదంతా రివర్స్ కావడంతో.. ప్రస్తుతం ఆయన జాతకం బాగా లేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే..ఆయన చెప్పేవన్నీ అబద్దాలంటూ టీవి5 మూర్తి.. కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. కాగా.. వేణుస్వామి చేత పలువురు స్టార్ హీరోయిన్లు ప్రత్యేక పూజలు చేయించుకున్న సంగతి…
Author: Editor's Desk, Tattva News
జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. అక్కడ వరుసగా ఎన్ కౌంటర్లు జరగడం కలవరం రేపుతోంది.జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు కథువాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను రైజింగ్ స్టార్ కార్ప్స్ హతమార్చారు. కిష్టవార్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా చాట్రూ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టారు. 15.30 నిమిషాల సమయంలో ఉగ్రవాదుల ఆచూకీ చిక్కిందని, ఆ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీ వెల్లడించింది. కిష్టవార్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఉగ్రవాదులే జూలైలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు కిశ్త్‌వాడ్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు గాయ పడ్డారు. ఈ విషయాన్ని సైనిక వర్గాలు…
ఇటీవల రాష్ట్రంలో సంచలనం కలిగించిన ముంబయి సినీనటి కాదంబరి జత్వాని కేసు కీలక మలుపు తిరిగింది. బాధితురాలు జత్వాని తల్లిదండ్రులు, మరియు న్యాయవాదులతో కలిసి కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు విద్యాసాగర్, మరికొంత మందిపై శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. తనను ఇబ్రహీంపట్నంలో కొంతమంది పోలీసు అధికారులు, వ్యక్తులు బంధించి వేధింపులకు గురి చేసినట్లు సుమారు రెండు గంటల పాటు సీఐకి వివరించారు. ఇప్పటికే కాదంబరి కేసు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే! గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో జత్వానిని వేధించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇంతకుముందే పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబుకు జత్వాని ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ ను నియమించారు.…
కేంద్ర పాలిత ప్రాంతం అయిన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పోర్ట్ బ్లెయిర్‌ను శ్రీ విజయపురంగా పిలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విటర్ వేదికగా వెల్లడించారు. వలసవాద గుర్తుల నుంచి భారత దేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.పోర్ట్ బ్లెయిర్ అనే పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోందని అందుకే దాన్ని శ్రీ విజయపురంగా మార్చినట్లు వెల్లడించారు. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక అని, స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం అని అమిత్ షా పేర్కొన్నారు. దేశ చరిత్రతో పాటు స్వాతంత్య్ర పోరాటంలోనూ అండమాన్ నికోబార్ దీవులది కీలక పాత్ర అని ఈ సందర్భంగా అమిత్…
ఆహార పదార్థాలపై భారీగా జీఎస్టీ విధించడంపై రెస్టారెంట్ చైన్ యజమాని బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా కలిసిన ఆయన దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ లీక్ చేయడంతో దుమారం చెలరేగింది.ఈ నేపథ్యంలో నెటిజన్లతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో వ్యాపార యజమానుల సమావేశం జరిగింది. కాగా, అన్నపూర్ణ రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆహార పదార్థాలపై మారుతున్న జీఎస్టీ వల్ల రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ధ్వజమెత్తారు. రొట్టెలపై ఎలాంటి జీఎస్టీ లేకపోగా క్రీమ్ రొట్టెలపై 18 శాతం జీఎస్టీ విధించడాన్ని విమర్శించారు. ‘స్వీట్లపై 5 శాతం, బిస్కెట్లపై 12 శాతం, క్రీమ్ ఫిల్డ్ బన్స్‌పై 18 శాతం జీఎస్టీ ఉంది. అయితే బన్స్‌పై జీఎస్టీ లేదు.…
రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదలతో తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్ర బృందానికి వివరించారు. తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సచివాలయంలోశుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి మంత్రులు వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో చెప్పారు. పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల గురించి వివరించడంతో పాటు ఆస్తినష్టం జరిగిన తీరును కూడా కేంద్ర బృందానికి సవివరంగా తెలిపారు.వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని…
రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. తేజస్వి బెంగళూర్‌లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపుపై రాహుల్ వ్యాఖ్యలు ఆందోళనకరమని చెప్పారు. రాహుల్ గాంధీ ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూస్తే విస్మయం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్ వ్యతిరేకి ఇల్హర్ ఒమర్‌తో రాహుల్ భేటీ అయ్యారని, ఖలిస్తాన్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఏజెంట్లతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఓరోజు ఉగ్రవాదులతో సమావేశమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కేంద్ర ప్రభుత్వం సహా బీజేపీ, ఆరెస్సెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం పట్ల కాషాయ నేతలు భగ్గుమన్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించడం రాహుల్‌కు అలవాటుగా మారిందని మండిపడుతున్నారు. ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ దినేష్ శర్మ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆయనకు బెయిల్ దక్కింది. ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. కోర్టు పలు షరతులను విధించింది. రూ.10 లక్షలు పూచీకత్తుతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సంతకాలు చేయాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలని తెలిపింది. సాక్ష్యాలను టాంపర్ చేయకూడదని షరతులు విధించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్‌కు వెళ్లకూడదని కోర్టు నిబంధన విధించింది. అంతేకాదు గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది. ఇక ఈ కేసుపై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, సాక్షులతో మాట్లాడకూదని స్పష్టత ఇచ్చింది. కేజ్రీవాల్ అరెస్టు…
సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి నేత బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో ఇన్నాళ్లు కొనసాగిన పాలన ప్రజాకంఠక పాలన అని కాంగ్రెస్ అంగీకరించినట్లేనా? అని ప్రశ్నించారు. విదేశాల్లో భారత్ ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ కి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని, వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తారా? మమ్ముల్ని కూల్చమంటారా? అంటూ సిఎం హెచ్చరించడం సిగ్గు చేటన్నారు. అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో సభ్యత్వ నమోదులో సంచలనం స్రుష్టిస్తామని ఆయన చెప్పారు. . ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడమే…
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ ఎన్నిక వివాదం చీలికి చీలికి గాలి వానగా మారింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మొదలైన వివాదం దాడుల వరకు వెళ్ళటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ నివాసం, ఇటు కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డిల నివాసాల వద్ద గురువారం ఉదయం నుండి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలకు దక్కాల్సిన పిఏసి చైర్మన్ పదవిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీకి ఎంపిక చేయటం పట్ల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో గాంధీ తాను బీఆర్‌ఎస్ సభ్యుడినే అని, ప్రతిపక్ష పార్టీకే పదవీ ఇచ్చారని పేర్కొనడంతో వివాదం మొదలైంది. బీఆర్‌ఎస్ సభ్యులు అయితే గాంధీ ఇంటి మీద గురువారం నాడు గులాబీ జెండా ఎగురవేసి, కండువా కప్పుతానని, లేనట్లయితే చీర, గాజులు పంపుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్…