Author: Editor's Desk, Tattva News

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. కల్వకుంట్ల కవితను  ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుండి వచ్చిన ఈడీతో పాటు పాటు ఐటీ అధికారులు సుమారు ఐదు గంటలసేపు  తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది. కవితకు సంబంధించిన రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ కేసులో ఆమెను మరింత లోతుగా విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. నేటి రాత్రి 8.45 ఢిల్లీ కి వెళ్లే విమానంతో క‌విత‌ను తీసుకెళుతున్న‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు ఈడీ అధికారులు తెలిపారు.. మరోవైపు కవిత నివాసం వద్ద బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.…

Read More

యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం వెలువడనుంది. సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో ఈ ప్రెస్ మీట్‌ జరగనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద ఈ ప్రెస్‌‌మీట్ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ మేరకు ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి రానుంది. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. కాగా ప్రస్తుత ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. ఆ గడువుకు ముందే కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా 2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న వెలువడింది. ఏప్రిల్ 11…

Read More

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైట్‌ https://www.eci.gov.in/లో అప్లోడ్ చేసింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది. పార్ట్‌-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు, పార్ట్‌-2లో బాండ్లను ఎన్‌క్యాష్‌ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను పొందుపరిచారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు దాతలుగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజినీరింగ్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, బారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, డీఎల్ఎఫ్…

Read More

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. నుదుటి నుంచి రక్తం కారింది. దీంతో మమతా బెనర్జీని వెంటనే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది.  తమ పార్టీ చీఫ్‌ తలకు గాయమైనట్లు తెలిపింది. అలాగే మమతా బెనర్జీ నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మమతా బెనర్జీ కోలుకునేలా అంతా ప్రార్థించాలని కోరింది.  అయితే  వ్యాయామం చేస్తూ దీదీ కింద పడిపోవడంతో ఆమె నుదుటికి ఏదో వస్తువు గట్టిగా తగిలినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ రంధ్రం ఏర్పడి రక్తం ధారగా కారుతున్నట్లు ఫోటోను చూస్తే అర్థం అవుతోంది.  ఎక్సర్‌సైజ్ చేస్తుండగా కింద పడి తీవ్ర గాయాలపాలైన దీదీని ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ.. వెంటనే…

Read More

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్‌ చేసింది. దేశంలో పబ్లిక్ యాక్సెస్‌ ఉన్న 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానంగా ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్‌ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. అయితే, కేంద్రం హెచ్చరికలను ఆయా ప్లాట్‌ఫామ్స్‌ పట్టించుకోలేదు. దీంతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఆయా సంస్థలపై వేటు వేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇందులో గూగుల్‌ ప్లే స్టోర్‌లో 7 యాప్స్, యాప్‌స్టోర్‌లో మూడు యాప్స్‌ ఉన్నాయి. కేంద్రం నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో…

Read More

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సిఎఎని రాష్ట్రాలు అడ్డుకోలేవని, పౌరసత్వాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వమే అనుమతించగలదని కూడా ఆయన తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సిఎఎపై ఒక ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదని, మన దేశంలో భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వాలన్న నిర్ణయం పార్లమెంట్ తీసుకున్నదని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సిఎఎని తమ రాష్ట్రాలలో అమలు చేయబోమంటూ కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తూ రాజ్యాంగంలోని 11వ అధికరణ కింద పౌరసత్వానికి సంబంధించిన సర్వాధికారాలు పార్లమెంట్‌కే ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే తప్ప రాష్ట్ర పరిధిలోనిది కానది ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని తాను భావిస్తున్నానని…

Read More

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ కావడం తో ఇప్పుడు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. గత కొద్దీ రోజులుగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో మల్లారెడ్డి తో పాటు ఆయన తనయుడు భద్రారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది. ఇవన్నీ చూస్తే అతి త్వరలోనే కేసీఆర్ కు మల్లారెడ్డి షాక్ ఇవ్వనున్నారని అర్ధం అవుతుంది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిత్యం పరుషమైన వాఖ్యలు చేస్తుండేవారు. సవాళ్లు, విమర్శలతో వార్తలలో నిలిచేవారు..బస్తేనే సవాల్ అటు తొడలు కొట్టిన రోజులుకూడా ఉన్నాయి. అందుకనే…

Read More

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ  నేతృత్వంలోని ముగ్గురు స‌భ్యుల సెల‌క్ష‌న్ క‌మిటీ ఇద్ద‌రు కొత్త ఎన్నిక‌ల క‌మిష‌నర్ల‌ను నియ‌మించింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లుగా కేర‌ళ‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్‌కుమార్‌, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ సుఖ్‌భీర్ సింగ్ సంధుల‌ను ఎంపిక చేసింది.  ఈ విష‌యాన్ని క‌మిటీ స‌భ్యుల‌లో ఒక‌ర‌యిన‌ కాంగ్రెస్ లీడ‌ర్‌ అధిర్ రంజ‌న్ చౌద‌రీ మీడియాతో వెల్ల‌డించారు. ఇక లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు ఇటీవ‌ల అరుణ్ గోయ‌ల్ త‌న ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీంతో అలా అరుణ్ గోయ‌ల్ త‌ప్పుకున్న రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ కొత్త నియ‌మ‌కాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. అలాగే ఎన్నిక‌ల క‌మిష‌నర్ల నియామ‌కాల కోసం ఏర్ప‌డిన సెల‌క్ష‌న్ క‌మిటీ ఏర్పాయిన‌ త‌ర్వాత జ‌రిగిన మొద‌టి నియామ‌కాలు కూడా ఇవే. లోక్ స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డానికి ఇంక కొన్ని రోజులే ఉంద‌న‌గా ఎల‌క్ష‌న్ క‌మిష‌ర్ అనుప్ పాండే ఈ…

Read More

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయ‌న్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా నేడు ప్ర‌క‌టించారు.. మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో గురువారం జ‌రిగిన జ‌న‌సేన 11వ అవిర్భావ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ, లోక్ స‌భ‌కు పోటీ చేసే ఆలోచ‌న లేద‌ని తేల్చి చెప్పారు. గ‌తంలో భీమ‌వ‌రం, గాజువాక‌లో పోటీ చేసిన తాను ఈసారి పీఠాపురం బ‌రిలో దిగుతున్న‌ట్లు చెప్పారు.. 2014లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలనే దానిపై విజ్ఞప్తులు వచ్చాయని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. కానీ అనంతపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, పార్టీ ఆఫీస్ ను కూడా అనంతపురం నుంచే ప్రారంభించానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. శక్తి పీఠానికి కేంద్రమైన పిఠాపురం నుంచి బరిలో ఉంటానని పేర్కొన్నారు.  ఎంపీగా పోటీ చేయాలా..? వద్దా…? అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు చెబుతూ ఎంపీగా…

Read More

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడువులోగా ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం జమ్మూ కశ్మీర్‌‌లో బుధవారం పర్యటించిన ఆయన జమ్మూలో మాట్లాడుతూ బాండ్లు కొనుగోలుచేసిన వ్యక్తులు, వాటిని నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల వివరాలను తమకు నిర్ణీత గడువులోగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసిందని చెప్పారు.  ఆ సమాచారాన్ని పరిశీలించిన అనంతరం తాము కూడా వివరాలను అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన సమయం ప్రకారమే ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని రాజీవ్‌కుమార్‌ వివరించారు.  ఈ నెల 15న సాయంత్రం 5 గంటలు లోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.  ఎలక్టోరల్ బాండ్ల విషయంలో గడువును జూన్ 30 వరకూ పొడిగించాలన్న ఎస్బీఐ చేసిన విజ్ఞ‌ప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని…

Read More