లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్‌బరేలీ నియోకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇక రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి బరిలో దిగనున్నారు. రాహుల్ అమేథీ నుండి పోటీ చేయనున్నారని, దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని యుపి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమై.. ఇటీవల తిరిగి యుపి చేరుకున్న ప్రదీప్ సింఘాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్.. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు రాహుల్. అయితే ఇప్పుడు కూడా రాహుల్ అమేథీతో పాటు వయనాడ్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్న రాయ్‌బరేలీ…
Author: Editor's Desk, Tattva News
వైసీపీ కీలక నేత గుమ్మనూరు జయరాం మంగళవారం మంగళగిరిలో టీడీపీ – జనసేన కూటమి ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకంటే ముందే వైసీపీ పార్టీ కి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనీ గవర్నర్ ను కోరగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో జయరాం మాజీ మంత్రి అయ్యారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ జయరాంను అడగడంతో ఆయన ససేమిరీ అన్నారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు నిర్నయిన్చుకొని వైసీపీ కి రాజీనామా చేసి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారని గమ్మనూరు జయరాం ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని మండిపడ్డారు.…
* బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తామని, బీసీ సబ్ ప్లాన్ అమల్లో భాగంగా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున, ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళగిరిలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు.’బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉందని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వెనకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించాము” అని తెలిపారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి మరింత ప్రాధాన్యం ఇస్తామని, బీసీలంటే తమ పల్లకీ మోసే బోయీలని జగన్ అనుకుంటున్నారని, బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు, సమాజానికి వెన్నెముకలని నిరూపిస్తాం అని ప్రకటించారు. బీసీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని, పింఛను మొత్తాన్ని…
లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అతిపెద్ద ఊరట లభించింది. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీల్యాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ కీలకతీర్పునిచ్చింది. 2017 ఆగస్టు 2న ఆదాయ పన్నుశాఖ అధికారులు బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన ముఖ్య అనుచరుడి వద్ద లభించిన భారీ నగదును డీకే శివకుమార్ బినామీ ఆస్తిగా పరిగణించిన ఈడీ, మనీల్యాండరింగ్ కేసుగా మార్చి.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ డీకే శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నా తీర్పు సానుకూలంగా రాలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు 120-బి పరిధిలోకి రాదని, ఈడీ వాదన చెల్లదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత శివకుమార్ బెంగళూరులో…
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఆయనను గులాబీ పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో సెక్యులర్ విలువలు క్షీణించడం, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీన పడటం, దళిత, నిమ్నవర్గాల అభ్యున్నతి తదితర అంశాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీఎస్పీతో కలిసి పనిచేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరంలేదని కేసీఆర్ స్పష్టంచేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని, ప్రజా…
కోల్‌కతా హైకోర్టు జడ్జి పదవికి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం హైకోర్టులోని ఛాంబర్‌కు చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, కోల్‌కతా చీఫ్ జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానమ్‌లకు కూడా రాజీనామా లేఖలను పంపారు. తాను గురువారం బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు. మొదట మీడియా సమావేశం నిర్వహించి తన రాజీనామాను ప్రకటించాలనుకున్నారు. అయితే సమావేశాలపై నిషేధ ఆంక్షలు ఉండటంతో మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ నియోజకవర్గం నుండి అభిజిత్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం. కాగా, 2009 నుండి తమ్లుక్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గానికి 2009 నుండి 2016 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుడి భుజంగా ఉన్న సువేందు అధికారి ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల సువేందు…
మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి, పఠాన్ చెరువులలో జరిగిన బహిరంగసభలలో మాట్లాడుతూ ‘‘కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పామని. చేశామా? లేదా? అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చేస్తామని చెప్పాం.. చేశామా? లేదా?.. మోదీ ఇచ్చిన గ్యారెంటీ.. నెరవేరిందా? లేదా?’’ అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశంగా భారత్ ఎదుగుతోందని చెబుతూ ‘‘ఇప్పుడు మీకు మరో గ్యారెంటీ ఇస్తున్నా. కొన్నేండ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతా.. మీకు మాటిస్తున్నా. ఇది మోదీ గ్యారెంటీ” అని ప్రకటించారు. “మోదీని తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే.. వారికి సంబంధించిన వేల కోట్ల అవినీతిని ప్రశ్నించినందుకు తిడుతున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు.. కుటుంబ పాలనపై ప్రశ్నించినందుకు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు”…
సనాతన ధర్మం కోవిడ్, మలేరియా, డెంగ్యూ లాంటిదని, దీనిని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించిన తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీంకోర్ట్ గట్టిగా మందలించింది. వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛ హక్కులను దుర్వినియోగపరిచారని మండిపడింది. తనపై నమోదైన కేసులన్నింటినీ ఏకమొత్తంగా ఒకేసారి విచారించాలంటూ ఎందుకు పిటిషన్ దాఖలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదానికి సంబంధించి ఆరుకి పైగా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని, వాటన్నింటినీ ఏకం చేసి ఒకేసారి విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఉదయనిధి స్థాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ సోమవారం పరిశీలించింది. దీనిపై సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని ఈ సందర్భంగా కోర్ట్ సూచించింది. కొన్ని ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన తీర్పులు, విచారణ పురోగతిపై మార్చి 15న తిరిగి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఆలోచించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా…
టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ ‘రా కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎ వరినీ ఉద్యోగం నుంచి తీసేయమంటూ హామీ ఇచ్చారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న చంద్రబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కోసం మాత్రం పనిచేయకండి అంటూ సూచించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి సిద్ధమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫించన్ విధానాన్ని ప్రారంభించిందే టీడీపీ ప్రభుత్వం అని పేర్కొంటూ తాము అధికారంలోకి వచ్చాక ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ మీద కూడా చంద్రబాబు సెటైర్లు వేశారు. ” మేము అధికారంలో ఉన్నప్పుడు ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం. జగన్ ఏమో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ఐదేళ్లలో వేరే ఉద్యోగాలు…
మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై విచారించిన హైకోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు దేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ప్రభుత్వం జుడిషియల్ విచారణ కోరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌జడ్జ్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు ప్రభుత్వం తెలిపింది. విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత ఇంజనీర్లను విధుల నుండి తొలగించినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసు కుంటున్నామని వివరించింది. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఆదివారం (మార్చి 3) నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్…